(దండుగుల శ్రీనివాస్)
ఓడినప్పట్నుంచీ కేసీఆర్ ఫామ్‌హౌజ్‌కే పరిమితమయ్యాడు. ప్రతిపక్షాలకు అస్త్రంగా మారాడు. సీఎం రేవంతైతే మాట్లడితే చాలు ఫామ్‌హౌజ్ వదలవా..? రా బయటకు. అసెంబ్లీకి రా చర్చ పెడదాం. ఓడిస్తే జనాలకు దూరంగా ఉండాల్నా..? నువ్వేం లీడర్వు ఫామ్‌హౌజ్‌లోనే పంటావు..! ఇదే ముచ్చట. పాపం కేసీఆర్‌కు ఫామ్‌హౌజ్‌లో పన్నా ప్రశాంతత లేకుండా పోయింది. ఇప్పుడు కేసీఆర్ ఫామ్‌హౌజ్‌లోకి వెళ్లొద్దని నిర్ణయం తీసుకున్నాడు. అంటే రేవంత్ దెబ్బకు ఫామ్‌హౌజ్‌కు పోవడానికే జంకుతున్నాడా? కాదు. ఆయన ఆరోగ్యం బాగాలేదు. విషమించింది. మొన్న ఆరోగ్యం బాగాలేకనే ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు.
పరీక్షల కోసం నందినగర్‌లోనే ఉన్నాడు. మళ్లా ఫామ్‌హౌజ్ వైపు పోలేదు. ఇక పోడు కూడా. ఎందుకంటే… ఆయనకు ఇప్పుడు ఫ్యామిలీ సేవలు అవసరం. మొన్నటి వరకు ఒక్కడే ఒంటరిగా ఫామ్‌హౌజ్‌లో గడిపాడు. మధ్యలో కాలు జారి కిందపడి తుంటి ఎముక విరిగడం, సర్జరీ కావడం తేరుకోవడానికి చాలా సమయమే పట్టింది. ఆ తరువాత క్రమంగా ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది. ఆస్పత్రిలో షేరీఖ్ కావడం చాలా రోజుల తరువాత మొన్నే జరిగింది. అందుకే ఆయన ఆస్పత్రికి అందుబాటులో ఉండటంతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో ఉండటమే బెటరని వైద్యులు సూచించారు. దీంతో ఆయన నివాసం నందినగర్‌లోనే బస చేస్తున్నాడు.
కొందరికి మాత్రమే అపాయింట్మెంట్ ఇస్తున్నాడు. అసవరమైనప్పుడే సమీక్షలు పెడుతున్నాడు. కేటీఆర్, హరీశ్‌రావు తదితర ముఖ్య నేతలతోనే ఆయన ములాఖత్ అవతున్నాడు. లిమిట్‌గా మాట్లాడుతున్నాడు. ఎక్కువ స్పందించడం లేదు. ఆరోగ్యంరీత్యా ఆయన ఇక ఫామ్‌హౌజ్‌కు వెళ్లకపోవడమే బెటరని అంతా అనుకుంటున్న నేపథ్యంలో నందినగర్‌లో ఆయన బస చేస్తున్నాడు.
