నేనున్నాను…

ప్రజలకు అండగా ఎమ్మెల్సీ కవిత…

విస్తారంగా వర్షాలు.. మెగాజాబ్‌ మేళా..

అవసరం ఏదైనా.. సాయం చేసేందుకు రెడీ…

తన కార్యాలయం ఫోన్‌ నెంబర్‌ను ప్రజలకు విడుదల చేసిన కవిత

08462-250666 నెంబర్‌తో నిరంతరం ప్రజలకు ఇక అందుబాటులో….

 

అవసరమొచ్చిన ప్రతీ సందర్బంలో ఆమె నేనున్నానంటూ ముందుకొస్తారు. ఆపదేమొచ్చినా భరోసాగా నిలుస్తారు. అడగందే అమ్మైనా అన్నం పెట్టదు.. కానీ ఎమ్మెల్సీ కవిత మాత్రం ప్రజావసరాలు గుర్తెరిగి సకాలంలో స్పందిస్తారు. తాజాగా ఆమె తన కార్యాలయం నెంబర్‌ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. నిరంతరం ఆ నెంబర్‌తో తను ప్రజలకు అందుబాటులో ఉండనున్నానని, అవసరం, ఆపద ఏమొచ్చినా తానున్నానంటూ ఆమె మరోసారి గుర్తు చేశారు. 08462-250666 ఇది తన నిజామాబాద్‌ కార్యాలయ నెంబర్‌. శుక్రవారం ఐటీహబ్‌లో ఉద్యోగాల కల్పన కోసం మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

ఈ ఉద్యోగాల్లో హాజరయ్యేందుకు వచ్చే ఉద్యోగార్థుల్లో ఎన్నో అనుమానాలు. భారీ అంచనాలు. ఎవరి అడగాలో తెలియదు. అర్హత ఏమిటీ…? తాము ఇంటర్వ్యూలకు వెళ్లొచ్చా..?? ఎవరిని అడగాలి..?? లాంటి అనేక సందేహాలు నెలకొని ఉన్నాయి. వీటిని నివృత్తి చేయడంతో పాటు .. విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు. దీనికి తోడు తన కార్యాలయం నెంబర్‌ను కూడా ఆమె విడుదల చేసి తను నిరంతరం ఈ నెంబర్‌ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటానని ప్రకటించారు. స్థానికంగా ఆమె అందుబాటులో లేకున్నా.. ఈనెంబర్‌ ద్వారా ఆమెను ఇక నిరంతరం ప్రజలు ఏ అవసరమొచ్చినా సంప్రదించవచ్చనే సంకేతాలిచ్చారామె.

చాలా కాలంగా ఆమె ప్రజలకు దూరంగా ఉన్నారు. ఈ మధ్య పొలిటికల్‌గా యాక్టివ్‌ అయిన విషయం తెలిసిందే. జిల్లాలో మళ్లీ అన్ని నియోజవకర్గాలు గెలిపించుకుని క్లీన్‌ స్వీప్‌ చేయాలన్నది ఆమె సంకల్పంగా ఉంది. దీని కోసం ఆమె పార్టీని చక్కదిద్దే పనిని భుజానికెత్తుకున్నారు. స్థానికంగా ఎమ్మెల్యేలపై వచ్చిన అసంతృప్తి, వ్యక్తిరేకతను ఆమె గుర్తించారు. ఆమె ప్రమేయం, ప్రభావం ఉంటే మళ్లీ పార్టీకి పూర్వవైభవం తీసుకురావచ్చనే అభిప్రాయం సర్వత్రా ఉంది. ఈ క్రమంలోనే ఆమె ఆత్మీయ సమ్మేళనాలనకు హాజరయ్యారు. వేదికలపైనే లోకల్ లీడర్లకు చురకలంటించారు. జాగ్రత్త పడకపోతే కష్టం అనే సంకేతాలిచ్చారు. గురువారం నుంచి ఆమె జిల్లా కేంద్రంలో అందుబాటులో ఉండనున్నారు. శుక్రవారం బోర్గాంలోని భూమారెడ్డి కన్వెన్షన్‌ హాల్‌లో జరిగే ఐటీ ఉద్యోగాల ఇంటర్వ్యూల పర్యవేక్షణతో పాటు వర్షాల పరిస్థితులు, ప్రజల అవసరాలకు ఆమె స్థానికంగా ఉండి స్పందించనున్నారు. ఈ క్రమంలో జిల్లా రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి.

 

 

You missed