బాజిరెడ్డి గోవర్దన్. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే. ఆర్టీసీ చైర్మన్. ఆర్టీసీ నష్టాల్లో ఉందని ఆయన తనదైన శైలిలో ఓ నిర్ణయం తీసుకున్నాడు. ఎమ్మెల్యేగా తీసుకుంటున్న జీతం తనకు చాలన్నాడు. ఆర్టీసీ ఇప్పటికే నష్టాల్లో ఉంది.. చైర్మన్గా ఆ జీతభత్యాలు తాను తీసుకోలేనన్నాడు. బాజిరెడ్డి తీసుకున్న నిర్ణయానికి సిబ్బంది అంతా హర్షం వ్యక్తం చేశారు. వచ్చే జీతాన్ని కూడా వదలుకొని సంస్థ గురించి ఆలోచించే చైర్మన్ దొరకాడని, మున్ముందు ఆర్టీసీ నష్టాల నుంచి బయటపడి.. లాభాల బాటలో పయనిస్తుందని వారంతా ఆశాభావం వ్యక్తం చేశారు.

