ఇదెప్పుడూ ఉండేది. ప్రతీసారి ఎన్నికల సమయం రాగానే బీసీలకు ఎన్ని టికెట్లు.. మా సీట్లెన్ని అని ప్రశ్నలు అనే మామూలుగా సంధిస్తూనే ఉంటారు. నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గంలోనైతే ఇదీ మరీ ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ బీసీల శాతం ఎక్కువ. అందులోనూ మున్నూరుకాపుల బలం చాలా ఎక్కువగా ఉంది. ఈ సామాజికవర్గంలో ఇప్పుడు ఎలాంటి ప్రచారం జరుగుతుందంటే.. ఈసారి ఏ పార్టీ మున్నూరుకాపుకు టికెట్‌ ఇచ్చినా.. వారిని పార్టీలకతీతంగా గెలిపించుకుందామనే వరకు వరకు. గత ఎన్నికల్లోనూ బీసీ నినాదం వచ్చింది. కానీ అంతకు మించి ఇప్పుడు ఈ నినాదం మరింత బలపడింది. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ అర్బన్‌ బీసీకే ఇస్తామని ప్రకటించేసింది.

మరో నియోజకవర్గం కూడా బీసీకే ఇస్తామని కూడా చెప్పుకుంటుంది. ఇప్పుడు అధికార, బీజేపీల్లోనూ కూడా అంతర్గతంగా ఈ బీసీ పోరు నడుస్తోంది. బీఆరెస్‌ నుంచి సిట్టింగ్‌కే టికెట్‌ ఇస్తామని ప్రకటించినా… అంతర్గతంగా బీసీలకు ఇవ్వాలనే పోరు నడుస్తున్నట్టు తెలుస్తోంది. కానీ సిట్టింగులకు మార్చితే పరిస్థితి ఎలా ఉంటుంది..? అనే అంశంపైనా అధిష్టానం సమాలోచనలు చేస్తున్నది. బీజేపీ నుంచి ధన్‌పాల్‌ సూర్యనారాయణకు దాదాపు టికెట్‌ కన్ఫాం అనే రీతిలో ప్రచారం చేసకుంటున్నాడాయన.

కానీ మున్నూరుకాపు నుంచి ఒకరి టికెట్‌ ఇస్తే బాగుంటుందనే అభిప్రాయమూ పార్టీలో అంతర్గతంగా నడుస్తోంది. యెండల లక్ష్మీనారాయణ పేరు ఇక్కడ ప్రస్తావించినా… అర్వింద్‌ దీన్ని వ్యతిరేకించే అవకాశమే ఉంది. ఒక దశలో అర్వింద్‌ సతీమణినే అర్బన్‌ నుంచి పోటీకి దింపుతారనే ప్రచారమూ చేశారు. దీంతో ఎన్నికల సమయం నాటికి ఎవరికి టికెట్‌ దక్కుతుందో తేలని సందిగ్ధ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికైతే ఎవకి వారే తమకే టికెట్ అని అనుకుంటున్నా.. చివరి నిమిషంలో నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గంలో టికెట్‌ సమీకరణలో ఏదైనా మార్పు జరగవచ్చనే అభిప్రాయాలూ బలంగా వినిపిస్తున్నాయి. అర్బన్‌ ఇప్పుడు బీసీ నినాదంతో హోరెత్తుతున్నది. అన్ని పార్టీల్లో ఇది అంతర్గత చర్చగానే కాదు కలవరపెట్టే అంశంగా కూడా తయారయ్యింది.

You missed