అంద‌రూ క‌రోనా మ‌రిచిపోయి సాధార‌ణ జీవితాల్లో ప‌డిపోతున్న వేళ‌… జ‌రిగిన న‌ష్టాల నుంచి కోలుకునే ప్ర‌య‌త్నం చేస్తున్న వేళ‌….. ఇక పీడా పోయింది అని క‌రోనా పై ద‌మ్మెత్తిపోసి … దందాల‌పై దృష్టి సారించిన సంద‌ర్భం… ఉద్యోగాల్లేక రోడ్డున ప‌డ్డ బ‌తుకులు ఉపాధి వెతుక్కుంటున్న స‌మ‌యం…..

అంతా బాగా ఉంది.. ఇక అనుకుని ఊపిరి తీసుకుంట‌న్న వేళ‌.. మ‌ళ్లీ నాలుగో వేవ్ పేరుతో కొత్త భ‌యం..

ఇక వ‌చ్చేస్తుంది జాగ్ర‌త్త‌.. జూన్ నెలాఖ‌రున వ‌చ్చి నాలుగు నెల‌లు మీ వెంటే ఉంటుంద‌నే వార్త.

నిన్న‌టి నుంచి ఈ ప్ర‌చారం జోరందుకున్న‌ది.

కాన్పూర్ ఐఐటీ ప‌రిశోధ‌కులు ఈ విష‌యాన్ని క‌నుగొన్నార‌ట‌..

ఒమిక్రాన్‌.. థ‌ర్డ్ వేవ్ పేరుతో భ‌య‌పెట్టే ప్ర‌య‌త్నం చేసి తోక ముడుచుకున్న మెడిక‌ల్ మాఫియాకు ఈ కొత్త వార్త మ‌ళ్లీ కొత్త ఊపిరిలూదిన‌ట్లైంది. దాని ర‌క్త దాహం ఇంక తీర‌లేదు. అదెప్ప‌టికీ తీర‌దు.

మూడో వేవ్‌లో దాహార్తిని తీర్చుకుందామ‌ని ఎంత ప్ర‌య‌త్నించినా కుద‌ర‌లేదు. ఇప్పుడు నాలుగో వేవ్ ముహూర్తం ఖ‌రార‌య్యింది క‌దా.. ఆ రోజుల కోసం ఎదురుచూస్తున్న‌ది.

దీని ప్ర‌భావం ఎలా ఉంటుందో చెప్ప‌కుండా.. భ‌య‌పెట్టే ఈ వార్త‌ల వ‌ల్ల .. అది వ‌చ్చినా ఏమీ కాద‌నే భ‌రోసా లేని ప్ర‌చారాల వ‌ల్ల ఏమాత్రం ఉప‌యోగం లేదు. కోలుకుంటున్న వ్య‌వ‌స్థ‌ను మ‌ళ్లీ దెబ్బ తీయ‌డ‌మే అవుతుంది. దీనిపై తొంద‌ర‌గా ప్ర‌భుత్వాలు మేలుకోవాలి. స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న చేయాలి. భ‌యాల్ని తొల‌గించాలి. మ‌న‌మూ భ‌య‌పెట్టేస్తే పోలా…. మాస్కు పెట్టుకోండి.. శానిటైజ‌ర్ రుద్దుకోండ‌ని ఓ ప్ర‌క‌ట‌నిస్తే మ‌న మీద‌కు బ‌ద్నాం రాదు క‌దా అని ఆలోచిస్తే.. అంతే సంగ‌తులు. మ‌ళ్లీ వ్య‌వ‌స్థ గాడి త‌ప్పి… బ‌తుకులు రోడ్డున ప‌డ‌తాయి.

You missed