ఇందిరాగాంధీ చనిపోయి నేటికి నాలుగు దశాబ్దాలు గడిచినా ఆ ఘోరం నిన్న నో,మొన్న నో జరిగినట్టు అనిపిస్తోంది నాకు.దానికి కారణం నాకు ఆవిడ మీదున్న గౌరవమో,కాంగ్రెస్ పార్టీ మీదున్న అభిమానమో కాదు,నా స్కూలు,కాలేజీ రోజుల్లో చాలా రోజులు నాకు ఇప్పటికీ క్రిస్టల్ క్లియర్ గా గుర్తుండడం.అలా నాకు బాగా గుర్తున్న విషయాలను కూర్చి ఇందిరానంతర దేశ రాజకీయాల్ని క్లుప్తంగా మీ ముందు వుంచాలి అన్నది నా ఈ చిన్ని ప్రయత్నం. నేను RSS నాయకుల ఆధ్వర్యంలో నడిచిన కాన్వెంట్ స్కూల్లో చదివాను.ఆ స్కూల్లో ప్యూన్ నుండి ప్రిన్సిపాల్ దాకా ఇందిరను నరనరాన ద్వేషించేవారూ,ఎమర్జెన్సీ రోజుల్లో జైలుకు వెళ్లొచ్చిన వారూ వుండేవారు.ఆ స్కూల్ పిల్లలమయిన మేం బై డిఫాల్ట్ జనతా పార్టీకి,తర్వాత కాలంలో బీజేపీ కీ బాగా బాల కార్యకర్త లం అన్న మాట.బీఎ,బీకాం,ఎంఎ లు చదివేసి బీఈడీ లో సీటు దొరకక ,ప్రభుత్వోద్యోగం రాక ప్రైవేట్ స్కూల్ టీచర్ల అవతారాలు ఎత్తిన చదువుకున్న మూర్ఖులు మా మేష్టర్లు అనే చిన్ని విషయం ఆ రోజు నా బుల్లి బుర్రకు అర్థం కాలేదు.
ఇందిరకు వీరాభిమాని, ప్రభుత్వ ఉపాధ్యాయుడు అయిన మా నాన్నగారు సుతిమెత్తగా ఈ విషయాన్ని నాకు చెప్పేవారు.వాళ్ళు ప్రతిరోజూ మనది ఒక హిందూ దేశమని,గాంధీ దేశాన్ని ముక్కలు చేసేసాడని, పటేల్ ప్రధాని కావడాన్ని గాంధీ అడ్డుకున్నాడని,నెహ్రూ బదులు పటేల్ ప్రధాని అయ్యుంటే ఇండియా అమెరికాని దాటేసుండును అని, ఇందిర భర్త ముస్లిం అని,ఆవిడని గాంధీ పెంచుకున్నాడని,మన హిందువులలో ఐకమత్యం లేక ముస్లింలు,బ్రిటిషర్లు మన దేశ సంపదను దోచేసారని,మన నలంద,తక్షశిల యూనివర్సిటీ లను ధ్వంసం చేసేసి మన వేదాలను ఎత్తుకుపోయి వాటిలో వున్న సైన్స్ తో రాకెట్లు తయారు చేశారని,వీర సావర్కర్,గాడ్సేలు అరి వీర దేశభక్తులని రోజూ మాకు నూరుపోసేవారు.
