సీత తిరగబడితే!
—రేకా చంద్ర శేఖర రావు
**************
నగ్నంగా తనను
వడ్డన చేయమనిన త్రిమూర్తుల కాళ్ళు
అనసూయ మాత విరగ కొట్టినట్లయితే!
తన తప్పు
లేక పోయినా
శిల కమ్మని శపించిన
గౌతమ మునిని అహల్య శాపంతో బూడిద చేసినట్లయితే!
కుష్టు వ్యాధితో యుండి
వ్యభిచారి కొంపను కోరినందున
వాడి నెత్తుకున్న బుట్టను కాలువలో సుమతి
పార వేసినట్లయితే!
నువ్వు నాకు
అసలు తెలియదని
దుష్యంతుడు అనంగనే
ఓరి మోసగాడాయని
శకుంతల తిట్టినట్లయితే!
నలుడు తనకు
సెప్పా పెట్టకుండా అడవిలో ఒంటరిగా వదలి వెళ్ళినందుకు జీవితంలో అతని మొహం చూడనని
దమయంతి అనినట్లయితే!
తనను అన్యాయంగా చంపమని చెప్పిన
భర్త జమదగ్నినీ
తల్లిని చంప వచ్చిన కొడుకు పరశురాముడినీ
గండ్ర గొడ్డలితో
రేణుక మాత
నరికి నట్లయితే!
స్వయం వరంలో గెలిచిన భార్యను ఐదుగురు పంచుకుంటామని అనినంతనే అర్జునుడికి
ద్రౌపది విడాకులు
ఇచ్చినట్లయితే!
వలచి వచ్చిన వనకాంత శూర్పణఖను లక్ష్మణుడి దగ్గరకు
వెళ్ళమనినందుకు
నీ బతుకు చెడయని
శూర్పణఖ
రాముడిని తిట్టినట్లయితే!
అశోకవనంలో
భర్త కోసం
తపించి తపించి ఆత్మగౌరవంతో
బతికిన సీతను
అగ్నిలో దూకమనిన రాముడిపై
సీత తిరగబడి నట్లయితే!
తిరగబడి నట్లయితే!
తిరగబడి నట్లయితే!
ఏమయ్యేది?
మరి ఏమయ్యేది?
పురాణాలు
తల కిందులయ్యేవి!
చరిత్ర ముందడుగులో నుండేది!
భారత స్రీ ముందుకు
మును ముందుకు సాగి వుండేది.!
మొబైల్ నం.
9502 181 485