వాస్తవం ప్రతినిధి- కామారెడ్డి
ప్రభుత్వ సలహాదారు, సీనియర్ లీడర్ షబ్బీర్ అలీకి , అతని వర్గానికి ఇదో షాక్ న్యూస్. షబ్బీర్ కు అత్యంత దగ్గరి అనుచరుడైన వడ్డేపల్లి సుభాష్‌రెడ్డిపై అధిష్టానం చర్యలు తీసుకునేలా చేశారు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు. పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా వడ్డేపల్లి పనిచేస్తున్నారని అధిష్టానానికి మదన్ చేసిన ఫిర్యాదు మేరకు.. అధిష్టానం అతనికి షోకాజ్ నోటీసు జారీ చేసింది. తన అనాలోచిత నిర్ణయాలతో రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టుకున్నాడు వడ్డేపల్లి.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్లారెడ్డి నుంచి బీజేపీ తరపున పోటీ చేసి ఓడిన సుభాష్‌రెడ్డి.. మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఇక్కడి నుంచి గెలిచిన మదన్ మోహన్‌కు కొరకరాని కొయ్యగా మారాడు. షబ్బీర్ అండదండలు చూసుకుని రెచ్చిపోయాడు. చివరకు అధిష్టానం వేటుకు బలయ్యాడు. షబ్బీర్‌కు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యేకు మధ్య చాలాకాలంగా విభేదాలున్నాయి. పై చేయి నీదా నాదా అనే రేంజ్‌లో ఇద్దరి మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. ఈ క్రమంలో షబ్బీర్ అనుచరుడి సుభాష్‌పై అధిష్టానం చర్యలు తీసుకునేలా చేసి తనదే పై చేయి అని నిరూపించుకున్నాడు మదన్.