సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న న్యూస్‌.. ఓ లుక్కేయండి…

……………………………………………………………………………………………………..

ఆంధ్రా దుప్ప‌ట్లో తెలంగాణ గుండె చ‌ప్పుడు…
* దేశానికి పీకే లాగా కేసీఆర్‌కు టీకే (తిగుళ్ల కృష్ణ‌మూర్తి) అట‌..
* నిన్న వ‌ద్ద‌న్న‌వాడు, నేడు ముద్ద‌య్యాడు
* రాజ్యం తెలంగాణ‌ది, భోజ్యం టీకే బ్యాచ్‌ది

* వైఎస్ శ‌ర్మ (గ‌డ్డం శ‌ర్మ‌), సంతోష్‌, భ‌ర‌త్‌, ఇల‌పావులూరిల‌తో నిండిపోనున్న తెలంగాణ ప‌బ్లికేష‌న్స్‌

*తెలంగాణ టుడే, టీ న్యూస్‌ బాధ్య‌త‌లు కూడా టీకే

* ఇప్పుడు న‌మ‌స్తే తెలంగాణ బిల్డింగ్‌ను కొనేశారు

* త్వ‌ర‌లో టీ న్యూస్ కూడా అక్క‌డికే!

న‌మ‌స్తే తెలంగాణ‌, ఆంధ్ర పాల‌కుల అరాచ‌కాల‌నేకాదు, ఆంధ్ర మీడియా ఆధిప‌త్యాన్నిసైతం కాద‌నుకుని, తెలంగాణ గుండె చ‌ప్పుడుగా ఆవిర్భ‌వించిన ప‌త్రిక‌. సీఎల్ రాజాం అనే కాంట్రాక్ట‌ర్ స్థాపించిన ఈ ప‌త్రిక‌ను తెలంగాణ స‌మాజం కూడా అక్కున చేర్చుకుంది. తెలంగాణ వాణిని, బాణిని బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లింది. కేసీఆర్ తెలంగాణ ఉద్య‌మానికి కుడిభుజంగా మారింది. ఆ త‌రువాత తెలంగాణ రాష్ట్రం క‌ల సాకారంకావ‌డం, ఆప‌త్రిక‌ను కేసీఆర్ కుటుంబం సొంతం చేసుకోవ‌డం జ‌రిగింది.
కేసీఆర్ ఉద్య‌మాన్ని, తెలంగాణ వాదాన్ని ఆంధ్ర ప‌త్రిక‌ల్లో ఎండ‌గ‌డుతూ వ్యాసాలు రాసిన తిగుళ్ల కృష్ణ‌మూర్తి (టీకే ) ఇప్పుడు ఆ ప‌త్రిక‌కు ఎడిట‌ర్ గా ఉన్నారు. ఆయ‌న్ను కేసీఆర్ అంత‌గా ఎందుకు న‌మ్మారో ఇప్ప‌టికీ తెలంగాణ‌వాదుల‌కు అర్థం కాలేదు. తిగుళ్ల ఎడిట‌ర్ అయ్యాక‌, తెలంగాణ ఉద్య‌మంతో, కే సీ ఆర్ తో బ‌ల‌మైన బంధం ఉన్న జ‌ర్న‌లిస్టుల‌ను ఏరి ఏరి బ‌య‌ట‌కు పంపారు. పంపుతున్నారు.

అంత‌టితో ఆగ‌లేదు… టీకే త‌న స్తోత్రాల‌తో కేసీఆర్‌ను ఎంత‌గా మాయ చేశారంటే, ఇప్పుడు ఏకంగా తెలంగాణ టుడే (ఇంగ్లీష్ ప‌త్రిక‌), టీ న్యూస్ (వార్తా ఛానెల్‌) బాధ్య‌త‌ల‌ను కూడా ఇప్పుడు ఆయ‌న‌కే అప్ప‌గించేలా చేశారు. అంద‌రూ కేసీఆర్ మాట‌ల‌కు ప‌డిపోతే, కేసీఆర్ మాత్రం టీకే స్తోత్రాల‌కు ప‌డిపోయారంటున్నారు. దీంతో టీకే ఆఫీసులో , బ‌య‌ట కాల‌రు ఎగరేసి కేసీఆర్ త‌న అనుమ‌తి లేనిదే పెగ్గు కూడా వేయ‌రు అన్న‌ట్లు బ‌డాయి పోతున్నార‌ట‌. అది నిజ‌మే అన్న‌ట్లుగా కేసీఆర్ న‌మ‌స్తే తెలంగాణ‌, టీ న్యూస్‌, తెలంగాణ టుడే బాధ్య‌త‌లు అన్నీ టీకేకి క‌ట్ట‌బెట్టారు. దీంతో కేసీఆర్‌కు ఉద్య‌మ కాలం నుంచి చేదోడువాదోడుగా ఉన్న వాళ్ల‌కు నోట్లో విషం వేసిన‌ట్లయింది.

