స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చింది. తన మనువరాలి పెళ్లిలో ఈ కరోనా సోకినట్టు గుర్తించారు.నిన్న రాత్రి రిసిప్షన్ ఉండే. దీనికి ముందే ఆయనకు తీవ్ర గొంతునొప్పి ఉండటంతో ఎందుకైనా మంచిదని కరోనా పరీక్షలు చేయంచుకున్నారు. పాజిటివ్ వచ్చింది. దీంతో వెంటనే అలర్టయిన ఆయన తనతో సన్నిహితంగా ఉన్నవారందరినీ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరాడు. కుటుంబ సభ్యులు, స్టాఫ్‌కు వెంటనే పరీక్షలు చేయించారు. వారందరికీ నెగిటివ్ రిపోర్ట్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. రాత్రి జరిగిన రిసిప్షన్‌కు వీరంతా హాజరయ్యారు.
పోచారం ఏసిషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ (ఏఐజీ) ఆస్పత్రిలో చేరారు. రిసిప్షన్‌కు దూరంగా ఉన్నారు. కాగా పెళ్లిలో ఆయనతో గవర్నర్‌తో పాటు ఇరు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్‌లు సన్నిహితంగా మెలిగారు. కలిసి భోజనం చేశారు. వీరికీ పరీక్షలు చేయాల్సి ఉంది. పోచారం కు కరోనా సోకిందన్న వార్త రాజకీయంగా చర్చకు తెర తీసింది. ఆ పెళ్లికి హాజరైన టీఆరెస్ నేతల్లో గుబులు మొదలైంది. ఎందుకైనా మంచిదని వారూ పరీక్షలు చేయించుకునేందుకు రెడీ అవుతున్నారు.