ద‌ళిత‌బంధు స్కీం ప్రారంభించిన‌ట్లేన‌ని వాసాలమ‌ర్రి వేదిక‌గా సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించాడు. త‌ర్వాత హుజురాబాద్‌లో ప్రారంభించేది లాంఛ‌న‌మేన‌ని కూడా చెప్పుకొచ్చాడు. ద‌ళితులు ఆర్థికంగా అభివృద్ది చెందాల‌ని, ఆత్మ‌గౌరవంతో బ‌త‌కాల‌ని ఏదేదో చెప్పాడు. రొటీన్ స్పీచే.

కానీ .. మ‌ధ్య‌లో ఓ తిట్ల‌దండకం అందుకున్నాడు. కొంత‌మంది ఇది మంచిగ‌లేద‌ని.. అద‌ని, ఇద‌ని అంటున్నారు. గాడిద కొడుకులు.. స‌న్నాసి ముండాకొడుకులు. అన్నాడు. అనుకోకుండా ఈ తిట్ల‌దండ‌క‌మేందిరా బై అని కొద్ది సేపు అక్క‌డున్న‌వాళ్లంతా స్ట‌న్న‌య్యారు. కేసీఆర్ ఈ తిట్లు తిట్ట‌డం కొత్తేమీ కాదు. అంద‌రికీ అల‌వాటైపోయింది. కానీ .. సంద‌ర్భ‌మేంది? ఆ బూతు మాట‌ల భావాలేందీ? అదే అర్థం కాలేద‌క్క‌డున్న‌వాళ్ల‌కి.

ఈ స్కీంను అస‌లు ఎవ‌రూ వ‌ద్ద‌న‌లేదు. అంద‌రికీ కావాల‌ని కొంద‌రు. ద‌ళితులంద‌రికీ ఇవ్వాల‌ని మ‌రికొంద‌రు, రాష్ట్ర వ్యాప్తంగా అమ‌లు చేయాల‌ని ఇంకొంద‌రు అభిప్రాయ‌ప‌డ్డారు. రాజ‌కీయానికి ద‌ళితుల‌ను వాడుకోవ‌ద్దు… చిత్త‌శుద్ధితో దీన్ని అమ‌లు చేయాల‌ని అన్నారు. మ‌రి వాళ్లంతా ద‌ళితులే క‌దా. ద‌ళితుల‌కు సంక్షేమ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తూ మీరు ద‌ళితుల‌ను అడ్డంగా బూతులు తిట్ట‌డ‌మేందీ సారు?. చాలా సంద‌ర్భాల్లో కేసీఆర్ బ‌య‌ట‌ప‌డ‌తాడు. అచ్చం దొర‌లాగే ఉంటుంది బిహేవియ‌ర్‌. మాట‌లు, చేత‌లు. వీటిని అణుచుకునేందుకు, క‌నిపించ‌కుండా ఉండేందుకు చాలా ట్రై చేస్తాడు కానీ… అది బాడీలో స‌హ‌జ‌సిద్దంగా వ‌చ్చిన దొర‌త‌న‌మాయే.. అట్టే బ‌య‌ట‌ప‌డిపోతుంది.

కుల వివ‌క్ష ఉందంటూ బాధ‌ప‌డిపోతాడు. ఆయ‌నే పిచ్చిగా తిడ‌తాడు. వివ‌క్ష న‌ర‌న‌రాన పాతుకుపోయి ఉన్న స‌మాజంలో … దాన్ని తొల‌గించ‌డం అంత సులువేమీ కాదు. పీఠాలెక్కేదంతా దొర‌లే. మ‌రి దొర‌ల పాల‌న‌లో ఇలా కాక ఎలా ఉంటుంది? పైకి ఒక‌టి మాట్లాడాలె. లోప‌ల ప్ర‌వ‌ర్త‌న ఒక‌లా ఉండాలె. అప‌రిచితుడి ప్ర‌వ‌ర్త‌న తెలియక పాపం ప్ర‌జ‌లే ఫూల్స్ అవుతావుంటారు.

You missed