చలం వ్యక్తిగత జీవితాన్ని ఆదర్శంగా తీసికోవాల్సిన పనిలేదు,

కానీ ఆయన సాహిత్యాన్ని మాత్రం అర్థం చేసుకోవాల్సి అవసరం ఉంది..
“””””””””””””””””””””””””””””””””””””””””””””””””””
“శ్రీ శ్రీ” లాగా తాను నాస్తికున్ని అని “చలం” ఎపుడూ ప్రకటించు కోలేదు. ఆయన ఎపుడూ నాస్తికుడిగా జీవించనూ లేదు.

నిరీశ్వర వాదాన్ని చలం ఎపుడూ తలకెత్తుకోలేదు కూడా. ఆది నుండీ చివరి వరకు ఆయన ఆస్తికుడి గానే బ్రతికాడు.

మొదట్లో హిందువుగా విగ్రహాల ఆరాధకుడిగా, తర్వాత బ్రహ్మ సమాజం ఆక్టివిస్ట్ గా, అటు తరువాత స్త్రీవాద రచయితగా, చరమాంకంలో తన కుమార్తె ప్రోద్భలంతో జవితం చిట్ట, చివరిగా దశలో.. అరుణా చలం చేరి, రమణ మహర్షి సన్నిధిలో గడిపాడు చలం..

కాకపోతే హిందూ సమాజంలోని సనాతన పోకడలను చలం ప్రశ్నించాడు. ఖండించాడు. వితంతు పునర్వివాహాలకు తన సంపూర్ణ మద్దతు తెలిపాడు.

స్త్రీల (దాస్య) విముక్తికై చలం పరితపించాడు. వారిలో మానసిక స్థైర్యం కలగడం కోసం ఆయన ఎన్నో రచనలు చేసాడు.

అలాగే హిందువుల్లో కులాల హెచ్చుతగ్గులు వలదన్నాడు. కుల రహిత సమాజమే మేలన్నాడు. మనుషులంతా ఒక్కటే అన్నాడు.

అయితే “చలం” గారి జీవితాన్ని ఎవరూ ఆధార్శంగా తీసుకో వలసిన అవసరం లేదు. ఆయన జీవితంలోని చరమాంకపు ఘట్టాలను పట్టించుకోనక్కర లేదు.,

కానీ ఆయన సాహిత్యాన్ని చదవాలి. ఆయనను చదవాలి. పురుషుడికి, స్త్రీల మనస్తత్వం సంపూర్ణంగా అర్థం కావాలంటే, స్త్రీ వ్యక్తిత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి అని అంటే..

ప్రతీ మగవాడు చలం రచనల్ని చదవాలి. అపుడే అతను (ఆ మగవాడు) తన భార్యని, తన కూతురిని, తన తల్లిని, తన చెల్లిని, తన అక్కని మరియూ ఇతర మహిళలను సరిగ్గా అర్థం చేసుకో గలుగుతాడు. వారి పట్ల బాధ్యతగా మసులుకో గలుగుతాడు.
— Rajeshwer Chelimela , Jvv Telangana