కంఠశోష… గతితప్పిన మాట.. ఇదే సీఎం రూటు..!
ఓరుగల్లు సాక్షిగా దారితప్పిన సీఎం ..!
ఓరుగల్లు విజయోత్సవ రచ్చ రాజకీయం..!
అదే రేవంతు… మారలేదు..!!
పథకాల ఊసులేదు.. ఇచ్చిన హామీల మాటలేదు….!!
ఇంకా ప్రతిపక్ష పార్టీ నేతగానే కేసీఆర్, కేటీఆర్‌ను టార్గెట్ చేసిన రేవంత్…!
ఇవ్వాల్సిన హామీల గురించి దాటవేసి .. విమర్శలకే ప్రాధన్యం ఇచ్చిన సీఎం..!
కేసీఆర్ ఫామ్‌హౌజ్‌లోనే ఉండాలంటాడు… అసెంబ్లీకి రావయా సామీ అంటూ బతిమాలుకుంటాడు..!
చెప్పేందుకు సరకు లేనప్పుడు.. ఇలాగే గుడ్డెద్దు చేలో పడ్డట్టుగానే ఉంటది…
(దండుగుల శ్రీనివాస్)
చెప్పుకోవడానికి ఏమీ లేనప్పుడు… చేసింది పెద్దగా చెప్పుకుని చాతి విరుచుకుని కాలరెగరేసుకొనే పరిస్థితి లేనప్పుడు.. అచ్చంగా ఇలాగే ఓరుగల్లులో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ లాగే గతి తప్పి .. పక్కదారి పట్టి.. కంఠశోష మిగిల్చి.. జనం మెప్పు పొందక.. నలబీమ పాకంలో ఉప్పులేని విధంగా చప్పగా ఉంటుంది. ఏడాది విజయోత్సవాలన్నాడు. చెప్పుకోవడానికి ఏం లేదు. ఒక్క ఫ్రీ బస్సు పథకం తప్ప. ఒట్టు.. నిజంగా జనాలు కూడా పెద్దగా రేవంత్ పై నమ్మకం కోల్పోయారు. రుణమాఫీ 17వేల కోట్లు చేశానన్నాడు. మిగితా వాళ్లకూ చేస్తాననంటున్నాడు. కానీ క్లారిటీ లేదు. ఇప్పటి వరకు ఎందుకు చేయలేదు. రైతుబంధు ఊసులేదు. ఇక అభివృద్ధి, సంక్షేమం వదిలాడు. మళ్లీ కేటీఆర్, కేసీఆర్ వెంట పడ్డాడు. కేసీఆర్ ఫామ్ హౌజ్‌కే పరిమితం కావాంటాడు. ఫుల్ బాటిళ్లు పంపిస్తానంటాడు. రావయ్యా సామీ అసెంబ్లీకి అని బతిమాలుతాడు. బెల్టు షాపులున్నాయంటాడు.
మరి ప్రభుత్వం ఏం చేస్తుందో… అబ్బ చెప్పొద్దూ.. ఇంత క్లారిటీ మిస్ అయిన సీఎం మరెవరూ ఉండరనుకుంటా. నిజం..! ఏమీ చెప్పలేని విషయం లేనప్పుడు.. చేసిన విషయమే లేనప్పుడు.. ఇలాగే గుడ్డెద్దు చేలో పడ్డట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం లాగే ఉంటుంది. కేటీఆర్, కేసీఆర్‌న ఊచలు లెక్కిస్తానంటున్నాడు. ఏడాది గడిచినా ఇంకా వారి ఊచలు లెక్కించేందుకే ఇంత సమయం తీసుకున్నారా..? మాకేంటీ సామీ..! ఏం చెప్పావు..? ఏం చేస్తున్నావు..?? కేసీఆర్, కేటీఆర్‌ను జైళ్లు పెట్టించుకో ఇంకా ఏమన్నా చేసుకో..! తెలంగాణ జనానికొచ్చిన లాభమేమిటీ..? మాకు నువ్వు చేయాల్సిన పనులేమిటీ…? నెరవేర్చాల్సిన హామీలేమిటీ..?? ఆ ముచ్చట చెప్పుమంటే.. నువ్వో సీఎంననే విషయం మరిచినట్టున్నావ్ రేవంతు..! చేసేది కామ్‌గా చేసుకుంటూ పో..! జనాలకు ఏం చేస్తావో చేసెయ్..! అదీ కదా మేం కోరుకున్నది.
నువ్వు పదే పదే కేసీఆర్, కేటీఆర్ పేర్లు ఉచ్చరిస్తుంటే ఎందుకో వారిద్దరూ నిన్ను బాగా డిస్టబ్ చేస్తున్నట్టున్నారు ఏడాది పొడవునా. జర వారి గురించి మరచిపోరాదు. మా గురించి జర పట్టించుకోరాదే. ఎందుకిలా తయారయ్యావు. సీఎం హోదాలో నువ్వు మాట్లాడాల్సిన మాటలేనా అవి. ఏడాది విజయోత్సవాలని చెప్పి ఏం చెప్పినవ్..! ఇంకా నువ్వు ప్రతిపక్ష నాయకుడివే అనుకుంటున్నావా..? ఆ ఫామ్‌హౌజ్‌లో పన్న కేసీఆర్ గురించి మాకెందుకు..? ఢిల్లీ వెళ్లి లొల్లి లొల్లి చేస్తున్న కేటీఆర్ గురించి మాకెందుకు…?? నువ్వు మాకోసం ఏ చేస్తావో చెప్పు సామీ అంటే…. తు తు తు అని ఏదో సినిమాలో బ్రహ్మానందం డైలాగులా పొంతనలేని ప్రసంగం మాకు చిరాకు తెప్పించిందంటే నమ్ము. ఇంకా ఎన్ని రోజులు ఈ మాటలు చెబుతావు రేవంతు. అన్నీ అబద్దాలే. హామీలన్నీ బుట్టదాఖలే. చేతగాని పరిస్థితి ఉన్నప్పుడు ఇలాగే ప్రతిపక్షాన్ని నిలువు పాతరేయాలె. కరెక్టే. కానీ ఇప్పుడు మేమే నిలువుపాతర అవుతున్నాం. కాపాడుతావా..? నీ రాజకీయాలు నువ్వు చూసుకుంటావా..???