ఓమిక్రాన్ వేవ్ ముగిసిపోతోందా ?
గత ఆరు నెలలుగా .. అదిగో వేవ్ .. ఇదిగో వేవ్ అంటూ భయపెడుతూ వస్తూన్న మీడియా .. దీన్ని నమ్మి భయం గుప్పిట్లో కొంత మంది ! చివరకి వచ్చిందా ? వస్తే అంత తొందరగా ముగిసిపోబోతోందా ? అసలు తెలంగాణలో రాలేదా ? ఆంధ్ర ప్రదేశ్ సంగతి ఏంటి ?
1 . అసలు దీన్ని వేవ్ అనొచ్చా ?
వేవ్ అంటే కేవలం కేసులు పెరగడమేనా ? కేసులు అంటే కేవలం అంకెలేనా ? వేవ్ అంటే అంబులెన్సుల సైరెన్ లు .. ఆసుపత్రిలో చేరికలు . మరణాలు .. ఈ విధంగా చూస్తే అసలు ఇది వేవ్ కానే కాదు . కేవలం ఉత్తుత్తి కేసులు .. ఆసుపత్రిలో చేరికలు పెద్దగా లేవు .. మరణాలు కూడా లేవు . కేవలం కేసులనే వేవ్ అంటే ఇది వేవ్ కిందే లెక్క
అసలు ఆసుపత్రిలో చేరికలు లేవా ?
కరోనా { ఓమిక్రాన్ } సోకి ఆసుపత్రికి వెళ్లడం వేరు . కిడ్నీ డయాలిసిస్ కోసమో, హార్ట్ సర్జరీ కోసమో మరో అనారోగ్య సమస్యతో ఆసుపత్రికి వెళితే టెస్ట్ చేసి నప్పుడు కరోనా సోకినట్టు బయటపడితే ఆ వ్యక్తిని అక్కడ చేర్చుకొని కరోనా వల్ల ఆసుపత్రి లో చేరినట్టు లెక్క వేస్తారు . ఇలా ఆసుపత్రిలో చేరిన వారే అధిక శాతం . దీనికి తోడు ఢిల్లీ, ముంబై , బెంగళూరు లాంటి నగరాల్లో సంపన్న వర్గాలు , నాగరికుల్లో కరోనా భయం చాలా ఎక్కువ . .మనం భయం అంటే వారు అవగాహన అంటారు . జలుబు చేసినా ఉలిక్కి పడడం, వెంటనే టెస్ట్ చేసుకోవడం , కరోనా పాజిటివ్ అని తెలియగానే ఆసుపత్రిలో చేరడం ఇలాంటి నయా సంపన్న వర్గాల నయా ట్రెండ్ . అందుకే ముంబై ఢిల్లీ బెంగళూరు లాంటి నగరాల్లో కొద్దీ పాటి ఆసుపత్రి చేరికలు కనిపించాయి . కానీ అధిక శాతం బెడ్స్ ఖాళీగానే ఉండిపోయాయి .
మరణాలు లేవా ?
ఇప్పుడు వచ్చినవి కేవలం ఓమిక్రాన్ కేసులు కావు . తక్కువ శాతం లో డెల్టా కేసులు కూడా . ఓమిక్రాన్ వల్ల మరణించిన వారు దాదాపుగా ఎవరూ లేరు . ఒక వ్యక్తి గుండెపోటుతోనో కాన్సర్ తోనో మరణిస్తే ఆ వ్యక్తి మరణానికి ముందు టెస్ట్ చేసి పాజిటివ్ వస్తే దాన్ని కరోనా మరణంగా లెక్కిస్తారు . అలాంటి మరణాలు వున్నాయి . ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఓమిక్రాన్ తో మరణించిన వారు మన దేశం లో ఒక్కరే . మన దేశం లో ఈ నెల రోజుల్లో కొన్ని కోట్ల మందికి ఓమిక్రాన్ సోకింది అనేది వాస్తవం . ఈ పరంగా చూస్తే ఆసుపత్రి చేరికలు ఎన్ని ? మరణాలు ఏవి ?
2 . ఇది గ్రామీణ ప్రాంతాలకు విస్తరించదా ?
ఈ వేవ్ ప్రత్యేకత ఏమిటంటే ఇది ప్రధానంగా పట్టణ ప్రాంతాలకు పరిమితం .
ఎందుకిలా ?
