పరిచయాలు -పార్శ్వాలు:
మూడున్నర దశాబ్దాల క్రితం
ఎస్వీ యూనివర్సిటిలో ఎం ఫిల్ చేసే సమయంలో
శేఖర్ రెడ్డి, రాజేంద్రప్రసాద్, నేనూ మరికొందరంకలిసి
‘స్పందన’ అనే రాత పత్రిక ఒకటి,రెండు సంచికలు తెచ్చాం
అంతే, మళ్ళీ కలుస్తామని ఊహించలేదు
కానీ 2002 లో ‘ఆంధ్రజ్యోతి’ పునఃప్రారంభమైనప్పుడు
అందులో నేను ప్రారంబించబోయే
సైన్స్ కాలమ్ గురించి చర్చించాలని వెళ్ళినప్పుడు
ఎడిటర్ రామచంద్ర మూర్తి క్యాబిన్ లో
శేఖర్ రెడ్డి కనబడి సర్ప్రైజ్ చేశారు!
తర్వాత
‘నమస్తే తెలంగాణ’ సిఇఒ గా, ఎడిటర్‌గా
రాణించి…
ఇప్పుడు
తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం
కమిషనర్ గా సేవలందిస్తున్న
కట్టా శేఖర్ రెడ్డి గారికి హ్యాపీ బర్త్ డే!
— డా నాగసూరి వేణుగోపాల్, 20/10/2022, హై’బాద్
Nagasuri Venugopal