తిగుళ్ల కృష్ణ‌మూర్తి ఈనాడులో ఉన్నంత కాలం రామోజీ చంద్ర‌బాబు భ‌జ‌న అందుకున్నాడు. సాక్షాత్తూ రామోజీరావు ఆయ‌న మానస వ్యాసాల‌ను టీకేతో రాయించేవాడు. సెంట్ర‌ల్ డెస్క్ బాధ్య‌త‌లు కూడా అప్ప‌గించి పెద్ద‌పీట వేశారు. అయినా స‌రే, 5 వేలు జీతం ఎక్కువ ఇస్తాన‌న్న ఆంధ్ర‌జ్యోతి ఎండీ రాధాకృష్ణ ఆఫ‌ర్ కాద‌న‌లేక‌పోయారు తిగుళ్ల‌. అది ఆయ‌న నిబ‌ద్ధ‌త‌కు మొద‌టి ఉదాహ‌ర‌ణ‌.
ఇక ఆంధ్ర‌జ్యోతిలో అన్నీ తానై, షాడో ఎడిట‌ర్ అయి చక్రం తిప్పాడు టీకే. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో స‌మైక్యాంధ్ర వాదాన్ని బ‌ల‌ప‌రుస్తూ అనేక‌వ్యాసాలు రాశారు. వాటిలో కొన్నింటికి త‌న పేరు పెట్టుకుంటే, మ‌రికొన్నింటికి క‌లం పేర్లు పెట్టుకున్నాడు. అలా కేసీఆర్ ను ఒక స్వార్థ రాజ‌కీయ నాయకుడిగా, కేవ‌లం ప‌ద‌వి కోసం ఉద్య‌మాన్ని చేస్తున్న అవ‌కాశవాదిగా చిత్రీక‌రించాడు. ఆంధ్రజ్యోతిలో మెప్పు పొంది జీతాలు పెంచుకున్నాడు. త‌న వారంద‌రికీ ఉద్యోగాలు ఇప్పించుకున్నాడు. మొద‌టి నుంచి ఆంధ్ర‌జ్యోతిని న‌మ్ముకుని, రాధాకృష్ణ‌కు ఎంతో న‌మ్మ‌కంగా ప‌నిచేస్తున్న వారంద‌రినీ పొగ‌పెట్టి పంపేశాడు. ఇక ర‌కంగా ఆంధ్ర‌జ్యోతిలో పెత్త‌నం అంతా టీకేదే. పేరుకు మాత్ర‌మే ఎడిట‌ర్ గా కే. శ్రీ‌నివాస్ ఉన్నారు. అంత అధికారం, హోదా, జీతం ఉన్నా…. కేవ‌లం ఎడిట‌ర్ పోస్టు ఇస్తామ‌న్నందుకు రాధాకృష్ణ గుండెల మీద ఒక్క‌త‌న్ను త‌న్ని వ‌చ్చి న‌మ‌స్తే తెలంగాణ‌లో వాలిపోయారు. ఆయ‌న తృష్ణ తీర‌లేదు. ఇప్పుడు ఆయ‌న గ్రూప్ ఎడిట‌ర్ కావాల‌ని నిర్ణ‌యించుకున్నారు. దానికి త‌గ్గ‌ట్టు స్తోత్రాలు రెడీ చేసుకున్నారు. కేసీఆర్ కు నిత్య హార‌తి ఇచ్చి స్తోత్రాలు ప‌టించిన‌ట్లు ఉన్నారు. కేసీఆర్ క‌రుణించేశారు.

ఇక అధికారం మొత్తం టీకేకి రావ‌డంతో ఆయ‌న బ‌డాయిల‌కు బ‌య‌ట హ‌ద్దులు లేవ‌ట‌. దేశానికి పీకే (ప్ర‌శాంత్ కిషోర్‌) ఎలాగో, కేసీఆర్‌కు టీకే (తిగుళ్ల కృష్ణ‌మూర్తి) అలాగ అంటూ అడిగిన‌వారికి, అడ‌గ‌నివారికి చెప్పుకుంటూ గొప్ప‌లు పోతున్నార‌ట‌. ఆయ‌న వాలకం చూడ‌లేక ఆయ‌న స‌న్నిహితులే వాంతులు చేసుకుంటున్నార‌ట‌.

