ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌లో ఎంబీబీఎస్ పూర్తి చేసి పీజీ కోర్సుల్లో చేరేట‌ప్పుడు తాము రెండేళ్ల పాటు ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో సేవ‌లందిస్తామంటూ లిఖిత పూర్వ‌కంగా హామీ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ చాలా మంది అప్ప‌టి అవ‌స‌రాల‌కు, ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌లో ఎంబీబీఎస్‌, పీజీ కోర్సులు పూర్తి చేసి ఆ త‌ర్వాత చేతులెత్తేస్తారు. విదేశాల్లో స్థిర‌ప‌డ‌తారు. ప్రైవేట్‌గా ఆస్ప‌త్రులు న‌డుపుతారు. అంతే త‌ప్ప ప్ర‌భుత్వ సొమ్ముతో వైద్య విద్య నేర్చుకుని పేద‌ల‌కు వైద్య సేవ‌లందించ‌డానికి మాత్రం ముందుకు రారు.ఇది అంత‌టా న‌డుస్తున్న‌దే.

కానీ త‌మిళ‌నాడులో అలా కాదు. అక్క‌డి సీఎం విప్ల‌వాత్మ‌క‌మైన నిర్ణ‌యాలు తీసుకుంటున్నాడు. తాజాగా ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యం ఇలాంటి వైద్యుల‌కు చెంప‌పెట్టులా మారింది. 300 మంది విద్యార్థులు స‌ర్కారు ద‌వాఖాన‌ల్లో సేవ‌లందిస్తామ‌ని హామీలిచ్చి ఆ త‌రువాత ఆస‌క్తి లేదంటూ 112 మంది వైద్యులు చెప్ప‌డంతో దీన్ని సీరియ‌స్‌గా తీసుకుంది అక్క‌డి ప్ర‌భుత్వం. ఈ 112 మంది వైద్యుల‌కు గాను ఒక్కొక్క‌రికి 50ల‌క్ష‌ల చొప్పున జ‌రిమానా విధిస్తూ స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఇలాంటి క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకున్న‌ప్పుడే నాణ్య‌మైన స‌ర్కారు వైద్యం అందుతుంది. స‌న్న‌గిల్లిన న‌మ్మ‌కం పెరుగుతుంది.