(దండుగుల శ్రీనివాస్)
అదే పైశాచికానందం. మారనితీరు. పెరుగుతున్నదే తప్ప తగ్గని అహంకారం. ఇవి చాలవా రేవంత్‌ను , కాంగ్రెస్‌ను పదికాలాల పాటు పచ్చగా నిలబెట్టడానికి. రేవంత్ సర్కార్ విఫలమైంది నిజమే. జనం వద్ద తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుంటున్నదీ వాస్తవమే. ఇదే నిలకడగా మరో మూడేండ్లూ ఉంటుందని అనుకోలేం. చివరి ఏడాది వరకు జనం ఆలోచన మారొచ్చు. సర్కార్ వారి మనసు గెలుచుకునేలా ఏదైనా చేయొచ్చు. అప్పటిదాకా ఆగేలా లేరు మనోళ్లు. తమ తప్పులు తెలుసుకునే పనినే చేయలేదు సరికదా. మనల్ని ఓడించిన జనాలు కానాకష్టాలు పడుతున్నార్రోయ్.. చూశారా.. మంచిగైంది. అన్నట్టు పైశాచికానందం పొంది చంకలు గుద్దుకునేలా ఉంటున్నాయి వీరిద్దరి మాటలు.
ఇవి ఇంకా కాస్త శృతి మించి పాకాన కూడా పడుతున్నాయి. తినే అన్నంలో మన్నుపోసుకున్నారన్నాడు కేటీఆర్. వాళ్లు మన్నుపోసుకున్నారో లేదో కానీ, మమ్మల్ని ఓడగొట్టినందుకు మీ నెత్తిమీద మన్నువొయ్యా.. అని నువ్వు తిట్టినట్టే ఉన్నాయామాటలు. కేసీఆర్‌ను సీఎంగా చేయడం చారిత్రక అవసరమంటున్నాడు. ఇక తను జన్మలో సీఎం అయ్యే చాన్స్ లేదని భాధ ఉండనే ఉంది. ఇంకో మాటన్నాడు యువరాజు. ఏమన్నడంటే.. తెలంగాణ నష్టపోయింది. ఇంకో మాటకూడా అన్నడు. మనకు నష్టం తక్కువనే జరిగింది. ఇంకో పైత్యపు కామెంట్ కూడా చేసిండు. అసలు మనల్ని గెలిపించుకోవడం మన అవసరం కాదెహ.. జనాల అవసరమే అన్నడు. అబ్బబ్బ… ఏమన్నా పీక్ కు పోయిందా ప్రష్టేషన్.
జనాల నాడి నువ్వు,కేసీఆర్ ఇంకా తెలుసుకోలేకపోయారని చెప్పడానికి ఈ మీ మాటలు చాలవా..? అంటే తెలంగాణలో మేం తప్ప ఇంకోఆల్టర్నేట్ లేదురో.. చచ్చినట్టు మాకే మీరు ఓటెయ్యాలే. మా పంచనే చేరాలె. మమ్మల్నే గెలిపియ్యాలే. మేమే సీఎంలు కావాలె. మేం పాలిస్తేనే మీకు జీవగంజిరా సన్నాసుల్లారా..! అని జానాన్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టీ తిట్టీ తన లోపలున్న కసినంతా తీర్చుకున్నడు యువరాజు. రేవంత్ సర్కార్‌కు, రేవంత్‌కు ఇలాంటి మీ ఆటిట్యూడే కావాలి. మీరిలాగే ఉండాలె. అప్పుడు జనం కూడా మీరు మారర్రరేయ్…. వాళ్లే నయం అనుకోవాలె. రెండోసారి కూడా చాన్స్ ఇచ్చి చూద్దాం ఈ వెధవలు ఇంకా మారలే అని ఎప్పటికప్పుడు రేవంత్ సర్కార్‌పై పెరుగుతన్న వ్యతిరేకతను తగ్గించుకోవాలె. అట్లనే చేస్తున్నరు వీళ్లు. సరేగానీ, మీ లోపాలేమీ లేవంటవా యువరాజా..?
అయితే ఓ పనిచేయండి. వరంగల్ సభలో మళ్లీ నాలుగో సారి వారికే టికెట్లని కేసీఆర్ చేత ప్రకటింపజేయి. ఇదొక్కటి చేయి చాలు. మీ గెలుపు సంబురాలు, మీ ఊహాగానాలు, అధికార భ్రమలు తొలిగిపోతాయి. జనాలకు మరింత క్లారిటీ వస్తుంది. కేసీఆర్ కుక్కను నిలబెట్టినా జనాలు గెలిపిస్తారు. కరెక్టే. అందుకే మళ్లీ మళ్లీ వారికే టికెట్లిచ్చి చూడండంతే.