రెండు పెన్షన్లు తీసుకుంటున్న లబ్దిదారులపై ప్రభుత్వం ప్రయోగించిన ‘పెన్షన్‌ రికవరీ’ బెడిసి కొట్టింది. దీనిపై సర్వత్రా విమర్శలు, వ్యతిరేకతా రావడంతో వెంటనే నష్టనివారణకు దిగింది సర్కార్‌. దీనిపై త్వరలో మార్గదర్శకాలు రూపొందిస్తున్నామని, అప్పటి వరకు నోటీసులు ఇవ్వడం గానీ, మొత్తాన్ని రికవరీ చేసే చర్యలకు ఉపక్రమించవద్దని కలెక్టర్లను ఆదేశించింది సర్కార్‌. ఈ మేరకు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.

దీనిపై వాస్తవం ప్రత్యేక కథనం ప్రచురించింది. ఈ చర్యతో ప్రభుత్వం సెల్ఫ్‌గోల్‌ చేసుకుంటున్నదని వివరించింది. పండుటాకులపై ప్రతాపం ఏలా అని నిలదీసింది. నయాపైసా కూడా రికవరీ కాదని, ఇంతలా రచ్చ చేసుకోవడం అవసరమా అని ప్రశ్నించింది. ఉన్న పెన్షన్లే రెండు నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయి.. నాలుగు వేల రూపాయల పెన్షన్‌ కోసం ఎదురుచూస్తున్నారని కూడా రాసింది. ఎట్టకేలకు ప్రభుత్వం వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగింది.

సర్కార్‌ ‘పెన్షన్‌ రికవరీ’ సెల్ఫ్‌గోల్‌..! ఏడు వేల మంది నుంచి పెన్షన్‌ రికవరీకి ఆదేశాలు.. !! జిల్లాల వారీగా డీఆర్‌డీవోలకు ఉత్తర్వులు జారీ.. నెల రోజుల గడువు.. సర్వీస్‌ పెన్షన్‌తో పాటు ఆసరా తీసుకుంటే రికవరీ చేయాలని ఆదేశాలు.. ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌లో ఎంక్వైరీలు.. పెన్షన్ తొలగిస్తే సరిపోయేది.. రికవరీ పేరుతో రాజకీయంగా కాంగ్రెస్‌ సర్కార్‌కు కొత్త తలనొప్పులు.. రెండు నెలలుగా ఆసరా పెన్షన్ల నిలిపివేత.. నాలుగు వేల రూపాయల పెన్షన్‌ కోసం ఎదురుచూపులు..!! రివకరీ నోటీసులతో సర్కారుకు దక్కేది జనాగ్రహమే..

You missed