బాజిరెడ్డి గోవర్దన్‌…. మాస్‌ లీడర్‌. జనం నాడి తెలిసిన నేత. నాలుగు సార్లు ఎమ్మెల్యే. ఓటమెరుగని విజేత. జనం మెచ్చిన నాయకుడు. కానీ ఇప్పటి తరం వారికి బాజిరెడ్డి జీవితం గురించి లోతుగా తెలియదు. ఆయన తనయుడు జగన్‌ తన తండ్రి రాజకీయ జీవితాన్ని .. ఆయన కాల పరీక్షను, కష్టనష్టాలను ఓర్చుకుని తలబడి నిలబడి గెలిచిన తీరును వివరించారు. బాజిరెడ్డి సంకల్ప బలం ఎలాంటిదో.. ఆయన కమిట్‌మెంట్‌ ఎట్లుంటదో టూకీగా చెప్పినా.. కళ్లకు కట్టినట్టుగానే తెలియజేశారు. అదీ ఓ మంచి సందర్బం. సందర్భోచిత వేదిక పై.

డిచ్పల్లి 7th బెటాలియన్ పోలీస్ క్యాంప్ లో తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ నిజామాబాద్ గ్రామీణ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ , జిల్లా ఒలంపిక్ సంఘం ఉపాధ్యక్షులు
, జిల్లా యువ నాయకులు జడ్పిటిసి బాజిరెడ్డి జగన్మోహన్ ఆధ్వర్యంలో నిర్వహించిన “బాజిరెడ్డి ఫ్రీ కోచింగ్ సెంటర్” శిక్షణ కేంద్రం ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జగన్‌.. బాజిరెడ్డి గురించి తన మాటల్లో స్పూర్తి దాయకమైన ఆయన జీవితం గురించి వివరించి ఆకట్టుకున్నారిలా…

మన స్థానిక ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారు మీకు తెలుసు.. కానీ మీకంటే బాగా, మీ పెద్దవారికి బాజిరెడ్డి గోవర్ధన్ అంటే ఎక్కువగా తెలుసు. ఆర్మూర్ ఎమ్మెల్యేగా, బాన్సువాడ ఎమ్మెల్యేగా ఇప్పుడు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా… ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో అనేక సేవలందించారు. విద్యార్థులకు, ఆరోగ్య సేవలు, విద్యార్థులకు విద్యపరమైన సేవలు, ప్రజలకు డెవలప్మెంట్ పరంగా సేవలు ఇలా అనేక సేవా కార్యక్రమాలు ఎమ్మెల్యే గారు నిర్వహించారు. కానీ ఎక్కడ గాని తనకంటూ ఒక ఫౌండేషన్ గాని ట్రస్ట్ గాని ఏర్పాటు చేసుకోలేదు. గతంలో ఎమ్మెల్యే గారి మీద నక్సలైట్లు మూడుసార్లు అటాక్ చేశారు. అయినా ఆయనకేం కాలేదు. 66 సంవత్సరాల వయస్సులో మొన్న కోవిడ్ వల్ల 15 రోజులు యశోద హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఇలా ఆయనకు జీవితంలో అనేక ఆటంకాలు వచ్చినా.. ఆయన ప్రజలకు మంచి చేయాలని సేవ చేయాలని, సంకల్పించుకున్నారు. ఆ సంకల్పమే ఆయనను ఇప్పటికీ నడిపిస్తుంది. ఇప్పటికి కూడా చాలా చురుకుగా ప్రజలకు సేవలు అందిస్తున్నారు...అని వివరించారు జగన్‌.

ఇలా ఎమ్మెల్యే గారి, అనేక సేవలందించారు వారి నాయకత్వాన్ని చూసి ఎంతో కొంత చిన్నదైనా సరే ఇతరులకు సహాయ పడాలనే సంకల్పించింది ఈ ఫ్రీ కోచింగ్ ప్రిలిమ్స్ ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం నాకెంతో సంతోషాన్నిచ్చింది అన్నారు. బాజిరెడ్డి గోవర్ధన్ గారి నాయకత్వాన్ని చూసి ఆ నాయకత్వాన్ని అనుసరించాలని ఈ ఉచిత ట్రైనింగ్ ఒక గిఫ్ట్ గా యువతీ యువకులకు అందించడానికి నాకొక అవకాశం లభించిందన్నారు. యువతీ యువకులు ప్రిలిమ్స్ పాస్ అయిన తర్వాత ట్రైనింగ్ గురించి స్థానిక బెటాలియన్ సత్య శ్రీనివాసరావు గారు, అసిస్టెంట్ కమాండెంట్ వెంకటేశ్వర్లు గార్ల నుండి కమిట్మెంట్ తీసుకున్నాం, మాట ఇచ్చిన ప్రకారం రిజల్ట్ చాలా బాగుంది. నాకు చాలా సంతోషంగా ఉంది అని ఆయన అన్నారు.

మీ అందరికీ మరోసారి అభినందలు తెలియజేస్తూ మీకేమైనా మా నుండి సాయ సహకారాలు కావాలంటే ఇతర కోచింగ్ సెంటర్లు కావాలంటే మమ్ములను సంప్రదించండి మేము ఎల్లవేళలా మీకు సహాయ సహకారాలు అందిస్తామని  ఆయన పేర్కొన్నారు.

మనం ఏదైనా సంకల్పించుకుంటే, మనం ప్రయత్నిస్తుంటే ఆ విశ్వమే మన దగ్గరికి ఏదో ఒక రూపంలో మన దగ్గరికి తీసుకొస్తాది అన్నదానికి ఈ ట్రైనింగ్ క్యాంప్ అనేది ఒక నిదర్శనం అని ఆయన పేర్కొన్నారు.మీరందరూ మీ యొక్క లక్ష్యాన్ని చేరుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, గొప్ప విజయాలు సాధించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నానని ఆయన అన్నారు

You missed