ఆరోగ్యం బాగాలేక పొతే ఆసుపత్రికి పోవాలి . ఇది సహజం . ఒకటి రెండు సార్లు తుమ్ములు, కాస్త గొంతులో గరగర వస్తే ఉలిక్కి పడి” వామ్మో నాకు కరోనా వచ్చేసి నట్టుంది . వస్తే నా గతి ఏంటి దేవుడా ?” అని భయంతో టెస్ట్ లు చేయించుకునే స్థితి పట్టణ వాసుల్లోనే ఉంది. ఎక్కడైతే టెస్ట్ లు ఎక్కువ చేసుకున్నారో అక్కడే కేసులు పెరిగాయి . వేవ్ వచ్చినట్టు కనిపించింది .
జలుబు , కాస్త గొంతు నొప్పి వస్తేనే వెంటనే వెళ్లి టెస్ట్ చేసుకొనే స్థాయి భయం , అంత డబ్బు , ఓపిక , సమయం… గ్రామీణ వాసుల్లో కనిపించదు . ఓమిక్రాన్ చాలా వేగంగా విసరిస్తుంది . ఇది గ్రామీణ ప్రాంతాల్లోకి కూడా వెళ్ళింది . కానీ అక్కడ ఎక్కువ కేసులు కనిపించవు . కారణం గ్రామీణ వాసులు టెస్ట్ ల కు పెద్దగా వెళ్లలేదు .
ఒక మాటలో చెప్పాలి అంటే ఈ ఉత్తుత్తి వేవ్ కేవలం అయిదు మెట్రోపాలిటన్ నగరాల వేవ్ . ముంబై , ఢిల్లీ , బెంగళూరు ,కోల్కతా చెన్నై .. . ఎక్కడ ప్రజల్లో భయం ఉండి టెస్ట్ ల కోసం పరుగెట్టారో అక్కడే కేసులు కనిపించాయి .
ఈ వేవ్ ఎప్పుడు ముగుస్తుంది ?
ఈ వేవ్ ప్రత్యేకతలు రెండు .. 1 . పట్టణ ప్రాంతాలకు ముఖ్యంగా మెట్రో పోలిటన్ నగరాలకు పరిమితం . 2 ఈ వేవ్ రెండో ప్రత్యేకత ఎంత వేగంగా వచ్చిందో అంతే వేగంగా ముగిసి పోతుంది . ముంబై లో కేసులు తగ్గుముఖం పట్టడం మొదలయ్యింది . ముందుగా ముంబై లో జనవరి 20 కల్లా కేసులు భారీగా తగ్గిపోతాయి . ఈ నెల చివరికల్లా మిగతా మెట్రో నగరాల్లో కూడా ఇదే స్థితి . కేరళ , ఈశాన్య రాష్ట్రాలు తప్పించి మిగతా చోట్ల జనవరి చివరికల్లా ఈ ఉతుత్తి వేవ్ బాగా బలహీన పడి కేసులు బాగా తగ్గి పోతాయి .
కేసులు ఎప్పటికి జీరో కొస్తాయి ?
సున్నా కేసులు పరిస్థితి ఎప్పటికీ రాదు . ఈ వైరస్ ఇక్కడే ఉంటుంది . అది ఎక్కడికీ పోదు . నగర వాసులు భయం గుప్పిట్లో .. వీరు ఎన్ని బూస్టర్ డోసులు వేసుకున్నా అది ఆరు నెలలకు ఓకే సారి సోకుతూనే ఉంటుంది . దాన్ని పట్టించుకోని వారికి అది ఒక సాధారణ జలుబు . దాన్ని చూసి భయపడే వారికి అదొక భూతం .
తెలంగాణ లో వేవ్ ఎప్పుడు వస్తుంది ?
ఎప్పటికీ రాదు . తెలంగాణ లో గత నెల రోజులుగా ఇన్ఫెక్షన్స్ జరిగాయి . ఉలిక్కి పడి ఆసుపత్రులకు పరుగెత్తిన వారు తక్కువ . అందుకే కేసులు పెద్దగా కపించలేదు . ఇప్పడు హైదరాబాద్ సిటీ తో కలుపుకొని ఈ ఇన్ఫెక్షన్స్ తగ్గుముఖం పడుతున్నాయి . అంటే కేసుల పరంగా చూసుకొంటే తెలంగాణలో వేవ్ రానట్టే . నిజమైన ఇన్ఫెక్షన్స్ పరంగా చూసుకొంటే అవి వచ్చాయి .. పోయాయి . ఇక వారం రోజుల్లో చాల మటుకు ఇన్ఫెక్షన్స్ తగ్గిపోయే స్థితి .
మరి తెలంగాణ జిల్లాలు ?
