నాగమడుగు ఎత్తిపోతల పథకం శంఖుస్టాపనకు వచ్చి .. పిట్లంలో బహిరంగ సభలో మాట్లాడిన మంత్రి కేటీఆర్.. జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పై ప్రశంసల జల్లులు కురిపించాడు. ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించి పలకరించే షిండే… తన కోసం, తన వ్యక్తిగత పనుల కోసం ఏనాడూ తమ వద్దకు రాలేదని, తన జుక్కల్ నియోజకవర్గ ప్రజల అభ్యున్నతి కోసం, సంక్షేమం కోసం, ప్రాజెక్టులు, పరిశ్రమల స్థాపన కోసమే వచ్చి అడిగేవాడని, ఇంత గొప్పనాయకుడు మీకు దొరకడం అదృష్టమని కేటీఆర్ అభివర్ణించారు.
నాగమడుగు ద్వారా 40 వేల ఎకరాలకు సాగు నీరందించేందుకు ఎమ్మెల్యే పడిన శ్రమ అంతా ఇంతా కాదని, ఆయన జీవితధన్యమైందని కేటీఆర్ అన్నారు. గతంలో ఆయనను 30వేల పై చిలుకు మెజారిటీ గెలిపించారని, ఈసారి కచ్చితంగా 75 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించుకోవాలని, గంగారం, దొంగారాంలను ఎవరినీ పట్టించుకోవద్దని కాంగ్రెస్ అభ్యర్థి సౌదాగర్ గంగారాం నుద్దేశించి ఎద పరోక్షంగా ఎత్తిపొడిచారు కేసీఆర్.