(దండుగుల శ్రీనివాస్)
బిగ్‌బాస్ తలనొప్పికి మరో రెండ్రోజుల్లో ముగింపు రానుంది. మనందరి కంటే నాగార్జునే ఎక్కువ ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్టున్నాడు ఇదెప్పుడయిపోతుందా అని. అంతటి వరెస్ట్డ్ కంటెస్టెంట్ల ఎంపిక చేశారు. ఓ నెల రోజులు గుంజుకొచ్చారు. ఉహూ అది ముందుకు సాగలేదు. ఏకంగా ఆరుగురిని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా లోపలికి పంపారు. వీరన్నా కొత్త ముఖాలా..? అంటే కానే కాదు. అన్నీ గతంలో చూసినవే. హౌజ్‌లో చికాకు కల్పించిన క్యారెక్టర్లే. వీరినే మళ్లీ మళ్లీ దించారంటేనే వారి ఈ సీజన్ ఎంపిక ఎంతటి వరెస్టో అర్థమయిపోయింది. ఇప్పుడు మిగిలిన వారిలో గౌతమ్, నిఖిల్, అవినాశ్, నబీల్, ప్రేరణ.. ఉన్నారు.
ఇందులో వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన పాత రోత ముఖాలు గౌతమ్, అవినాశ్. అవినాశ్‌కు ఇందులో అంటే ఈ ఇంట్లో ప్రవేశించడం ఏమాత్రం ఇష్టం లేనట్టుంది. మందుందా…? పెండ్లం గుర్తొచ్చింది అంటూ నస పుట్టించాడు. ఇతడు ఎలాగూ చివరకు రాడని తెలుసు. కానీ గౌతమ్ చివర వరకు రావడం.. బిగ్‌బాస్ విన్నర్‌గా చాన్స్ ఉందని ప్రచారం కావడం ఇంకో విషాదం. అంటే మొదట ఎంపిక కంటెస్టెంట్లు ఎందుకూ పనికి రాలేదన్నమాట. పాపం నాగార్జున సీజన్ సీజన్‌కు ఎంతటి నరకం అనుభవిస్తున్నాడో.
ఈ సీజన్‌లోనైతే మరీ దారుణం. చివరాఖరుకు చెప్పొచ్చేదేమిటంటే… ఆ గౌతమ్ ఇవ్వడమంటూ వీరి ఎంపిక ఎంత ఘోరమో వీరే ఒప్పుకున్నట్టు. వైల్డ్ కార్డు ఎంట్రీ కాకుండా మొదట వచ్చిన వారిలో మిగిలిన నబీల్, ప్రేరణ, నిఖిల్.. వీరిలో ఎవరినో ఒకరిని చేయండి.. చేసేయండి.. నాగార్జున గారు..!