ఎన్నో ఏండ్ల నిరీక్షణ.. ప్రాణాలకొడ్డి తెలంగాణ ఉద్యమంలో పోరాటం.. ఎందుకు..? తమ భవిష్యత్తు బాగుటుందని. ఎన్నో త్యాగాల తర్వాత సీఎం కేసీఆర్‌ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం. ఎంతో సంబురాలు చేసుకున్నారు. తమ బతుకుల బాగుపడ్డాయని పండుగ చేసుకున్నారు. 43వేల కుటుంబాల్లో వెలుగు నిండాయని ఎంతో సంతోషపడ్డారు. ఆ ఆనంద క్షణాలు.. కొన్ని రోజులే అన్నట్టు గవర్నర్‌ కీలకమైన ఈ బిల్లుకు మోకాలడ్డేశారు. దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించలేదన్న చందంగా.. కేసీఆర్‌ ఆర్టీసీ కార్మికుల బాగు కోసం తీసుకున్న నిర్ణయాన్ని రాజకీయ కోణంలో చూశారు గవర్నర్‌ తమిళి సై.

ఇది రానున్న ఎన్నికల్లో బీఆరెస్‌కు లబ్ది చేకూరుస్తుందని భావించారు. దీంతో సహజకంగానే ఆమె దీనిపైనా పీటముడి వేశాడు. టూర్‌లో ఉన్నాననే సాకు చూపారు. మరోసారి ఆ బిల్లు మా దగ్గరకే రాలేదని బుకాయించారు. చివరాఖరుకు వచ్చింది కానీ .. దీన్ని పరిశీలించాలి.. అధ్యయనం చేయాలి అంటూ కాలయాపనతో అసలుకే ఎసరు పెట్టే కుట్రకు ఒడిగట్టారు గవర్నర్. ఈ కుట్రను గమనించిన ఆర్టీసీ కార్మికులు గవర్నర్‌పై కన్నెర్రచేశారు. తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

శనివారం అన్ని జిల్లాల్లోని డిపోల వద్ద నల్లబ్యాడ్జీలు ధరించిద గవర్నర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయాలని, నిరసన చేపట్టాలని నిర్ణయించారు. ఈమేరకు ఆర్టీసీ ప్రధాన కార్యదర్శి టీఎంయూ లీడర్‌ థామస్‌ రెడ్డి ఆర్టీసీ కార్మికులకు పిలుపునిచ్చారు. గరవ్నర్‌ను తన పద్దతి మార్చుకుని వెంటనే బిల్లుకు ఆమోదం తెలపాల్సిందిగా డిమాండ్‌ చేశారు.

ఏపీలో ఇరత రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ జరిగినప్పుడు లేని నష్టం, బాధ తెలంగాణలో ఎందుకు జరుగుతుందని, అష్టకష్టాలు పడి, ప్రాణాలు త్యాగం చేసి ఆర్టీసీ కార్మిక కుటుంబాలు బాగుపడాలని గవర్నర్‌కు లేదా అని ఆయన మండిపడ్డారు. శనివారంతో అసెంబ్లీ సెషన్‌ ముగియనుండటంతో కచ్చింతంగా ఆలోపు దీనిపై ఆమోద ముద్ర వేయాలని, ఆమె అందుబాటులో లేకున్నా.. ఇక్కడున్న సిబ్బందితో ఈ బిల్లుపై ఆమోద ముద్ర వేయవచ్చని, ఇలాంటివి గతంలో జరిగాయని గుర్తు చేస్తున్నారు. కావాలని కుట్ర పూరితంగా తమ పొట్టకొట్టి నడిబజారులో తమ బతుకులను వేయాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. మరోవైపు సీఎం కేసీఆర్‌ను కూడా దీనిపై ఆర్డినెన్స్‌ జారీ చేయాల్సిందిగా కోరారు.

You missed