క‌రోనా విష‌యంలో ప్ర‌జ‌లంటే లీడ‌ర్ల‌కే కాదు వైద్యాధికారుల‌కు కూడా చిన్న చూపు ఏర్ప‌డింది. హెల్త్ డైరెక్ట‌ర్ శ్రీ‌నివాస్ రావు తాజాగా చేసిన వ్యాఖ్య‌లు ఆయ‌న బాధ్య‌త రాహిత్యాన్ని మ‌రోసారి ప‌ట్టించింది. క‌రోనా మూడో ద‌శ రావ‌డానికి కార‌ణం ప్ర‌జ‌లే అవుతార‌ని చెబుతూ, మీ జాగ్ర‌త్త‌లు మీరు తీసుకోండి, మ‌మ్మ‌ల్ని వ‌దిలేయండి.. మేం అలిసిపోయి ఉన్నామ‌ని అన్నాడు. కొంత స‌మ‌యం ఇస్తే తిరిగి రీచార్జ్ అవుతామ‌ని, ఇది ఇప్ప‌టితో ముగిసేది కాద‌ని, మ‌రో రెండేళ్ల వ‌ర‌కు పోరాడాల్సిందేనంటూ నిర్ల‌క్ష్య‌పూరితంగా, అస‌హ‌నంగా ఆయ‌న మాట్లాడిన తీరు వివాద‌స్ప‌ద‌మైంది. పండుగ‌లు, బోనాలంటూ తిరిగితే పోయిన త‌ర్వాత ఏడ‌వ‌డం ఒక్క‌టే మిగులుతుందంటూ ఎద్దేవా చేసిన‌ట్లు మాట్ల‌డాడు. ఇది స‌రిపోదంటూ రాజ‌కీయ నాయ‌కుల‌కు కూడా హిత‌బోధ చేశాడు. మీరు రోల్‌మోడ‌ల్‌గా నిల‌బ‌డాల‌ని, నిబంధ‌న‌లు పాటించి ప్ర‌జ‌ల‌కు చెప్పాలంటూ నీతిసూక్తులు వెల్ల‌డించాడు. చాలా ద‌గ్గ‌ర లీడ‌ర్లు నిబంధ‌న‌లు పాటించ‌డం లేద‌ని చుర‌క‌లేశాడు. విలేక‌రులు అడిగిన చాలా ప్ర‌శ్న‌ల‌కు శ్రీ‌నివాస్‌రావు డొంకా తిరుగుడు స‌మాధానాలిస్తు నిర్ల‌క్ష్యంగా స్పందించాడు.