అర్వింద్‌ది అదే అజ్ఞాన ప్రదర్శన… పసుపుబోర్డు తేలేని అసమర్థతను ప్రభుత్వంపైకి నెట్టి… నిలువ చేసుకునే గోదాములులేకే గిట్టుబాటు ధర రాలేదన్న అర్వింద్‌.. మొన్నటి వరకు ఆరు వేలకు అమ్ముకున్నారని ఒప్పుకున్న ఎంపీ… రీజనల్ ఆఫీసు ఏర్పాటు చేసి ఏం చేశాడో..? పసుపు రైతులను మరోసారి మోసం చేసేలా మాటలు… ఎస్సారెస్పీ రివర్స్‌ పంపింగ్‌పైనా అవే అవగాహన రాహిత్య సొల్లు మాటలు… ఇంకా తుకాలే వేసుకోలేదు.. నాట్లు వేసుకుని ఎండిపోతున్నాయని కామెంట్‌.. రివర్స్‌ పంపింగ్ వల్ల ఉపయోగం లేదంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు… కడ్తా పేరుతో స్కాం చేస్తుందని‌.. రైస్‌మిల్లర్ల దోపిడీని పరోక్షంగా ఒప్పుకున్న అర్వింద్‌… ఈథనిల్‌ ఫ్యాక్టరీలు పెట్టొచ్చు కదా అని నిలదీసిన అర్వింద్‌… తను గతంలో ఏర్పాటు చేస్తానని ఇచ్చిన హామీ మరిచిన వైనం…

అర్వింద్‌ది అదే అజ్ఞాన ప్రదర్శన…

పసుపుబోర్డు తేలేని అసమర్థతను ప్రభుత్వంపైకి నెట్టి…

నిలువ చేసుకునే గోదాములులేకే గిట్టుబాటు ధర రాలేదన్న అర్వింద్‌.. మొన్నటి వరకు ఆరు వేలకు అమ్ముకున్నారని ఒప్పుకున్న ఎంపీ…

రీజనల్ ఆఫీసు ఏర్పాటు చేసి ఏం చేశాడో..? పసుపు రైతులను మరోసారి మోసం చేసేలా మాటలు…

ఎస్సారెస్పీ రివర్స్‌ పంపింగ్‌పైనా అవే అవగాహన రాహిత్య సొల్లు మాటలు…

ఇంకా తుకాలే వేసుకోలేదు.. నాట్లు వేసుకుని ఎండిపోతున్నాయని కామెంట్‌.. రివర్స్‌ పంపింగ్ వల్ల ఉపయోగం లేదంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు…

కడ్తా పేరుతో స్కాం చేస్తుందని‌.. రైస్‌మిల్లర్ల దోపిడీని పరోక్షంగా ఒప్పుకున్న అర్వింద్‌… ఈథనిల్‌ ఫ్యాక్టరీలు పెట్టొచ్చు కదా అని నిలదీసిన అర్వింద్‌… తను గతంలో ఏర్పాటు చేస్తానని ఇచ్చిన హామీ మరిచిన వైనం…

 

నిజామాబాద్‌ ప్రతినిధి- వాస్తవం :

అంకాపూర్‌లో అదో మీటింగు. అక్కడ అర్వింద్‌ ముఖ్య అతిథి. ఎర్రటి ఎండలో ఏం మాట్లాడాలో తెలియక చాలా తికమకపడ్డాడు ఎంపీ అర్వింద్‌. పొంతన లేని స్పీచ్‌తో కొంత అయోమయపడ్డాడు. కొన్ని విషయాలను లేవనెత్తి ప్రభుత్వాన్ని సెల్ఫ్‌ డెఫెన్స్‌లో పడేద్దామనుకొని..తనకు తానే ఆత్మ సంరక్షణలో పడిపోయాడు. ఒక వేలు ప్రభుత్వాన్ని చూపుతూ విమర్శించే యత్నం చేసిన అర్వింద్‌కు మిగిలిన వేళ్లన్నీ తనలోని లోపాలనే ఎత్తి చూపాయనేది గ్రహించలేదకపోయాడు. కానీ విన్నవారికి మాత్రం బాగా అర్థమయ్యింది. అదే అజ్ఞాన ప్రదర్శన… అవగాహన లేమి. ఇంకా ప్రసంగంలో పసలేదని గ్రహించి కవిత లిక్కర్‌ కేసు తెరపైకి తెచ్చి ఆలస్యమైనా కేసు జఠిలమవుతున్నదంటూ బీజేపీ శ్రేణులను ఉత్సాహపరిచే ప్రయత్నం చేసి ముగించేశాడు.

