వాస్త‌వం ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌:

రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి స‌మ‌క్షంలో సోమవారం సచివాలయంలో నిర్వహించిన ఉద్యోగ సంఘాల సమావేశంలో ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి అధ్యర్యంలో ట్రెసా ప్రతినిధి బృందం పాల్గొని ఉద్యోగుల సమస్యలను నివేదించారు.

ఈ సందర్భంగా రెవిన్యూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను మంత్రి గారి దృష్టికి తీసుకువచ్చి కూలంకషంగా చర్చించారు. ప్రధానంగా తహశీల్దార్ల ఎన్నికల బదిలీలు వెంటనే చేపట్టకపోవడం వల్ల ఉద్యోగులు కుటుంబాలకు దూరమై తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని వివ‌రించారు. గ్రామ స్థాయిలో ఒక రెవిన్యూూ అధికారిని నియమించి వి ఆర్ ఓ ద్వారా భర్తీ చేయాలని తద్వారా రెవిన్యూ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. నూతన మండలాలకు,డివిజన్ కార్యాలయాలకు కేడర్ స్ట్రెంత్ మంజూరు చేయకపోవడం వల్ల గత చాలా కాలంగా జీతాలు రాక ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని వివ‌రించారు. వి అర్ ఎ లకు సంబందించి కారుణ్య నియామకాలు,సుదూర ప్రాంతాలకు బదిలీ చేసిన వారిని సొంతజిల్లాలకు బదిలీ చేయాలని,పదోన్నతి పొంది ఆరు నెలల లోపు రిటైర్ అయిన వి అర్ ఎ ల వారసులకు ఉద్యోగాలు కల్పించాలని, 55 నుంచి 61 సంవత్సరాల మధ్యగల వి ఆర్ ఏ ల పిల్లలకు ఉద్యోగం కల్పించాలని కోరారు.

ఇవీ ప్ర‌ధాన డిమాండ్లు..

– రెవెన్యూ ఉద్యోగులకు చట్టాలపై ,నిబంధనలపై అవగాహన పెంపొందించుకునేందుకు రెవెన్యూూ ఆకాడమిని ఏర్పాటు చేయాలి..

– ధరణి రిజిస్ట్రేషన్లు మండల కార్యాలయములో పని చేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లను రెగ్యులరైజ్ చేసి వారికి అప్పగించాలి..

– 317 జీవోద్వారా బ‌దిలీ అయిన అన్ని కేడర్లను ఉద్యోగులను స్వంత జిల్లాలకు బదిలీ చేయాలి.

– గతంలో వి ఆర్ ఓ,వి ఆర్ ఏ లను ఇతర శాఖలకు పంపించిన వారిని తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకు రావాలి.

– అన్ని కేడర్ లలో రెవిన్యూ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలి

– తహశీల్దార్ల వాహన బిల్లులు, ఇతర పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలి .

– ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్, తహశీల్దార్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయకుండా పోలీసు శాఖకు ఆదేశాలు జారీ చేయాలి .

మంత్రిగారు ఈ సందర్భంగా మాట్లాడుతూ… రాష్ట్ర స్థాయిలో ఈ నెల 29న తహశీల్దార్లతో ,డిప్యూటీ కలెక్టర్లతో వచ్చేనెల 6న సదస్సు నిర్వహిస్తామని,మిగతా అన్ని సమస్యలపై సి సి ఎల్ ఏ నివేదిక సమర్పించమని ఆదేశించారు, తదుపరి అన్ని సమస్యలపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.

తహశీల్దార్ల ఎన్నికల బదిలీల‌పై త్వరలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చార‌ని వంగ ర‌వీంద‌ర్‌రెడ్డి తెలిపారు.

కార్యక్రమంలో ట్రెసా అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె. గౌతమ్ కుమార్ లతో పాటు అసోసియేట్ అధ్యక్షులు రాజ్ కుమార్, ఉపాధ్యక్షులు కె. నిరంజన్, బాణాల రాంరెడ్డి, నిజామాబాదు జిల్లా అధ్యక్షులు రమన్ రెడ్డి,మేడ్చల్ జిల్లా కార్యదర్శి వంగ రామకృష్ణ రెడ్డి,దాదేమియా,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

You missed