రెండో వేవ్ కు కారణమైన డెల్టా ను తీసుకొచ్చి వదిలారో లేక అది సహజంగా వచ్చిందో .. మొత్తానికి రెండో వేవ్ విషయం లో నా అంచనాలు తప్పాయి . మూడో వేవ్ రాదు అని చెప్పాను. ఈ సారి కూడా నేను ఫూల్ అవుతానా ?

ఈ అనుమానం నన్ను వెంటాడుతోంది . కారణం ఎడతెరపి లేని ప్రచారం . ” ముంచుకొస్తున్న మూడో వేవ్ .. కేరళ లో .. మహారాష్ట్ర లో .. తూర్పు గోదావరి జిలాల్లో మొదలు” .. ఇలా రోజూ వార్తలు .. నిజామా? అని నేను ఉలిక్కి పడి చెక్ చేసుకోవడం . కేరళకు ఫోన్ .. అక్కడ నాకు పరిచయం ఉన్న కొంత మంది పాత్రికేయులు .. ఇద్దరు ముగ్గురు ఐఏఎస్ అధికారులు .. “కేరళలో గతం లో కట్టడి కచ్చితంగా చేసారు .. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ మందికే ఇప్పటిదాకా సోకింది . సిరో సర్వే ప్రకారం కేవలం నలబై శాతానికి మాత్రమే సోకింది . లాక్ డౌన్ ల తో ప్రజలు విసిగిపోయారు . ఇప్పుడు లాక్ డౌన్ వున్నా , కచ్చితంగా అమలు కావడం లేదు . అసలే వేగంగా విస్తరించే డెల్టా . దీనితో రెండో దశ ఇంకా సాగుతోంది . ఎన్ని లాక్ డౌన్ లు పెట్టినా అది ఇంకో నెల కు పైగా కొనసాగుతుంది “. ఇది వారు ఇచ్చిన సమాచారం .

మహారాష్ట్ర లో కేసులు పెరుగుతున్నాయా ? లేదు . ఎక్కడో ఒకటి రెండు గ్రామాల్లో, గతంలో పెద్దగా ప్రభావితం కాని చోట్ల కొత్తగా కేసులు వస్తున్నాయి . ఇది నాకు అర్థం అయ్యింది . అంటే అక్కడ కూడా ఒకటి రెండు చోట్ల కొనసాగుతున్న రెండో వేవ్ .

గాంధీ ఆసుపత్రిలో కరోనా వార్డ్ నిండుకొంది.. అంటే తెలంగాణ లో మూడో వేవ్ మొదలయ్యింది అని మరో వార్త . నిజామా? అని ఒక కీలక వ్యక్తిని అడిగాను . సార్ అది నిజం అయితే ఇదేంటి అని ఒక సర్కులర్ పంపారు . ఆగష్టు మూడో తేదీ నుంచి గాంధీ ఆసుపత్రిలో జనరల్ సేవలు కూడా ప్రారంభించాలి ని ఆ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఇచ్చిన ఉత్తరువు ఆది. నిజమే .. సిటీ లో ఇంకా నల్గొండ ఖమ్మం లో కొన్ని గ్రామాల్లో కొద్దీ పాటి కేసులు . నాకు మెసెంజర్ లో రోజుకు ఒకటి రెండు చొప్పున కేసులు .

ప్రభుత్వం చేసిన సీరో సర్వే కంటే ముందే నేను అంచనా వేసాను . కనీసం 70 శాతానికి సోకింది . వారికి ఆంటీ బాడీ లు వచ్చాయి . ఇంకా వాక్సిన్ వేసుకొన్న వారు .. వీరి సంఖ్య పెరుగుతోంది. ఇక పిల్లలు .. వారికి సోకినా ఏమీ కాదు . మరో కోణం లో చూస్తే పిలల్లకు కూడా టీకా వచ్చేస్తోంది . సెప్టెంబర్ కల్లా పిల్లల టీకా రెడీ . ఒక సారి సోకితే వచ్చే ఆంటీ బాడీ లు కనీసం 6 – 8 నెలలు ఉంటాయి . ఏప్రిల్ మే నెలల్లో కోట్ల మంది డెల్టా బారిన పడ్డారు . వీరికి కనీసం డిసెంబర్ దాకా రాదు . ఇటుపైన టి సెల్స్ రక్షణ ఉంటుంది . ఇక టీకా లు .. బూస్టర్ లు .. హార్లిక్స్ లు .. బోర్నవిటా లు ఎలాగూ వస్తాయి . ఇంకేంటి? .. ఇది నా ఆలోచన .