హైదరాబాద్ ఎంతైనా మెట్రో నగరం . ముంబై బెంగళూరు లాగే ఇక్కడ కూడా కాస్త తక్కువ స్థాయిలో అయినా కరోనా భయస్తులు వున్నారు . వారు టెస్ట్ లకు వెళ్లారు . అందుకే కాస్త కేసుల పెరుగుదల కనిపించింది . అదే జిలాల్లో అయితే ఆ స్థితి కూడా లేదు . జిలాల్లో కూడా ఇన్ఫెక్షన్స్ గత నెల కు పైగా జరుగుతున్నాయి . అక్కడ కూడా ఇప్పుడు తగ్గుముఖం పట్టడం మొదలయ్యింది .
మరి ఆంధ్ర ప్రదేశ్ సంగతి ?
ప్రజల్లో భయం మెడికల్ మాఫియా కు బంగారు బాతు. ప్రజల్లో భయం పోకుండా వీరు శత విధాలుగా ప్రయత్నిస్తారు .విజయవాడ , వైజాగ్ కేంద్రంగా ప్రజల్లో భయాన్ని పెంచి పోషించే ప్రయత్నాలు తీవ్రతరం అయ్యాయి . వీరి ప్రచారాన్ని నమ్మిన వారు ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకొంటారు . ఇది గతం లో జరిగింది . ఇక పై కూడా జరుగుతుంది . కానీ మెజారిటీ తెలుగు ప్రజలకు వాస్తవాలు తెలిసిపోతున్నాయి . విష ప్రచారాన్ని నమ్మే స్థితి లో వారు లేరు . తెలంగాణ లాగే ఆంధ్ర ప్రదేశ్ కూడా . మరో నాలుగు అయిదు రోజులు ఏపీ లో కేసులు పెరగొచ్చు . ఏ నెల చివరికి మామూలు స్థితి వచ్చేస్తుంది .
ఇన్ఫెక్షన్ లు జరిగి టెస్ట్ లు చేసుకోకపోతే నష్టం కదా ?
అవును .. ఫార్మసురులకు నష్టం . రెండో వేవ్ లో ప్రజల ఆస్తుల్ని దోచేసేసారు . ఇక ప్రజల దగ్గర ఏమీ మిగల లేదు . కరోనా లాక్ డౌన్ ల వల్ల , రెండో వేవ్ లో అధిక శాతం ఆసుపత్రుల దోపిడీ వల్ల ప్రజలు అప్పుల్లో వున్నారు . పెళ్ళాం పుస్తె లు తాకట్టు లో వున్నాయి . ఒట్టి పోయిన అవును పొదుగును పిండితే పాలు రాదు .. రక్తం వస్తుంది . నగరాల్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, కొన్ని రకాల వ్యాపారాలు చేసే వారి ఆదాయాలు కరోనా కాలం లో తగ్గలేదు సరి కదా పెరిగాయి . వారి దగ్గరే డబ్బుంది . ఇప్పుడు ఫార్మసురుల టార్గెట్ వారే . అందుకే అక్కడే ఎక్కువ ప్రచారాలు .. కేసులు .
కరోనా సోకితే దాని ప్రభావం చాల రోజులు ఉంటుంది అనేది ఓమిక్రాన్ కు వర్తించదు . ఇప్పడు మన దేశం లో ఓమిక్రాన్ కోట్ల మందికి సోకింది . ఒకటి రెండు రోజుల జలుబు , కాస్త తల నొప్పి జ్వర తో పోయింది . దీని ప్రభావం సోకిన వ్యక్తి పై ఎక్కువ కాలం ఉండదు . రోజూ ఆకుకూరలు , వెల్లుల్లి తీసుకోవడం , నీరు బాగా తాగడం , ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఆహారం తీసుకోవడం , నుదురుట చెమట పట్టేదాకా వేగంగా నడవం లాంటి చర్య ల ద్వారా ఏదైనా చిన్నపాటి సమస్యలు ఉంటే అధిగమించవచ్చు . ఆరోగ్యాన్ని పదిలంగా వుంచుకోవచ్చు .
మరి జనవరి కి కరోనా కథ ముగిసినట్టేనా ?
కరోనా కథ గత సంవత్సరం జూన్ కే ముగిసింది . అదిగో మూడో వేవ్ .. ఇదిగో కొత్త వేరియంట్ అంటూ భయపెడుతూ వచ్చారు . ఫిబ్రవరి నుంచి నాలుగో వేవ్ కు ముహూర్తాలు పెట్టేస్తారు . అదిగో కొత్త వేరియెంట్ .. వెయ్యి మ్యుటేషన్ లు అంటూ భయపెడుతూ వస్తారు . దీన్ని నమ్మిన వారు భయపడుతూ జీవితాన్ని చేజేతులురా నాశనం చేసుకొంటూ వుంటారు .
