కనీసం సోయి ఉండాల. పైసలిస్తున్నారనగానే వెనుకా ముందు ఆలోచించుడు లేదు. అసలు ఆ యాడ్ కంటెంట్ ఏందో తెలుసుకునే ప్రయత్నం కూడా చెయ్యలేదు బన్నీ. బాగనే సంపాదిస్తున్నావ్ కదా బై. మరీ ఇంతలా దిగజారాలా? ఇంత కక్కుర్తి అవసరమా? నీ యాడ్ ను హైలెట్ చేసుకునేందుకు ఆర్టీసీని చీప్ చేయాలా? అది ప్రజా రవాణ వ్యవస్థ. ఎంతో మంది పేదలకు అదే గమ్యస్థానాన్ని చేర్చే ఏకైక మార్గం.దాన్ని కాపాడుకునే ప్రయత్నం చెయ్యాలి. మీరు బాగు చేయకున్నా.. దాన్ని బతికి బట్ట కట్టేలా చేయకున్నా.. నాశనం చేయకుండా ఉంటే చాలు. యాడ్ పైసల కోసం దోష వేసేందుకు రెడీ అవుతావు.. ఆర్టీసీని తక్కువ చేసి.. అందులో ఎందుకు పోతావ్ బై.. మా రాపిడో బైక్ టాక్సిలో పో బై ఎంతో బాగుంటుంది అని మరీ ఈ బ్రోకర్ వేషాలెందుకు బన్నీ. ఆర్టీసీ నోటీసులు ఇచ్చినంకనైనా సోయి వచ్చిందా? మేరేమన్నా చేస్కోండ్రి బై మేం శవాల మీద కాసులేరుకునేందుకు వెనుకాడం.. ఎలాంటి వేషాలైనా వేస్తాం.. అని అంటావా? సరే, కానీ మిమ్మల్ని మార్చేదెవరు..?
https://youtu.be/PnXqV96Tobs