(దండుగుల శ్రీ‌నివాస్‌)

హైడ్రా విష‌యంలో సీఎం రేవంత్‌రెడ్డి ఓ సూచ‌న చేశాడు. పేద‌ల జోలికి పోవ‌ద్ద‌న్నాడు. పెద్ద‌ల‌ను కొట్టాల‌ని పిలుపునిచ్చాడు. ఈ హైడ్రా తీసుకొచ్చిన త‌రువాత ప్ర‌భ‌త్వం బ‌ద్నామే అయ్యింది త‌ప్ప న‌యాపైసా ఉప‌యోగం లేదు జ‌నాల‌కు. హైడ్రా పోలీస్ స్టేష‌న్ ప్రారంభించిన త‌రువాత సీఎం మాట్లాడాడు. హైడ్రా అధికారులకు నా సూచన.. పేదల పట్ల మానవీయ కోణంతో, సానుభూతితో వ్యవహరించండి అభ్య‌ర్థించాడు. ఓ వైపు మాజీ సీఎం కేసీఆర్ కూడా మొన్న .. నీ బొంద హైడ్రా అంటూ రేవంత్‌రెడ్డిని తిట్టిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఈ మాట‌న్నాడు.

ఇంకా ఏమ‌న్నాడంటే.. పేదలకు ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకురండి ..పెద్దల పట్ల కఠినంగా వ్యవహరించండి…మన నగరాన్ని పునరుద్ధరించుకోవాలన్న ఆలోచనతోనే హైడ్రాను తీసుకొచ్చాం అన్నాడాయ‌న‌. బెంగుళూరులో చెరువులను పరిరక్షించుకోకపోవడంతో తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి ఉంద‌ని, ముంబై, చెన్నై వరదలతో సతమతమవుతున్నద‌ని గుర్తు చేశాడు. కాలుష్యాన్ని నియంత్రికపోవడంతో ఢిల్లీలో పార్లమెంట్ నుంచి పాఠశాల వరకు సెలవులు ప్రకటిస్తున్నార‌న్నాడు. మెట్రో నగరాలు నివసించడానికి యోగ్యం కాని నగరాలుగా మారుతున్నాయ‌ని, ప్రకృతిని కాపాడుకోకపోతే హైదరాబాద్ లోనూ ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయ‌ని హె చ్చ‌రించాడు. చెరువులు ఆక్రమిస్తే ఎంతటివారినైనా హైడ్రా ఉపేక్షించ‌బోద‌న్నాడు.

You missed