ముగింపు :
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజల్లో పెద్దగా భయందోళనలు లేవు . అందుకే ఇక్కడ పరిస్థితి దేశం లోని మిగతా ప్రాంతాలకు భిన్నంగా ఉంది. దీనికి కారణం ప్రజల్లో సరైన అవగాహహన . ప్రజల్లో సరైన అవగాహన తీసుకొని రావడం కోసం నా వంతు భాద్యతగా రెండు సంవత్సరాలుగా కృషి చేస్తున్నాను . నా మెసేజ్ ల ను అందరితో పంచుకోవడం ద్వారా వేల మంది ఈ పుణ్య కార్యం లో సహకరిస్తున్నారు . వందేళ్లకు ఒక సారి వచ్చే పండెమిక్ . ఎక్కడో ఏ తల్లో మనల్ని గుర్తుంచుకొంటుంది . ఇంత క్లిష్ట సమయం లో సమాజానికి ఉడతా సాయం చేసాము అనే తృప్తి మనకు చాలు . మీ కందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేసున్నాను .
మీ…. వాసిరెడ్డి అమర్నాథ్ .
చివరిగా ఒక ప్రశ్న .
గత నాలుగు నెలలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పాఠశాలలు నడుస్తున్నాయి . అధిక శాతం ప్రజలు పిల్లలను పాఠశాలకు పంపుతున్నారు . గ్రామీణ ప్రాంతాలు, చిన్న టౌన్స్ లో అయితే వంద శాతం పిల్లలలు హాజరు . అదే బెంగళూరు నగరం . మూడో వేవ్ పిల్లలకు సోకుతుంది అనే ప్రచారాన్ని నమ్మారు. మొత్తం ఆన్లైన్ క్లాసులు . పాపం ఆ పిల్లలు . వారి చదువులు సర్వ నాశనం . బాల్యం బుగ్గి పాలు . ఆన్లైన్ క్లాసుల వల్ల తల నొప్పి అని చెబుతున్న పిలల్లు . కానీ ఫార్మసురుల విష ప్రచారాన్ని నమ్మి భయం గుప్పిట్లో చిక్కిన పట్టణ సంపన్న వర్గాలకు ఇది సమస్య అనిపించలేదు .
వీరి భయం కరోనా . వీరి ఉద్దేశం లో టెస్టింగ్ వద్దన్న వాడు .. బూస్టర్ డోసు వద్దన్న వాడు అనాగరికుడు . తెలియని వారికి చెప్పొచ్చు . తెలిసిన వారికి చెప్పాల్సిన అవసరం లేదు . ఒంటిని, ఇంటిని గుల్ల చేసుకొనే బాటలో మన దేశం లో ని పట్టణ సంపన్న వర్గాలు . వీరికి చెప్పేది ఎవరు ? చెప్పినా వారు నమ్మరు. ఇది నడుస్తున్న విషాద చరిత్ర . ఇంకా ముందు ముందు ఏమి చూడాల్సి వస్తుందో .
మీది ఏ దారి ?
విష ప్రచారాన్ని నమ్ముతూ నాలుగో వేవ్ హెచ్చరికలు చూస్తూ భయపడుతూ ఫేక్ న్యూస్ ను షేర్ చేసుకొంటూ కాలం గడిపేస్తారా ? లేదా వాస్తవాలను అర్థం చేసుకొని నలుగురిలో భరోసా నిలుపుతారా ? మీ హృదయాన్ని అడగండి . సమాధానం వస్తుంది .
ప్రజల కోసం సైన్స్ . మనుషుల కోసం మందులు .
ఫార్మసురుల కోసం కాదు సైన్స్ . మందుల కోసం మనుషులు కాదు .
వేసుకొన్న వాక్సిన్ లు చాలు . మంచి ఆహారం , వ్యాయామం అనే సహజ పద్దతి ద్వారా మీ ఇమ్మ్యూనిటి ని బలంగా ఉంచుకోండి . భయాన్ని పోగొట్టేందుకు నలుగురికీ అవగాహన కల్పించండి . ఈ మెసేజ్ మీ బంధు మిత్రులతో షేర్ చేసుకోండి . కేవలం ఫార్వర్డ్ చేయడం కాదు . వారితో మాట్లాడండి . అర్థం అయ్యేలా చెప్పండి . ఇదే మీరు వారికీ చేసే బలమైన సాయం .
సత్యమేవ జయతే . సర్వే జనా సుఖినోభవంతు !!
Arise ! Awake ! Stop not till the goal is reached.