వాస్తవం ప్రధాన ప్రతినిధి – హైదరాబాద్:
ఆరు వారాల పాటు పరమ బోరింగ్‌గా సాగిన బిగ్‌బాసుకు వైల్డ్ కార్డు ఎంట్రీతో జాకీలు పెట్టి లేపే ప్రయత్నం చేశాడు నాగ్. అవును.. ఈసారి కంటెంస్టెంట్ల ఎంపిక చెత్తగా ఉంది. అందుకే ఆది నుంచే ఈప్రోగ్రాంకు జనాధారణ తగ్గింది. ఎవరో .. ఎవరెవరో వస్తారనుకున్నారు. కానీ ఎవరూ రాలేదు. ఇగో ఇలా వైల్డ్ కార్డు ఎంట్రీ పేరుతో పాత కంటెస్టెంట్లని మరో 8 మందిని హౌజలో నింపాడు. ఇగ కొట్టుకోండి.. తన్నుకోండి…మజా చేసి బిగ్‌బాస్ కు బూస్టింగ్ ఇవ్వండంటూ. వైల్డ్ కార్డు ఎంట్రీతో హౌజ్‌లో రంగ ప్రవేశం చేసిన వారిలో హరితేజ, రోహిణి, గంగవ్వ, ముక్కు అవినాశ్, మహబూబ్, నైని పావని, గౌతమ్ క్రిష్ణ.. ఇలా 8 మంది ఉన్నారు.
అంటే పాత వారితో పరమ బోరింగ్ సాగిందని చెప్పకనే చెప్పాడు నాగ్. ఎప్పుడైనా ఒకరిద్దరు మాత్రం వైల్డ్ కార్డు ఎంట్రీతో హౌజ్ లోకి వచ్చేవారు.కానీ ఈసారి ఏకంగా 8 మంది రావడమంటేనే ఈ షో ఎలా అడుగు పట్టిందో అర్థమవుతోంది. గంగవ్వనైతే ఓపెన్ గా చెప్పేసింది. ఆట ఎవరూ సరిగ్గా ఆడటం లేదని, ముక్కు అవినాశ్ కూడా చెప్పాడు తను అప్పుడప్పుడు మాత్రం కొద్ది కొద్దిగా మాత్రమే బిగ్‌బాస్ చూశానని, అంటే ఇలా బలవంతంగా ఖాళీగా ఉన్న వారిని లోపలకు తోశారన్నమాట. ఇక ఇప్పుడు హౌజ్‌లో మిగిలిన ఉన్నవారిలో ప్రేరణ, పృథ్వీ, నబీల్‌లు కొంత ఇంట్రస్టింగ్‌గా ఆడుతున్నారు. మిగిలిన వారంతా సో.. సో.. సోదీ..!