Category: Political Gossips

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల జాప్యం! జూబ్లీహిల్స్ ఎన్నిక త‌రువాతే స్థానిక యుద్ధం!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) సుప్రీంకోర్టు తీర్పు క్ర‌మంలో రాష్ట్ర ప్ర‌భుత్వం స్థానిక ఎన్నిక‌ల‌పై డైలమాలో ప‌డింది. ఒక‌డుగు ముందుకు రెండడుగులు మందుకా అన్న‌ట్టు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పూర్త‌య్యే వ‌ర‌కు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల జోలికి పోకుండా జాగ్ర‌త్త…

అప్పుడు స‌మంత‌.. ఇప్పుడు సుమంత్‌! స‌ర్కార్‌కు త‌ల‌వంపులు తెచ్చిపెట్టిన కొండా ఫ్యామిలీ! చేసేవి బెదిరింపు రాజ‌కీయాలు! కాపాడుకునేందుకు బీసీ కార్డు ప్ర‌యోగం!! రేవంత్ స‌ర్కార్‌కు త‌ల‌నొప్పి వ్య‌వ‌హారంలా సురేఖ తీరు! ప్ర‌తిప‌క్షాల‌కు అస్త్ర‌శ‌స్త్రాల‌ను అందిస్తున్న నేత‌ల స‌మ‌న్వ‌య లేమి!

(దండుగుల శ్రీ‌నివాస్‌) పొన్నం ప్ర‌భాక‌ర్ ఎపిసోడ్ మ‌రిచిపోక‌ముందే.. ఆ త‌ల‌నొప్పి వ్య‌వ‌హారాన్ని ఇంకా చ‌క్క‌దిద్ద‌క‌ముందే.. కొండా ఫ్యామిలీ రూపంలో రేవంత్ స‌ర్కార్‌కు మ‌రో త‌ల‌వంపుల ఘ‌ట్టం ఎదురైంది. మంత్రి కొండా సురేఖ వ్య‌వ‌హార శైలి మొద‌టి నుంచి అంతే. వివాద‌స్ప‌దం. కొండా…

ఆత్మ‌వంచ‌న వీడి…. అభిమానుల మాట విని! కేసీఆర్ చెట్టునీడను వ‌దిలేసిన క‌విత‌! ఇక‌పై త‌న కార్య‌క్ర‌మాల‌కు ఫోటో వాడుకోవ‌ద్ద‌ని నిర్ణ‌యం.. ఈ నెల 25 నుంచి జాగృతి జ‌నంబాట యాత్ర‌కు శ్రీ‌కారం

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఎట్ట‌కేల‌కు క‌విత ఆత్మ‌వంచ‌న వీడింది. అవును.. ఆమె మొన్న‌టి దాకా డ‌బుల్ గేమ్ ప్లే చేసింది. ఓవైపు బీఆరెస్‌ను తుక్కు తుక్కు తిట్టాలె. అంతా అవినీతి జ‌రిగింద‌ని, హ‌రీశ్‌, సంతోష్ రావులు దొంగ‌ల‌ని ధ్వ‌జ‌మెత్తాలె… కానీ కేసీఆర్‌కు పాపం…

అవును మేం త‌ప్పుచేశాం! క‌విత పశ్చాత్తాపం.. తండ్రి ప‌రిపాలన‌పై తొలిసారి ధ్వ‌జం!! గ‌త ప్ర‌భుత్వంలో నేను కూడా భాగ‌స్వామినే.. త‌ప్పు జ‌రిగింద‌ని ఒప్పుకుంటున్నా! కేసీఆర్ ప‌రిపాల‌న‌లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయి… గ్రూపు-1 విద్యార్థుల‌కు న్యాయం జ‌ర‌గాలె!

వాస్త‌వం ప్ర‌ధాన ప్ర‌తినిధి- హైదరాబాద్‌ గంగా.. చంద్ర‌ముఖిగా మారిన‌ట్టు.. క‌విత ఒక ప్ర‌తిప‌క్ష పార్టీ లీడ‌ర్‌గా మారుతోంది. ఇటీవ‌ల ఆమె ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పింది. నాకు బీఆరెస్ కూడా ఓ కాంగ్రెస్‌, బీజేపీలాగేన‌ని. అంటే ఆమె ఇక నాన్న‌, కేసీఆర్.. అనే…

బీసీ యువ‌కుడికే రేవంత్ ఓకే! జూబ్లీహిల్స్ టికెట్ న‌వీన్ యాద‌వ్‌కు కేటాయింపు!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఇప్పుడంతా బీసీ మంత్రం న‌డుస్తోంది. కాంగ్రెస్ బాట‌లు వేస్తోంది. ఇత‌ర పార్టీలు అనుస‌రించాల్సిన ఆగ‌త్యం ఆస‌న్న‌మైంది. అనివార్య‌మైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ త‌మ పార్టీ అభ్య‌ర్థిగా బీసీ యువ‌కుడినే ఎంచుకున్న‌ది. 41 ఏళ్ల న‌వీన్ యాద‌వ్‌ను…

పాపం.. క‌విత‌! రాజీనామా ఆమోదానికి ఇష్ట‌ప‌డ‌ని స‌ర్కార్‌!! ఆమెను మోసం చేశార‌నే సానుభూతి… ఎమ్మెల్సీగా కొన‌సాగితేనే బెట‌ర‌నుకుంటున్న కాంగ్రెస్‌! ఇక ఆమె మాజీ కాదు.. ఎమ్మెల్సీ క‌విత‌నే!

