పత్రికల్లో , టీవీ ఛానెళ్లలో కరోనా భయానక వార్తలు బాగా తగ్గిపోయాయి .
కలకలం , ఉదృతి , పంజా , లాక్ డౌన్ లాంటి వార్తల స్థానం లో, పారాసెటమోల్ తో తగ్గిపోతుంది లాంటి వాస్తవికత ఆధార వార్తలు వస్తున్నాయి .
ఇది శుభ పరిణామము .
మొదటి రెండు వేవ్ ల లో కరోనా వల్ల ఎంత నష్టపోయారో అంతకు అనేక రెట్లు, భయం తో , భయం వల్ల తీసుకొన్న
పిచ్చి మందులతో అన్నిటికీ మించి స్ట్రెస్ తో జనాలు నష్టపోయారు .
ఇప్పటికైనా వాస్తవాలు అందరికీ అర్థం అయితే పరిస్థితి చక్కపడుతుంది .
కరోనా నుంచి కోలుకొన్నా ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయా ? దానికి కారణం కరోనా నా ? లేక గతం లో కరోనా చికిత్స కోసం వాడిన మందులా ? ఇప్పుడు పోస్ట్ ఓమిక్రాన్ సమస్యలు అంటే ఓమిక్రాన్ నుంచి కోలుకున్నాక కూడా ఆరోగ్య సమస్యలు ఉంటాయా ? దీనికి తోడు వాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ అనేది నిజామా ? ఏమి చెయ్యాలి ? .. తిరిగి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఎలా పొందాలి ? దీని పై ఈ రోజు పోస్ట్ పెడతాను .
కరోనా నుంచి కోలుకున్నాక మూడు నెలలు వరకూ వాక్సిన్ ఇవ్వకూడదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది . ఇప్పుడు ఓమిక్రాన్ సోకని వారు లేరు . లక్షణాలతో పది మంది .. లక్షణాలు లేక వంద మంది . ఈ నేపథ్యం లో వాక్సిన్ ఇవ్వడం ఆపేయాలి . అసలు ఓమిక్రాన్ తో ప్రమాదం లేదని స్పష్టంగా రుజువు అయిపోయినప్పుడు ఎమర్జెన్సీ అప్రూవల్ పొందిన వాక్సిన్ ను అదీ బలవంత పెట్టి ఇవ్వాల్సిన అవసరం ఏముంది ?
ఒక వేళా అరివీర భయంకర వేరియెంట్ … ఏది సోకితే నిమషం లో ప్రాణం పోతుందో అలాటి వేరియెంట్ రేపు వచ్చినప్పుడు వాక్సిన్ వేసుకోవచ్చు . { అలంటి వేరియెంట్ రావడానికి ఇదేమైనా రాజమౌళి సినిమా నా ? ఇదేమైనా గ్రాఫిక్సా ? వచ్చేది లేదు .. చచ్చేది లేదు .. కేవలం ఫార్మసుర ఏజెంట్ ల పిచ్చ ప్రేలాపన } . ఈ లోగా ఈ వాక్సిన్ ఏదయితో ఉందొ దానికి పూర్తి స్థాయి అప్రూవల్ రావాలి. వాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ పై ప్రభుత్వ అధ్యయనం జరగాలి .
మందులతో , సూదులతో ఆరోగ్యం రాదు . మంచి తిండి , నిద్ర , విశ్రాంతి , ఆనందకరమైన జీవన విధానం .. ఇదీ ఆరోగ్యాన్ని ఇచ్చేది . డబిచ్చి ఆరోగ్యాన్ని కొనలేవు . ఆరోగ్య జీవనానికి షార్ట్ కట్స్ లేవు . ఆరోగ్యం కోసం ఆసుపత్రికి కాదు .. మైదానం లోకి పరుగెత్తు . ఆరోగ్యం కోసం కలవాల్సింది వైద్యులను కాదు .. స్నేహితులను బంధువులను . ఆరోగ్యం డబ్బాల్లో , ప్యాకెట్ ల లో దొరకదు .. పొలాల్లో , కూరగాయలు అమ్మే మార్కెట్ లో దొరుకుతుంది .
అందుకే .. మీరు నేను .. మనం అందరం ….
ఓ. ఓ .. ఓ ..
పరుగులు తీయాలి . అందరూ ఉరకలు వెయ్యాలి ..
హేయ్…
బిరబిర జరజర .. పరుగున పరుగున ఊరు చేరాలి ..
మన ఇల్లు చేరాలి ..
ఓ.. ఓఓఓ .. ఓఓఓ ..
గుండెపోట్లు .. బీపీ లు .. గుండెపోట్లు .. బిపి లు…. ముసిరే లోగా…. పానాలు తీసేలోగా ..
మన గమ్యం చేరాలి .. మన ఊరు చేరాలి ..
చకచక…. చకచక…. గ్లూకోస్ లెవెల్స్ .. ఢమఢమ…. ఢమఢమ…. స్ట్రెస్ లెవెల్స్
ఆ .. ఆ .. ఆ .. ఆ
గ్లూకోస్ లెవెల్స్…… స్ట్రెస్ లెవెల్స్
హద్దులు దాటి… ప్రాణాలు తీసేలోపు ..
బద్ధకం వదిలి….. సాకులు మాని..
వ్యాయామం చేసి , తిండి తినాలి .. మంచి తిండి తినాలి
ఆ .. ఆ .. ఆ .. ఆ ..
అవిగో అవిగో .. అవిగో అవిగో .
మాస్కు లు లేని ప్రపంచమదిగో..
నవయుగపు సమాజమదిగో .. ఆరోగ్య భారతమదిగో..
పచ్చని సంసారాలు .. ఆడే పిలల్లు ..
కళకళలాడే ఇంటి ప్రాంగణాలవిగో ..
నేను మిమ్మల్ని అడుగుతున్నా ..
ఏంపిల్లాడో ఎల్దామొస్తావా ?
ఏం పిల్లో ఎల్దామొస్తావా ?
ఏం పిల్లాడో ఎల్దామొస్తావా /
ఏం పిల్లో ఎల్దామొస్తావా ?
ఇంటి పక్కన మైదానానికి ..
ఇంటి దగ్గర కూరల మార్కెట్ కు ..
ఏం పిల్లడో ఎల్దామొస్తావా..
అందుబాటులో జిమ్ లోనికి
వీలున్న చోట యోగ క్లాసుకి ..
ఏం పిల్లడో ఎల్దామొస్తావా ? ఏం పిల్లో ఎల్దామొస్తావా .
ఫార్మాసురుల ఆట కట్టడానికి..
ఏం పిల్లడో ఎల్దామొస్తావా ?
సమర సింహాలై శంఖమూదుతూ ..
ఏం పిల్లో ఎల్దామొస్తావా ?
(Amarnath Vasireddy)