సంపూర్ణ లాక్ డౌన్ ఉండదు .. ఎందుకంటే ..
1 . ఇప్పటికే దేశం లో ఆర్థిక విధ్వంసం జరిగిపోయింది . మరో సారి లాక్ డౌన్ అంటే పరిస్థితి పూర్తిగా చేయిదాటి పోతుంది . ఈ విషయం ఉన్నతా ధికారులకు , పాలకులకు తెలుసు .
2 . కేసులు భారీగా పెరిగితే ఆసుపత్రుల్లో బెడ్ లు దొరకని స్థితి ఏర్పడుతుంది అని గతం లో లాక్ డౌన్ లు పెట్టి వ్యాప్తి ని నెమ్మది చేయడం, ఆ విధం గా వైద్య వ్యవస్థల పై భారం పడకుండా చూసారు . ఇప్పుడు ఢిల్లీ ముంబై లో అధికారికంగా వేలల్లో, వాస్తవంగా లక్షల్లో కేసులు వున్నా ఆసుపత్రి బెడ్ లు ఖాళీ గానే ఉంటున్నాయి . కాబట్టి లాక్ డౌన్ అనవసరం .
3 . లాక్ డౌన్ పెడితే సమస్యను సాగదీయడం మాత్రమే .. రావణ కాష్టంలా రగులుతూనే ఉంటుంది అని ఆస్ట్రేలియా కేరళ ఉదంతాలు ద్వారా అందరికీ అర్థం అయిపొయింది .
మరి ప్రసార మాధ్యమాలు ఎందుకు ఇదిగో లాక్ డౌన్ .. ఏ క్షణమయినా సంపూర్ణ లాక్ డౌన్ అని ప్రచారం చేస్తున్నాయి ?
ఇదే మాట నేను అడిగాను .
“వాసిరెడ్డి అమర్నాథ్ లాగా ఏమీ సమస్య ఉండదు అంటే ఎవరు చూస్తారు ? జనాలకు నెగటివ్ వార్తలు కావాలి . వాటినే చూస్తారు .. చర్చిస్తారు .. షేర్ చేసుకొంటారు . మాకు వ్యూస్ వస్తాయి” .. ఇదీ ఒక పై స్థాయిలో లోని మిత్రుడు చెప్పింది .
ఇప్పుడు చెప్పండి . తప్పెవరిది ?
మరి రాత్రి కర్ఫ్యూ, విద్యా సంస్థ లు మూసేయడం ఎందుకు ?
ఏదో చేసినట్టు ఉండాలిగా . లేకపోతె కరోనా భయస్తులు” ప్రభుత్వాలు పట్టించుకోలేదు” అని విమర్శిస్తారు .
మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో పండగ తరువాత పాఠశాలలు తెరుస్తారా ?
అప్పుడే కచ్చితంగా చెప్పలేము . ముందు ఒక విషయాన్ని చెప్పాలి . జనాలు అనుకొన్నట్టు ఈ వేవ్ ఏదో రెండు మూడు నెలలు సాగదు. గాలిదుమారం లా వచ్చి వెళ్లి పోతుంది . ఢిల్లీ ముంబై ల లో, నా అంచనా కరెక్ట్ అయితే మరో వారం పది రోజుల్లో కేసులు తగ్గుముఖం పడుతాయి . ఇంకా హైదరాబాద్ లో వేవ్ మొదలు కాలేదు అని చాలా మంది అనుకొంటున్నారు . వాస్తవం వేరు . ఒక మాట లో చెప్పాలి అంటే ఆంధ్ర ప్రదేశ్ లో బహుశా పండుగ అయిపోయాక వారం రోజులకు , తెలంగాణ లో నెలాఖరుకి భౌతిక తరగతులు ఉండవచ్చు .ఆంధ్ర ప్రదేశ్ లో పండుగ అయిన వెంటనే ప్రారంభించినా ఆశ్చర్యం లేదు . ఏది ఏమైనా ఈ సారి అన్ని వార్షిక పరీక్షలు ఎంట్రన్స్ పరీక్షలు కచ్చితంగా జరుగుతాయి . .
Amarnath Vasireddy