(దండుగుల శ్రీ‌నివాస్‌) క‌విత‌పై స‌ర్కార్ సానుభూతి చూపిస్తోంది. ఆమెను ఆ కుటుంబం బ‌ల‌వంతంగా, మోస‌పూరితంగా బ‌య‌ట‌కు గెంటేశార‌నే భావ‌న‌లో ఉంది. ఆమెను రాజ‌కీయంగా ఏకాకిని చేశార‌నే సింప‌తీ క‌న‌న‌బ‌రుస్తోంది. అంతిమంగా ఆమె రాజీనామా చేసిన ఎమ్మెల్సీ ప‌ద‌విని కోల్పోవడాన్ని ఇష్ట‌ప‌డ‌టం లేద‌ని…

స‌ర్వేల‌న్నీ కాంగ్రెస్ వైపు! జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు అధికార పార్టీదే!! స‌ర్కార్‌పై పెరుగుతున్న న‌మ్మ‌కం.. సిటీలో పుంజుకుంటున్న కాంగ్రెస్‌!

వాస్త‌వం ప్ర‌ధాన ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌: సిటీలో కాంగ్రెస్ పుంజుకుంటున్న‌ది. ఇక్క‌డ ఒక‌ప్పుడు బీఆరెస్‌దే హ‌వా. ప‌దేండ్ల‌లో బీఆరెస్ మొత్తం సిటీని తన హ‌స్తగ‌తం చేసుకున్న‌ది. చాలా మంది సెటిల‌ర్లు కూడా ఇక‌పై బీఆరెస్ ఇక్క‌డ అధికారంలో ఉండ‌బోతుంద‌ని అనుకుని దానివైపే…

దున్న‌పోతు ల‌కు మ‌హేశ్ మాస్ వార్నింగ్‌!

(దండుగుల శ్రీ‌నివాస్‌) అది క‌చ్చితంగా నోటి దురుసే. ఎక్క‌డ ఏం మాట్లాడుత‌న్నామో కూడా తెలియ‌ని సోయిలేనిత‌నం. ఏమ‌న్నా మాట్లాడొచ్చ‌నే పొగుర‌బోతుత‌నం. ఏం అవుతుందిలే అని ప‌క్క‌వారిని చుల‌క‌న‌గా చూసే దొర‌త‌నం. పేరుకు బీసీ.. కానీ ఆ నోరు దున్న‌పోతులా రంకెలేస్తుంది. ఇవ‌న్నీ…

బీసీల కోసం ఒకే ఒక్క‌డు! రిజ‌ర్వేష‌న్ల అమ‌లు కోసం కాంగ్రెస్ తండ్లాట‌!! ఒడ్డున కూర్చుని త‌మాషా చూస్తున్న బీఆరెస్‌, బీజేపీ… కాంగ్రెస్‌కు పెరుగుతున్న బీసీల మ‌ద్ద‌తు.. ఆ రెండు పార్టీలు త‌మ‌కు వ్య‌తిరేక‌మ‌నే భావ‌న లోక‌ల్ బాడీ ఎన్నిక‌ల‌కు ముందు… కాంగ్రెస్‌కు క‌లిసి వ‌స్తున్న బీసీ రిజ‌ర్వేష‌న్ల పోరాటం… న్యాయ‌పోరాటంలోనే అంతే ప‌ట్టుద‌ల‌తో స‌ర్కార్ ముందుకు…!

(దండుగుల శ్రీ‌నివాస్‌) బీసీల రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో బీఆరెస్‌, బీజేపీలు చేస్తున్న‌, క‌వ్విస్తున్న విష‌యాలు, అంశాలు నోటితో న‌వ్వుతూ నొస‌టితో వెక్కిరించిన‌ట్టుగానే ఉన్నాయి. పైకి ప్రేమ చూపిస్తూ లోలోప‌ల, ప‌రోక్షంగా క‌త్తులు దూస్తున్న విష‌యం అంతా గ‌మ‌నిస్తున్నారు. బీసీల వ్య‌తిరేక పార్టీలుగా ఆ…

అది ఆర్జీవీ మార్క్ వోడ్కా మ‌త్తేనా? ఇదేందివ్యా రాహుల్ గిట్లెందుకు జేసివ‌న్‌!?

(దండుగుల శ్రీ‌నివాస్‌) అది ఆర్జీవీ వోడ్కా మ‌త్తులాంటిదేనా? అంతేనంటున్నారంతా. పాపం.. రాహుల్ రామ‌కృష్ణ‌.. పూర్వ‌శ్ర‌మంలో జ‌ర్న‌లిస్టే అయినా.. ప్ర‌శ్నించే విధానం ఇది కాదేమో? స‌మ‌యం, సంద‌ర్భ‌మూ తెలియ‌లేదంటూ..ఒళ్లు, సోయి తెల్వ‌కుండానే ట్వీట్ చేశాడేమో. అంతేనంటున్నారంతా. త‌న మానాన త‌ను న‌టించుకుంటూ పోయి…