చిల్ల‌ర‌మ‌ల్ల‌ర వార్త‌ల‌తో ప‌బ్బం గ‌డుపుకుని.. వార్త‌లో ఏమీ ద‌మ్ము లేకున్నా.. అస‌లు విష‌య‌మే లేకున్నా.. ఇది వింటే షాక్ తింటారు.. తెలిస్తే షాక్ కొట్టి చ‌చ్చిపోతారు..లాంటి ప‌నికిమాలిన హెడ్డింగులు పెట్టే కేట‌గిరీలో టీన్యూస్ కూడా చేరిపోయింది. దీనికి కూడా ఇబ్బ‌డిముబ్బ‌డి వ్యూస్ కావాలి. దాని కోసం ఏమైనా చేస్తుంది. ఆస‌క్తి, ఉత్కంఠ క‌లిగించేందుకు ప‌స‌లేని, ద‌మ్ములేని, నీతిమాలిన హెడ్డింగులు పెట్టేందుకు ఏ మాత్రం వెనుకాడ‌దు… ఏందీ..? ఇదంతా నాపైత్యం అనుకుంటున్నారా? కాదండి బాబు.. నెటిజ‌న్లు టీన్యూస్‌ను ఇలాగే ఆడుకుంటున్నారు. ఏకి పారేస్తున్నారు. కోడిబూరు పీకిన‌ట్టు పీకేస్తున్నారు. గాలి తీసేస్తున్నారు.

ఇదీ అస‌లు జ‌రిగిన క‌థ‌. ఉపాస‌న పిల్ల‌ల గురించి ఏదో అడిగారు. ఆమె సిగ్గులేదారా వెధ‌వ ఏమి అడ‌గాలో కూడా మీకు తెలియ‌దు.. అనే రేంజ్‌లోనే స‌మాధాన‌మిచ్చింది. అగో దాన్ని ప‌ట్టుకుని పిల్ల‌ల విష‌యంలో ఆమె చెప్పిన సీక్రెట్ ఇది.. అని ఏదో నీతిమాలిన హెడ్డింగ్ పెట్టి టీ న్యూసోడు ఓ వార్త వ‌దిలాడు. ఇది నెటిజ‌న్ల కంట ప‌డింది. ఏంటీ.. ? ఇలా వార్త రాసింది… టీ న్యూసేనా.. ? ఒక‌టి రెండు సార్లు ప‌రికించి చూశారు. లోతుగా ప‌రిశీలించి .. అవును అని నిర్దార‌ణ చేసుకుని నోరెళ్ల బెట్టారు. ఇలా చూడ‌టం కొంద‌రికి ఇది మొద‌టి సారి కాద‌నుకుంటా. టీ న్యూసే కాదు.. న‌మ‌స్తే తెలంగాణ కూడా ఈ క‌క్కుర్తి పోక‌డ‌లు పోతుంద‌ని నిర్దార‌ణ‌కొచ్చారు. ఇలా రెండింటినీ క‌లిపి వాయించేశారు.

మారండ్రా మీరు.. మీరూ మీ పుచ్చులో మార్కెట్ టెక్నిక్‌లు అని తిట్టి ఉతికారేశారు. కేసీఆర్ మిమ్మ‌ల్ని ఎక్క‌డికో తీసుకెళ్లాల‌నుకుంటాడు… కానీ మీర‌క్క‌డి రారు.. పోరు.. ఇక్క‌డ్నే ఉంటారు… ఇలా.

You missed