ఎన్నాళ్లకు ఓ మంచి ముచ్చట చెప్పాడు మన హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు. అదిగో తోక.. ఇదిగో పులి అంటూ జనాలను మరింత భయభ్రాంతులకు గురి చేస్తూ , ఒక్కో సారి ఒక్కో తరహాల మాట్లాడుతూ.. రాజకీయ నాయకుడిని మించిపోయినా… ఒక్కో సందర్భంలో పైశాచికానందం పొందినా.. చివరాఖరు ఇలా మంచి వార్తనే చెప్పాడు. ఇక ఆయన ప్రెస్మీట్లు లేకపోతే ఎంతో నయం. కరోనా నుంచి ఉపశమనం పొందినట్టే ఇకపై ఈయన కరోనా పై ఎలాంటి ప్రకటనలు చేయకపోతే బాగుండు. సరే, అతగానిపై మనకెందుకు కోపం గానీ, పాలకులు అసమర్థులైనప్పుడు ఇలా అధికారులు విర్రవీగుతూ ఉంటారు. అదీ కామనే అనుకో.
గుడ్ న్యూస్ .. ఏంటంటే.. కరోనా థర్డ్ వేవ్ ముగిసిందని. ఐటి కార్యకలాపాలకు ఇక వర్క్ ఫ్రొం హోమ్ అవసరం లేదని, తెలంగాణలో ఇక నుంచి ఎటువంటి ఆంక్షలు లేవని.
మనకు గుడ్ న్యూసే కానీ, మెడికల్ మాఫియాకు ఇది బ్యాడ్.. బ్యాడ్.. వెరీ బ్యాడ్ న్యూస్. ఒమెక్రాన్ అని ఇంకా ఏదో అని ఏదేదో ప్రచారం చేసి క్యాష్ చేసుకుందామని, జనాన్ని భయపెట్టాలని ఎంత ప్రయత్నించినా.. ఏమీ కాలేదు. జనాలు ఎవరూ భయపడలేదు సరికదా.. మాస్కులు కూడా పెట్టుకోకుండా బయట తిరిగారు. ఫస్ట్, సెకండ్ వేవ్‌లో కోట్లు సంపాదించినట్టే థర్డ్ వేవ్‌ను కూడా బంగారు బాతులా భావించారు. కానీ ఆఖరికి మాస్కుల గిరాకీ కూడా లేక ఈగలు కొట్టుకున్నారు.
మరి కోట్లు ఖర్చు చేసిన ఈ మెడికల్ మాఫియా ఊరికే ఉంటుందా..?
జనాలను ప్రశాంతంగా పడుకోనిస్తుందా..?
ఇంకేదైనా కొత్త వైరస్‌ను .. కొత్త రకాన్ని జోడించి బయటకు వదిలి ప్రాణాలతో వ్యాపారం మొదలుపెడుతుందా..?
అది రక్తం మరిగిన పులి.. మనల్ని ప్రశాంతంగా బతకనిచ్చే ప్రసక్తే లేదు.
