ఎవ‌రు మీలో కోటిశ్వ‌రులు… జూ ఎన్టీఆర్ హోస్టింగ్ చేస్తున్న ఈ ప్రోగ్రాం రోజు రోజుకు ఎక్కువ మందిని ఆక‌ట్టుకుంటున్న‌ది. మొద‌ట్లో ఎన్టీఆర్ ఈ షోలో పూర్తిగా ఇన్వాల్వ్ కాలేక‌పోయాడు. ఇప్ప‌డైతే కంటెస్టెంట్ల ఆటాడుకుంటున్నాడు. ఆట‌ను ర‌క్తి క‌ట్టిస్తున్నాడు. ఇంటిల్లిపాదికీ ఇదిప్పుడో ఆట విడుపు. పిల్లాజెల్లా త‌ల్లిదండ్రులంతా క‌లిసి ఎంతో కొంత విజ్ఞానాన్ని నేర్చుకునే ఓ కార్య‌క్ర‌మం. కొత్త విష‌యాలను తెలుసుకునే స‌మాచార వాహిక‌గా ఈ కార్య‌క్ర‌మం ప‌నిచేస్తుంది.

బిగ్‌బాస్‌కు ముందు స్టార్ట్ అయ్యే ఈ కార్య‌క్రమానికే ఎక్కువ మంది ఆక‌ర్షితుల‌వుతున్నారు. బిగ్‌బాస్ క‌న్నా కోటి రెట్లు ఈ కార్య‌క్ర‌మ‌మే బెట‌ర్ అంటున్నారు చాలా మంది. బిగ్‌బాస్ హోస్టింగ్ చేస్తున్న నాగార్జున రోజు రోజుకు విమ‌ర్శ‌ల పాల‌వుతున్నాడు. ఆ బిగ్‌బాస్ షోనే అలాంటిది. ఇక్క‌డ మాత్రం జూ ఎన్టీఆర్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్నాడు. ప్ర‌తీ ప్ర‌శ్న‌కు ఇచ్చే స‌మాధానం… క‌రెక్టా రాంగా చెప్పేట‌ప్పుడు కొంచెం స‌స్పెన్స్ ను మెయింటేన్ చేయ‌డం.. ఆ త‌ర్వాత ఆ ఆన్స‌ర్ ఇవ్వ‌డానికి గ‌ల కార‌ణాలు ఏమిటీ..? అని ఆరా తీయ‌డం ద్వారా ఒక్కో ప్ర‌శ్న నుంచి కొత్త విష‌యాలు.. లోతుగా వివ‌ర‌ణ తీసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. ఇది ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్న‌ది.