ఉద్యమకారులను టీఆరెస్ పార్టీ విస్మరించింది. వేచి చూశారు. ఓపిక పట్టారు. ఓపిక నశించి ఎవరి దారి వారు చూసుకున్నారు. బీజేపీ కనిపించింది. మనసు చంపుకుని మరీ అందులో చేరారు. కానీ మనసో చోట.. తనువో చోట అన్నట్టుగానే ఉన్నారు. ఎంతైనా కలిసి కొట్లాడిన పార్టీ. ఉనికిని చాటి చెప్పిన వేదిక. ఉద్యమ స్పూర్తిని నింపిన చరిత్ర… కానీ రానురాను రాజకీయాలు మారిపోయాయి. ఫక్తు రాజకీయ పార్టీగా టీఆరెస్ అవతరించబోతుందని కేసీఆర్ ప్రకటించిన నాటి నుంచే ఉద్యమకారులకు మూడిందని చెప్పాలి. అధికారంలోకి రావడం కో సం కేసీఆర్ .. కొత్త వారికి అవకాశమిచ్చాడు.
కాంగ్రెస్‌ను పూర్తిగా జీవం లేకుండా చేశాడు. పరోక్షంగా బీజేపీ పుంజుకున్నది. దీంతో ఇప్పుడు తప్పు తెలిసి వచ్చింది. అందుకే మునుగోడు ఓ తప్పదిద్దుకునే అవకాశం కల్పించింది. అది ఉద్యమకారులను గుర్తించేలా చేసింది. ఒక్కొక్కరుగా ఈ వేదికలోకి వస్తున్నారు. ఓ కమిట్‌మెంట్‌తో. తాజాగా దాసోజు శ్రవణ్, స్వామిగౌడ్‌లు టీఆరెస్ గూటికి చేరనున్నారు. కేసీఆర్ చక్రం తిప్పాడు. దీంతో మళ్లీ ఉద్యమపక్షులంతా ఒక్క గూటికి చేరుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక పుణ్యం కట్టుకుంది. వీరి శ్రమకు ఇప్పటికైనా గుర్తింపు లభించింది. పార్టీ వీడినా .. కేసీఆర్‌పై గుర్రుగా ఉన్న మనసంతా ఇక్కడ్నే ఉంది వీరికి. ఇలా కాలం కలిసి వచ్చింది. మళ్లీ కలిసేలా చేసింది. క లిసి పనిచేసి ఇప్పటికైనా వీరికి గుర్తుంపు వచ్చేలా చేసింది. మునుగోడు జిందాబాద్….