ఇందూరు వేదికగా మంత్రి కేటీఆర్ బీజేపీ, కాంగ్రెస్ నాయకత్వంతో చెడుగుడు ఆడుకున్నాడు. మొదట లోకల్‌ ఎంపీ అర్వింద్‌ను టార్గెట్ చేశాడు. అసలు ఎంపీకి చదువే రాదన్న కేటీఆర్. అతనో కుసంస్కారి అంటూ ఎంపీ వ్యక్తిత్వాన్ని డస్ట్డబిన్‌లో పడేశాడు. ఆ తర్వాత మోడీ మీద పడ్డాడు. మోడీ జన్ దన్‌ ఖాతా తెరవమన్నాడు. పదిహేను లక్షలు ఖాతాలో వేస్తామని మోసం చేశాడని విమర్శించారు. మతం చిచ్చు రేపి వీరంతా చలిమంటలు కాచుకుంటారన ఘాటగా స్పందించారు.

ఇక రేవంత్‌రెడ్డిపైనైతే మరీ చీప్‌ చేసేశాడు. అతనో థర్డ్‌ క్లాస్‌ క్రిమినల్ అని సంబోధించాడు. ఇలాంటి వ్యక్తితో మనం తలపడాల్సి వస్తోంది అంటూ ఎద్దేవా చేశాడు. అంతో ఇంతో కాంగ్రెస్‌ గాలి వీస్తోన్న నేపథ్యంలో రేవంత్‌కు పీసీసీ చీఫ్‌ ఇవ్వడం ఆ పార్టీ ఎంతటి దౌర్బాగ్య స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చని ప్రజలకు విడమర్చి చెప్పాడు. కేసీఆర్‌ సంచలన నాయకుడైతే… రేవంత్‌ సంచులు మోసే నాయకుడంటూ తనదైన శైలిలో ప్రాసలతో ప్రజలను ఆకట్టుకున్నాడు. మూడు గంటల కరెంటు చాలని తమ మనసులోని మాట బయటపెట్టాడని తూర్పారబట్టాడు కేటీఆర్‌.

మూడు గంటల కరెంటు కావాల్నా..? మూడు పంటల కేసీఆర్‌ కావాల్నా..? మతం మంటల బీజేపీ కావాల్నా..? అని ప్రజలనుద్దేశించి కేసీఆర్‌కు మద్దతు తెలపాలని కోరాడు. గుడుల మీద, మసీదుల మీద దాడులు చేసుకుంటూ మతం చిచ్చురేపి చలిమంటలు కాచుకునే బీజేపీ కావాల్నా..? కుంభకోణాల కాంగ్రెస్‌ కావాల్నా…? అంటూ రెండు పార్టీల వైఖరిపై దుమ్మెత్తిపోశాడు కేటీఆర్‌..

You missed