వాస్తవం ప్రధాన ప్రతినిధి – హైదరాబాద్:
మొన్న మోడీ ఇక్కడి సర్కార్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. రైతులకు హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రుణమాఫీ చేయకుండా వారిని రోడ్లపైకి తెచ్చిందని ఘాటు విమర్శలు చేశాడు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయం మేమే అని చెప్పడం కోసం బీజేపీ తహతహలాడుతోంది. దీనికి మోడీ వ్యాఖ్యలే ఉదాహరణ. తాజాగా సోమవారం ఇందిరాపార్క్ వద్ద బీజేపీ రైతు దీక్ష చేసింది. బీఆరెస్‌ను ఓవర్ టేక్ చేసేందుకు యత్నిస్తున్నది.
రుణమాఫీ, రైతు భరోసా ఏదీ అని ఒకరోజు రైతు దీక్షను బీజేపీ చేపట్టింది. మొన్నటి వరకు ఈ విషయంలో బీజేపీ పెద్దగా పట్టించుకోలేదు. వేచి చూసే దోరణినే అవలంభించింది. కానీ ఇక ఉద్యమాలు తీవ్రతరం చేస్తామనే సంకేతిమిచ్చింది ఈ వేదికగా. రాష్ట్రంలో బీఆరెస్, బీజేపీలు జనం వద్ద ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం తండ్లాడుతున్నాయి. బీఆరెస్ బలోపేతం కాకుండా, దాన్ని ఓవర్ టేక్ చేసి తామే కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయమని చూపేందుకు ఆందోళనలకు దిగుతుంది.
లేటుగా అయిన లేటెస్టుగా మేల్కొన్నది బీజేపీ. రైతు దీక్షతో రైతుకు దగ్గరకావడంతో పాటు ప్రజా ఉద్యమాల్లో బీఆరెస్ కన్నా మేమే ముందున్నామని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నది బీజేపీ.