కరోనా వచ్చి ఆర్థికంగా అన్ని రంగాలు కుదేలవుతున్న సందర్భంలో కూడా సీఎం కేసీఆర్ పేదదలకండగా ఉండే.. ఆదుకునే సంక్షేమ పథకాలను మాత్రం ఆపలేదని , తెలంగాణ ఆనాటి విపత్కర సమయంలో కూడా పేదలకు అండగా నిలిచి దేశానికి ఆదర్శంగా నిలిచిందని జిల్లా టీఆరెస్ యువ నేత, జిల్లా పరిషత్ ఆర్థిక ప్రణాళిక సంఘం సభ్యులు, ధర్పల్లి జడ్పీటీసీ సభ్యులు బాజిరెడ్డి జగన్మోహన్ అన్నారు. సిరికొండ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు,కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను .. రాష్ట్ర ఆర్టీసి చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్ ఆదేశాల మేరకు లబ్ధిదారులకు గ్రామీణ శాసనసభ్యులు క్యాంప్ కార్యాలయంలో చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం 27 మంది లబ్దిదారులకు ₹ 27,03,132 లక్షల రూపాయలను చెక్కుల రూపంలో అందజేశారు.
ఈ సందర్బంగా జగన్ మాట్లాడుతూ…దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మీ లాంటి పథకాలు అమలు చేయడం లేదన్నారు. గతంలో పాలించిన కాంగ్రెస్,బిజెపి పాలకులు నిరుపేదింటి ఆడబిడ్డల గోసను పట్టించుకోలేదన్నరు. ఆడబిడ్డల వివాహాలకు అండగా నిలువాలనే ఆలోచన వారికి రాలేదని,సంక్షేమ పథకాల అమలు కేవలం సిఎం కెసిఆర్ కే సాధ్యమన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిందని గుర్తు చేశారు. ఆసరా ఫింఛన్ , రైతుల కోసం రైతు బంధు, రైతు భీమా, 24 గంటలు ఉచిత కరెంట్ , పేదల కోసం షాదీ ముబారక్ , కళ్యాణ లక్ష్మి వంటి అనేక పథకాలను అర్హులైన ప్రజలు అందుకోని ఎంతో ధీమాతో, ఆసరాతో అంటున్నారన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేనమామ కట్నంగా కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందని,పేద మధ్య తరగతి కుటుంబాలకు పెళ్లి ఖర్చులకు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న లక్ష నూట పదహారు రూపాయలు ఎంతగానో ఉపయోగపడుతుందని అని అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక జడ్పిటిసి మన్సింగ్ నాయక్ , మండల పార్టీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ , జిల్లా రైతు సమితి అధ్యక్షులు మంజుల , కెసిఆర్ సేవాదళ్ కన్వీనర్ కోర్వ దేవేందర్ ,సమన్వయ సమితి అధ్యక్షులు ఆకుల తిరుమల్ , జాగృతి కన్వీనర్ సాయి చందు , ఐటి సెల్ అధ్యక్షులు రాజేందర్ , రైతులు , స్థానిక సర్పంచులు , ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, మండల సీనియర్ నాయకులు, టిఆర్ఎస్ కార్యకర్తలు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.