తెలంగాణ వాదుల‌ను పంపి…ఆంధ్రుల‌తో నింపి

న‌మ‌స్తే తెలంగాణ‌ప‌త్రిక‌లో ఇప్పుడు తెలంగాణ‌వాదులు ధైర్యంగా జై తెలంగాణ అనలేని ప‌రిస్థితి. ఎందుకంటే టీకేకి కోపం వ‌స్తుంద‌నే భ‌యం. ఇప్ప‌టికే చాలామందిని పంపేశారు. ఒక్కొక్క‌రిగా త‌న సామాజిక‌వ‌ర్గానికి చెందిన ఆంధ్రావాళ్లను తెచ్చి నింపుకుంటున్నారు. టీకే టీంలోకి ఆంధ్రాకు చెందిన ఇల‌పావులూరి, గ‌డ్డం శ‌ర్మ‌లు యాడ్ అయ్యారు. ఇల‌పావులూరి ఎన్నిక‌ల ముందు వ‌ర‌కు వైఎస్ జ‌గ‌న్ భ‌జ‌న చేస్తూ చంద్ర‌బాబును, కేసీఆర్ ను ఫేస్‌బుక్‌లో తిట్టిన తిట్టు తిట్ట‌కుండా తిట్టారు. గ‌డ్డం శ‌ర్మ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. వీరికి తోడుగా భ‌ర‌త్‌, సంతోష్ అనే తానా తందానాల‌ను కూడా తెచ్చేసుకున్నార‌ట‌. ఈ ఆంధ్రులంతా తెలంగాణ గుండె చ‌ప్పుడు ప‌త్రిక‌ను న‌డిపిస్తారు. ఈ స‌మైక్యాంధ్ర‌వాదుల గుప్పిట్లో ఇక‌పై తెలంగాణ గుండె చ‌ప్పుడు విన‌బ‌డాల్సిన ఖ‌ర్మ ప‌ట్టింది.
ఇప్పుడు జ‌హీర్‌న‌గ‌ర్‌లో ఉన్న న‌మ‌స్తే తెలంగాన భ‌వ‌నం మొత్తాన్ని కేసీఆర్ కొనేశార‌ట‌. అందులో ఇప్పుడున్న నాలుగు ఫ్లోర్ల‌కు అద‌నంగా మ‌రో రెండు ఫ్లోర్లు(అన‌ధికారికంగా) వేసి ఇప్పుడు తెలంగాణ భ‌వ‌న్‌లో ఉన్న టీ న్యూస్ ఛానెల్‌ను కూడా అక్క‌డికి తీసుకెళుతార‌ట‌. ఆల్రెడి తెలంగాణ టుడే ఇప్పుడు అదే భ‌వ‌నంలో ఉంది. మూడూ ఒకే భ‌వ‌నంలోకి ఎందుకు అంటే… టీకేకి ఉన్న బిజీ షెడ్యూల్ వ‌ల్ల ఆయ‌న మూడు చోట్ల‌కు వెళ్ల‌డానికి క‌ష్టం. అందుకే మూడు ఒకేచోట‌కు తెచ్చి…సీసీ కెమెరాలు పెట్టి, టీకే ముందు పెద్ద స్క్రీన్ ఉన్న యాపిల్ కంప్యూట‌ర్ ఏర్పాటు చేసి…ఆయ‌న ప‌ర్య‌వేక్షిస్తుంటారు.
ఈ ప‌రిణామాల‌న్నీ తెలిసిన మూడు సంస్థ‌ల ఉద్యోగులు మాత్రం ముక్కున వేలేసుకుంటున్నార‌ట‌. చీమ‌లు పెట్టిన పుట్ట‌లో పాములు వ‌చ్చి చేర‌డం ప్ర‌కృతి స‌హ‌జం అంటూ పెద‌వి విరుస్తున్నార‌ట‌. మ‌రికొంద‌రు మాత్రం.. ఈ కేసీఆర్ సార్‌కు ఏమైంది… ఒక‌వైపు టీకే.. మ‌రోవైపు వాడి బోసిడీకే… ఈ నిర్ల‌క్ష్యానికి త‌ప్ప‌దు భారీ మూల్యం! అంటున్నార‌ట‌.

You missed