నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, ఆర్టీసి చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, యువనేత, ఒలంపిక్ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, ధర్పల్లి జడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డి జగన్మోహన్‌ల చొవర, స్పూర్తి తమను ఉద్యోగులను చేసి కొత్త జీవితాలనిస్తున్నాయని ఎస్సై, కానిస్టేబుళ్ల ఉద్యోగార్థులు అన్నారు. ఇవాళ ఈవెంట్ కోచింగ్ చివరి రోజు. ఆ కార్యక్రమానికి జగన్‌ను ఆహ్వానించారు. డిచ్‌పల్లిలో ఏడో బెటలియన్‌లో కోచింగ్ ఇచ్చారు. ఉచిత కోచింగ్ అందించేందుకు కావాల్సిన స్టడీ మెటీరియల్స్, సౌకర్యాల కల్పన అంతా జగన్ దగ్గరుండి చూసుకున్నారు. దాదాపు ౩౦౦ మంది వరకు ఉచిత కోచింగ్‌లో పాల్గొనగా.. .ఇందులో 90 శాతం క్వాలిఫై అయ్యారు. వీరికి ఈవెంట్ కోచింగ్‌ను కూడా ఉచితంగా అందించారు బాజిరెడ్డి గోవర్దన్, జగన్‌లు. ఎప్పటికప్పుడు జగన్ వారితో ఇంటరాక్ట్ అవుతూ వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతూ వచ్చారు. స్పూర్తిగా నిలిచారు. కావల్సిన సదుపాయాలు, సౌకర్యాలు కల్పించే విషయంలో శ్రద్ద వహించారు. దగ్గరుండి మరీ చూసుకున్నారు. ఇదే విషయాన్ని అక్కడ కోచింగ్ తీసుకున్న ఉద్యోగార్థులు గుర్తు చేసుకున్నారు. జగన్ ప్రసంగం తమలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని,స్పూర్తిదాయకంగా నిలిచారని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ కోసం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో భాగంగా ఎస్సై పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్ ఏర్పాటు చేశారు. అందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఈవెంట్ కోచింగ్ నిర్వహించి ఫైనల్‌కు వెళ్లే అభ్యర్థులకు ఆల్‌దిబెస్ట్ చెబుతూ వారిని ప్రోత్సహించారు. మంగళవారం డిచ్‌పల్లి మండలంలోని 7బెటాలియన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో కమాండర్స్ పాల్గొని అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేయడమే కాకుండా కోచింగ్ తీసుకున్న ప్రతి అభ్యర్థులు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు.
రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డికి కృతజ్ఞతలు :
ఈ సందర్బంగా ఎస్సై పోస్టులకు దరఖాస్తు చేసుకొని ఉచిత కోచింగ్ పొందిన అభ్యర్థులు రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఉచిత కోచింగ్ ఇప్పించడమే కాకుండా ఈవెంట్ కోచింగ్, సైతం ఇప్పించి మాకు వెన్ను దన్నుగా నిలిచారని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉత్సాహంగా శిక్షణ పొందామని పేర్కొన్నారు. రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్ గారికి, అదే విధంగా మమ్మల్ని మోటివేట్ చేస్తూ ప్రోత్సహించిన జడ్పిటిసి జగన్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. జీవితాంతం వీరు అందించిన సహకారాన్ని మరిచిపోమని అన్నారు.