నలంద,తక్షశిల లు బుద్దులవని,బుద్దులను హిందువులు తరిమి కొట్టారని,బుద్ధ నేలలో బుద్ధిజం లేకుండా చేశారని,వేదాలలో సైన్స్ వుండుంటే మనోళ్లు మరీ రాకెట్లు కాకపోయినా హెలికాప్టర్లన్నా చేసుండాలి కదా అని, ఇందిర భర్త ది యే మతం అయితే మీకెందుకు? యే కులం అయితే మీకెందుకు? అని వారిని అడిగే వయసు మాకు లేకున్నా,ఆ రోజుల్లో సండే,ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ,బ్లిట్జ్ వంటి ఇంగ్లీష్ పత్రికలను రెగ్యులర్ గా చదివే ఇంగ్లీష్ /సోషల్ మాష్టారైన మా నాన్నగారి ద్వారా వారు చెప్పేదంతా సొల్లని నాకు తెలియడం,ఆ సొల్లు బాగా శృతిమించుతోందిని ఆయన ఆ టీచర్ల మీద కోప్పడి మమ్మల్ని స్కూల్ మార్చేస్తే టీచర్లు మా ఇంటికి వచ్చి మా నాన్న గారిని బ్రతిమాలి మరీ మమ్మల్ని వారి స్కూల్ కి తీసుకు వెళ్లడం నాకు ఇంకా జ్ఞాపకం.
ఎమర్జెన్సీ టైంలో ఏం జరిగిందో మరీ చిన్న పిల్లలం కాబట్టి మాకు
తెలియదు కానీ,ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి దేశమంతా కాంగ్రెస్ పార్టీకి చెందని ప్రతి పార్టీ నాయకులు, సారీ ప్రతి వెధవా కాంగ్రెస్ మీద ఇందిర, రాజీవ్ లు బ్రతికున్నంత కాలం,పోయాకా కూడా వారి మీద పడి,ఆ తర్వాత సోనియా, రాహుల్ ల మీద పడి ఏడ్చినవారే.కాలక్రమంలో ఆ కాంగ్రెస్ పార్టీ నుండే బోలెడు మంది వెధవలు బయటకి వచ్చి ఆల్రెడీ వున్న ఈ ఏడుపుగొట్టు వేధవలకి జత కలిసి నేటికీ ఏడుస్తూనే వున్నారు.
సోనియాను ప్రధాని కాకుండా అడ్డుకున్నారు.వాళ్ళే ఈ రోజున కమలా హరిస్ నీ అమెరికా అధ్యక్షురాల్ని చేసేస్తామంటున్నారు.
ఇందిరా గాంధీ దేశాన్ని ఎంత ముందుకు తీసుకెళ్ళిందొ అంతకు అంతా వెనక్కీ తీసుకురావడంలో కృతకృత్యులయిన ఈ వెధవ లలో ఈ రోజున కాంగ్రెస్ కు మిత్రులైన శివసేన,ఎన్సీపీ, డీఏంకే, నేషనల్ కాన్ఫరెన్స్ ,ఆప్,సమాజ్ వాదీ ,ఆర్జేడీ,జేఎంఎం వంటి పార్టీలూ వున్నాయి.అందుకే ఈ దేశం కాంగ్రెస్ చేతులలో వున్నా లేక పోయినా నాకు ఏ భాధా లేదు. కాంగ్రెస్ పార్టీ వున్నా కూడా బాగుపడేది ఆ వెధవలే తప్ప కాంగ్రెస్ వాదులు కాదు. దేశానికి, రాజకీయ నాయకులకి వుండాల్సింది రాజీవ్, సోనియా,రాహుల్ లాంటి మెత్తటి మనుషులు కాదు ఇందిర వంటి నియంతృత్వ ధోరణిలో ప్రజాస్వామ్యాన్ని పండించ గల పరాశక్తిలు.ఇందిర పేరు వింటేనే ఫాంట్లు,పంచెలు తడిపేసుకున్న వారి వారసుల పాలనలో మనం ఉన్నామన్న అసంతృప్తి వున్నా పూర్తి మెజార్టీ 250 స్థానాలకు గెలవకుండా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటును నేనసలు కోరుకోవడం లేదు, మహారాష్ట్ర, జార్ఖండ్ లలో కూడా ఇండియా కూటమి ఓటమిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిత్రులందరికీ దీపావళి పర్వదిన శుభాకాంక్షలు పేరు పేరు నా !!!
Raghu Sreemantula