Month: November 2023

షబ్బీర్‌ ఎంట్రీ… ‘అర్బన్‌’ సెట్‌రైట్‌..! నేడు నిజామాబాద్‌కు షబ్బీర్‌ రాక.. భారీ ర్యాలీ… అసంతృప్త, గ్రూపు నేతలంతా ఒక్కతాటిపైకి… అర్బన్‌లో అర్బన్‌ కాంగ్రెస్‌ సీన్‌..!!

మొన్నటి దాకా కత్తులు దూసుకన్న నేతలంతా ఒక్కటయ్యారు. నీదో గ్రూపు నాదో గ్రూపు అంటూ తన్నుకునేందుకు కూడా వెనకాడని నేతలంతా మనం మనం దోస్తులమని కలిసిపోయారు. కారణమేమంటారా..? నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గం నుంచి షబ్బీర్ అలీ పోటీ చేయడమే. నీకా టికెట్‌…

‘లోయపల్లి’పై రామన్న సీరియస్‌…. చక్కదిద్దిన పార్టీని నర్సింగ్‌ రావు చెడగొట్టాడంటూ పిర్యాదులు.. ఆరని మాచారెడ్డి చిచ్చు… రెడ్లు గరం గరం.. కాంగ్రెస్‌కు రెడ్ల ఓట్లు డైవర్ట్‌ అవుతాయనే భయంలో బీఆరెస్‌…

అస్తవ్యస్తంగా ఉన్న కామారెడ్డి బీఆరెస్‌ను చమటోడ్చి, శ్రమకోర్చి చక్కదిద్దుతున్న రామన్నకు లోయపల్లి నర్సింగరావు రూపంలో మరో తలనొప్పి వచ్చి పడింది. అంతా సజావుగా సాగుతుందనుకుంటున్న తరుణంలో రెడ్ల ఆగ్రహానికి పార్టీని బలి చేసే విధంగా మారిన మాచారెడ్డి ఎంపీపీ చర్యలు అధిష్టానానికి…

అమ్మలక్కలతో అది ఓ ‘ముచ్చట’ … అంతరంగాన్ని ఆవిష్కరించి ఆకట్టుకునే ప్రసంగం.. (‘వాస్తవ’ విశ్లేషణ)

ఆయన ప్రసంగం జనంతో ఓ ముచ్చట పెట్టినట్టుగా ఉంటది. ఎర్రటి ఎండలో కూడా గంటల తరబడి ఆ పెట్టే ముచ్చట ఎండతీవ్రతను కూడా తగ్గించేలా ఉంటది. మామూలుగా ఎవరైనా లీడర్‌ ఊర్లకు వచ్చిండంటే మూతి తిప్పుకుంటారు జనం. అదీ ఎన్నికల వేళ..…

ఉత్కంఠకు తెర… అర్బన్‌ నుంచి షబ్బీర్‌.. కామారెడ్డి నుంచి రేవంత్‌ బీ ఫారాలు రిలీజ్‌ చేసిన అధిష్టానం… 6న రేవంత్‌, 9న షబ్బీర్‌లు నామినేషన్‌…

ఎట్టకేలకు ఉత్కంఠకు తెర వీడింది. పెండింగ్‌ లిస్టును కాంగ్రెస్‌ అధిష్టానం ప్రకటించడం లేదు. డైరెక్టుగా బీ ఫారాలిచ్చేసింది. వారికి నామినేషన్లు వేసుకోవాల్సిందిగా కూడా ఫోన్లు చేసి చెప్పేసింది. దీంతో అంతా రెడీ అయిపోయారు. నిజామాబాద్‌ అర్బన్‌ నుంచి షబ్బీర్‌ అలీ, కామారెడ్డి…

కామారెడ్డిలో అసలేం జరుగుతోంది…? కామారెడ్డి రాజకీయాలపై కేసీఆర్‌ ఆరా… రెడ్డి వర్సెస్‌ వెలమ రాజకీయాలకు తెరలేపిన ఉదంతంపై సీరియస్‌.. రెడ్ల ఆత్మీయ సమ్మేళనం రద్దు చేసిన రెడ్డి సంఘం…నర్సింగరావును ఎందుకు సస్పెండ్‌ చేయరంటూ ప్రెస్‌మీట్‌… రామన్నకు తలనొప్పిగా మారిన కామారెడ్డి నేతల వ్యవహారం.. రోజు రోజుకు పెరుగుతున్న ఆధిపత్య పోరు..

కామారెడ్డిలో అధికార పార్టీ నేతల వ్యవహారం సీఎం కేసీఆర్‌కు, కేటీఆర్‌కు తలనొప్పులే కాదు తలవంపులు కూడా తెచ్చిపెడుతున్నాయి. మంత్రి కేటీఆర్‌ అంతా తానై ఇక్కడి పరిస్థితిని చక్కదిద్దే పనిలో ఉండగా… నేతలు దీన్ని చెల్లాచెదురు చేస్తూ పార్టీని మరింత భ్రష్టు పట్టించే…