ఇంటర్ లో మా తెలుగు లెక్చరర్ నిన్న కరోనా తో సీఎంసీ ఆసుపత్రిలో చేరారు . అయన పరిస్థితి సీరియస్ గా వుంది . ఆయనకు రెండు డోసులు పూర్తయ్యాయి . ఇలా ఒకటి రెండు ఘటనలు జరుగుతూనే వున్నాయి . కానీ టీకా వేసుకొన్న వారిలో ఎంత మందికి ఇలా అవుతోంది ? ఇంగ్లాండ్ నే తీసుకొందాము. టీకా కార్యక్రమం పూర్తయ్యింది . అయినా రోజుకు యాభై వేల కేసులు . కానీ మరణాలు దగ్గరకు వస్తే కేవలం యాభై అరవై లోపు . అదే టీకా కార్యక్రమం సరిగా మొదలు కానీ ఇండోనేషియా లో యాభై వేల కేసులకు రెండు వేల మరణాలు . దేన్నీ బట్టి అర్థం అయిందేమిటి ?

టీకాలు రెండు కాదు .. నాలుగు వేసుకో .. కేసులు కేసులు అంటూ లెక్క పెడితే వస్తూనే ఉంటాయి . కానీ ఎవరో మరీ ఇమ్మ్యూనిటి వ్యవస్థ బలహీనంగా ఉన్న వారికి అంటే లక్ష మందిలో ఒకరికే ప్రాణం మీదకు వస్తుంది . వేవ్ అంటే లక్షల మంది కరోనా బారిన పడడం.. అంత కంటే మించి వేలమంది ఆసుపత్రులకు వెళ్లే స్థితి ఏర్పడడం . దేశం లో డెబ్భై శాతానికి కరోనా సోకినప్పుడు ఈ స్థితి రాదు .. అక్కడక్కడా కేసులు వస్తాయి . గతం లో సోకని వారికి టీకా లు వేసుకోని వారికి సోకుతుంది . టీకా లు వేసుకొన్న వారికి సోకదు . సోకినా ఏమీ కాదు . అలాగే ఒకటవ వేవ్ లో సోకినా వారికి అంటి బాడీ లు పోయినా టి సెల్స్ రక్షణ ఉంటుంది . రెండో వేవ్ లో సోకినా వారికైతే డెల్టా అంటి బాడీ లు ఉంటాయి . ఇప్పుడు కొత్త వేరియెంట్ వచ్చినా ఏమీ కాదు . ఇది నేను చెప్పేది .

పిచ్చి వార్తలు చదివి రోజూ భయపడితే ఇమ్మ్యూనిటి చస్తుంది . అప్పుడు వంద వాక్సిన్ లు కూడా రక్షించలేవు . ఒకటవ వేవ్ లో సోకి రెండో వేవ్ లో సోకి .. మళ్ళీ టీకా వేసుకున్నా.. పిచ్చి పిచ్చి అలవాట్లు దానికి తోడు పిచ్చి భయాలు పెట్టుకొంటే కరోనా తో ఖతం కావడం ఖాయం . నిందాపూర్వకంగా వున్నా ఇది నిజం .

మంచి పోషకాహారం .. వ్యాయామం .. మంచి నిద్ర .. పాజిటివ్ ఫీలింగ్స్ .. ఇవి ఉంటే . ఇవి చేస్తే కరోనా కాదు .. బరోనా వచ్చినా ఏమి కాదు . దీనికి తోడు టీకా వేసుకోండి . మాస్క్ పెట్టుకోండి అని కూడా నేను చెబుతున్నా. మూడో వేవ్ భయం తో ఇంటిలో పడుకొని కుటుంబాన్ని దేశాన్ని నాశనం చెయ్యొద్దు .. పని లో పడండి.. ఇది నా మాటల సారం .

ఇంకా సింపుల్ గా చెబుతాను . కాకులు నల్లగా ఉంటాయి అని అంటాను నేను .. లేదు కాకులు తెల్లగా ఉంటాయి . మొన్న జూ లో తెల్ల కాకి చూసాము అని కొంతమంది . ఒక తెల్ల కాకిని చూపి కాకులకు కరోనా సోకింది .. అందుకే అవి తెల్లగా మారుతున్నాయి అని మరో పక్క ప్రచారం . లేదు స్వామీ కాకులు నల్లగా ఉంటాయి అంటే .. అక్కడ తెల్ల కాకి వుంది .. దాని సంగతి ఏంటి అని నాకు ప్రశ్న .

చివరిగా ఒక మాట . తెల్ల కాకమ్మ కథ నిజం అయితే అదేనండి మన దేశం లో మూడ్ వేవ్ స్టార్ట్ అయితే గియితే ముందుగా నేనే పోస్ట్ చేస్తాను . పొద్దున్న మద్యాహ్నం , సాయంకాలం అదే పనిగా చెక్ చేసుకొంటున్నా. స్కూల్ స్టార్ట్ కావాలనే ఇవన్నీ చేస్తున్నా. అనుకొనే అనుమానపు పురుగులకు ఒక మాట .. మా ఆన్లైన్ క్లాసులు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి . కరోనా పేరుతొ మరో పదేళ్లు పాఠశాలలు తెరవక పోయినా యాజమాన్య కోణం నుంచి చూస్తే నాకు నష్టం లేదు . పిల్లల కోణం నుంచి చూస్తే మాత్రం వెంటనే ప్రారంభం కావాలి అనిపిస్తుంది .

Amarnath Vasireddy