(దండుగుల శ్రీనివాస్)
పాలన పడేకేసిందనే చెప్పాలి. స్టార్టింగ్ ట్రబుల్‌ను వీడి అది ముందుకు సాగడం లేదు. ఎన్నో సాకులు సర్కార్ వెతుక్కున్నా జనం కనీసం సానుభూతి చూపకపోగా.. ఇది చేతల ప్రభుత్వం కాదు మాటల ప్రభుత్వం.. కోతలు కోసే ప్రభుత్వమని డిసైడ్ అయిపోయారు. ఈ నేపథ్యంలో ఇవాళ జరగనున్న కేబినెట్ మీటింగు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నది. పెండింగ్ పథకాలు పరుగులు పెట్టేలా , కొత్త పథకాలు పట్టలెక్కలా నిర్ణయాలుండననున్నాయి. అవినీతి మరక వేసి జనం ముందు కేసీఆర్, కేటీఆర్ ఫ్యామిలీని దోషిలా నిలిపే ప్రయత్నంలో రేవంత్ సర్కార్ ఫెయిల్ అయ్యింది.
విచారణ పేరుతో చేస్తున్న కాలయాపన ఆ పార్టీలోనే తీవ్ర అసంతృప్తికి దారి తీయగా.. జనాలైతేత నమ్మడమే మానేశారు. దీంతో ఇక దీనిపై వడివడిగా చర్యలు తీసుకుని .. అవినీతి పరులు అనే ముద్రవేసి కేసీఆర్ ఫ్యామిలీని ప్రజాక్షేత్రం ముందు నిలిపే ప్రయత్నం ఇక ముమ్మరం చేయాలని రేవంత్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. రైతు భరోసా లేదు. రైతు బీమా లేదు. కొత్త పథకాల ఊసు లేదు. పాత పథకాలు పడకేశాయి. రాజీవ్ యువ వికాసం ఫైరవీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. వీటన్నింటిపైనా కేబినెట్‌లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.