(దండుగుల శ్రీనివాస్)
సమగ్ర కుటుంబ సర్వేను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సర్కార్‌కు ఇప్పుడు అపోహలు, ప్రచారాలు తీవ్ర ఆటంకంగా మారాయి. సర్వే బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన విషయం తెలిసిందే. అయితే దాదాపు 75 ప్రశ్నలకు సమాధానాలను ఈ సర్వే రిపోర్టులో పొందుపర్చుతున్నారు. ఆస్తుల వివరాలు కూడా ఇందులో ఉన్నాయి. కారు ఉందా..? ఆస్తులెన్ని..? రైతుబంధు తీసుకుంటున్నారా…? అనే వివరాలు సేకరిస్తున్నారు. అయితే ఆస్తుల వివరాలు పూర్తిగా చెబితే రేషన్‌కార్డు తొలగిస్తారనే ప్రచారం మెల్లగా ఊపందుకున్నది.
దీంతో కొందరు సర్వేకు సహకరించకపోవడం, పూర్తిగా వివరాలు వెల్లడించకపోవడంతో అక్కడక్కడ సర్వేకు ఆటంకాలు ఏర్పాడ్డాయి. ఇంకొందరైతే పింఛన్లు కూడా తీసేస్తారని ప్రచారం చేశారు. దీంతో సర్వే అంటేనే జంకే పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రచారాన్ని, అపోహలను తొలగించే క్రమంలో అధికార యంత్రాంగం విఫలమైంది. ఇది ఆ మాట ఈ మాటగా సర్కార వద్దకు చేరింది. దీనిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్తలు ఖండించారు. రేషన్‌కార్డులకు ఈ సర్వేకు లింకులేదని స్పష్టం చేశారు.
కొందరు కావాలనే సర్వే సజావుగా సాగొద్దని ఇలా చేస్తున్నారని భట్టి మండిపడ్డాడు. ఎలాంటి గందరగోళానికి, అయోమయానికి లోనుకావొద్దని పొన్నం సూచించారు.