(దండుగుల శ్రీ‌నివాస్‌)

ఇప్పుడు జ‌ర్న‌లిస్టుల కింక‌ర్త‌వ్యం కాంగ్రెస్ స‌ర్కార్‌ను కాపాడుకోవ‌డం. ఈ ప్ర‌భుత్వాన్ని కాపాడుకుంటేనే ఇక ఫ్యూచ‌ర్ అన్న‌మాట‌. ఫ్యూచ‌ర్ సిటీనా వాలో మ‌న‌కో జాగా ప‌క్కాగా బుక్క‌యి ఉంటుంద‌న్న‌మాట‌. అవును రేవంత్ చెప్పిన మాట ఇదే. ఇచ్చిన హామీ ఇంచుమించు ఇంతే. కేసీఆర్ స‌ర్కార్ జ‌ర్న‌లిస్టుల‌ను క‌రివేపాకు క‌న్నా అధ్వానంగా చూసింది. కాదంటారా..! ఎవ‌రూ అన‌రు. అంతా బాధితులే. జ‌ర్న‌లిస్టుల‌కు ఆ పదేండ్లు చీక‌టి రోజులు. విషాదబరిత జీవితాలు. ఎవ‌రూ ఊహించ‌లే. ఆ తియ్య‌టి మాట‌ల‌కు క‌రిగిపోయారు. క‌దిలిపోయారు. నిలువునా న‌మ్మారు. అడ్డంగా బ‌ల‌య్యారు. ఈ అనుభ‌వం ప్ర‌తీ జ‌ర్న‌లిస్టుది.

ఆ స‌ర్కార్ కుదేలై ఫామ్ హౌజులో బంధీ కావడం వెనుక కార‌ణాలు.. అంద‌రి పాపాల మాదిరిగానే కొంత భాగం జ‌ర్న‌లిస్టుల శాప‌మూ తోడైంద‌ని ఈ సంద‌ర్భంగా చెప్ప‌క‌త‌ప్ప‌దు మ‌రి. ఏరికోరి కాంగ్రెస్ స‌ర్కార్‌ను తెచ్చుకున్న‌వారిలో ఈ సెక్ష‌నూ ఉందండోయ్‌..!మ‌రి మాతో పెట్టుకుంటావా..! తిక్క కుదిరిందిగా. స‌రే అది ఒడిసిన ముచ్చ‌ట‌. మ‌రి ఇప్పుడు అయితే మాకేంటీ…? అదే మాకేంటీ అని అడుగుతున్నాం.. ! చేస్తం బై. జ‌ర్ర ఓపిక లేదా..! ఏండ్ల త‌ర‌బ‌డి పెండింగ్‌లో ఉన్న జ‌వ‌హార్‌లాల్ నెహ్రూ జ‌ర్న‌లిస్టు హౌజింగు సొసైటీకి చెందిన ప‌ద‌కొండు వంద‌ల మంది జ‌ర్న‌లిస్టుల‌కు ప‌ట్టాలియ్య‌లేదా..? వాళ్ల‌ను కోట్ల విలువ జేసే ఇళ్ల స్థ‌లాల‌కు ఓన‌ర్ల‌ను చేయ‌లేదు. చేసేందుకు చేతులు రాక దాట‌వేసిన కేసీఆర్, కొడుకు చేష్ట‌లు చూసి విసిగిపోయింది మీరే క‌దా. మ‌రి చేసి చూపించింది ఈ చేతి గుర్తు పార్టే క‌దా.

అంత న‌మ్మ‌కం లేక‌పోతే ఎలా బ్ర‌ద‌రు. చేస్తా.. చేస్తా.. ఇస్తా.. ఇస్తా…! మీ ఫ్యూచ‌ర్‌ను నేను తీర్చిదిద్దుతాగా. ఫ్యూచ‌ర్ సిటీలో మీకో జాగా రాసిస్తాగా. కానీ ఓ కండిష‌న్. అస‌లు కాంగ్రెస్ స‌ర్కార్ న‌డుస్తున్న‌దే కండిష‌న్స్ అప్లై విధానం మీద కదా. మ‌రి ఎంతో రెస్సాన్సిబిలీటీ ఉన్న మీకు కూడా ఓ కండిష‌న్ పెట్టాలె క‌దా. ఏం కండిష‌ను సారు..! జర చెప్ప‌రాదు. ఏం లేదు బై. మిమ్మ‌లి రాచిరంపాన పెట్టి అరిగోస పెట్టిన కేసీఆర్‌నే రెండు సార్లు గెలిపించిండ్రు.. న‌డుంక‌ట్టి. ఆ అయితే! మ‌రి మీ ప‌ట్ల ఎంత మ‌ర్యాద‌తో ఉన్నం. ఎంత క‌న్స‌న్ చూపిస్తున్నం. ఎంత‌టి ఫ్యూట‌ర్ ప్లాన్ ర‌చిస్తున్నం. ఔఔ!

మ‌రైతే రెండోసారి అధికారంలోకి తెస్తారు క‌దా. తెచ్చిన వెంట‌నే. మేం వ‌చ్చిన వెంట‌నే మీకు ప‌ట్టాలు ప‌క్కా. మీ ఫ్యూచ‌ర్ భ‌రోసా ఇక నాది .. భ‌రోసా పెట్టండి నా మీద‌. అదేందివ‌యా..! అట్ల డౌట‌నుమానంతో ఎందుకు చూస్తుండ్రు. ఏంలేదు. ఏంలేదు. మ‌రి చెప్పుండ్రి.. మ‌న డీల్ ఓకేనా. మ‌ళ్లీ మ‌నం వ‌స్తున్నాం.. మీకు ఇస్తున్నాం. అంతేనా. అంతేగా. మీ జూబ్లీహిల్స్ సొసైటీ, ద‌క్క‌న్ సొసైటీ ఫ్యూచ‌ర్ నాకొదిలెయుర్రి బై. అంతేనా. అంతేగా…! అంతేగా..!!

You missed