అజ్జాన ప్రదర్శన-1

అర్వింద్ మాట్లాడిన మాటల్లో పసుపు పంట గిట్టుబాటు ధర వచ్చింది. ఆశ్చర్యం. ఆయన నోట ఆమాట రావడం.. ఎందుకంటే మొన్నటి వరకు ఆరువేల క్వింటాళుకు రైతు తీవ్ర నష్టానికి పసుపును అమ్మేసుకున్నాడు. కానీ మొన్న మొన్న 8వేలకు క్వింటాలుకు అమ్ముకున్నాడు. కారణం మంచిరేటు వచ్చే వరకు దాన్ని నిలువ ఉంచుకున్నందుకని చెప్పుకొచ్చాడు. సరైన కోల్డ్‌ స్టోరేజీలు ఏర్పాటు చేస్తే ఇంకా మంచి రేటు వచ్చేది కదా అని ఓ వక్రభాష్యం చెప్పాడు. అంబాసిడర్‌ కన్నా గొప్పదైన టయోటా కారులాంటి స్కీం తెచ్చానని స్పైస్‌ పార్క్‌ తీసుకొచ్చానని, ఓ రీజనల్ కార్యాలయం ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్న అర్వింద్‌.. మరి రైతులు ఆరువేలకే క్వింటాలు అమ్ముకోవాల్సిన దుస్తితి ఎందుకొచ్చింది.. అంటే నున్వు ఎంపీగా అయిన తర్వాత పెద్ద మార్పేమీ లేదా..? ఏం చేయలేకపోయావా..? పసుపు బోర్డు వల్ల ఉపయోగమేం లేదన్నావు.. సరే.. మరి పసుపు రైతులు నస్టానికి ఎందుకు అమ్ముకోవాల్సి వచ్చింది. మరోసారి పసుపు రైతులను మోసం చేసేందుకు నెపాన్ని ప్రభుత్వం మీద నెట్టాడన్నమాట. ఆర్మూర్‌, బాల్కొండ, నిజామాబాద్‌ రూరల్‌, జగిత్యాల,మెట్‌పల్లి, కోరుట్ల తదితర ప్రాంతాల్లో మొత్తం 40 వేల ఎకరాల వరకు పసుపు పంట సాగయ్యేది. ఇప్పుడు గణనీయంగా దీని విస్తీర్ణం తగ్గుతూ వస్తోంది. కారణం ఏమిటి..? ఎకరాకు 70 వేల ఖర్చు వస్తుంది రైతుకు పెట్టుబడి కోసం.. 20 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. కనీసం పదివేలకు మించి క్వింటాలుకు ధర వస్తేనే నష్టం రానట్టు. పదిహేను వేలు వస్తే శ్రమకు తగిన ఫలితం లభించినట్టు. మరి మన ఎంపీ 8వేలు వచ్చింది అంటే పెద్ద లాభంగా చూస్తున్నాడు. ఇదీ ఆయనకున్న అవగాహన.

అవగాహన రాహిత్య ప్రదర్శన-2

వెయ్యి కోట్లు పెట్టి రివర్స్‌ పంపింగ్‌తో ఎస్సారెస్సీ నింపుతామన్నారు. ఏదీ..? అని నిలదీశాడు ఎంపీ. ఇంకా వానాకాలం సీజన్‌ చాలు కాలేదు. తుకాలూ వేసుకోలేదు. కానీ ఎంపీ మాత్రం నాట్లే వేసేశారు. అవి ఎండిపోతున్నాయన్నారు. అవసరైమన సమయానికి రివర్స్‌ పంపింగ్‌తో నీటి విడుదల చేసేందుకు అక్కడ అంతా సిద్దంగా ఉంది. అర్వింద్‌ చెప్పినట్టు నాట్లు ఎండిపోయే దశే ఉంటే రైతులు రోడ్డెక్కి ఆందోళన చేయకపోతుండెనా..? కాళేశ్వరం ప్రాజెక్టే ఓ ఫేక్‌ అనే రీతిలో మాట్లాడి.. తన అవగాహన రాహిత్యాన్ని మరోమారు చాటుకున్నాడు అర్వింద్‌.

అజ్జానంతో ఆగమాగం-3

తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేసే విషయంలో కడ్తా పేరుదో ఐదు కిలోల చొప్పున రైతు నుంచి దోచుకుంటున్నది ప్రభుత్వం అని ఆరోపించాడు ఎంపీ. రైతు బంధు పేరుతో ఏడాదికి పదివేలిస్తూ.. కడ్తా పేరుతో పన్నెండు వేలు గుంజుకుంటున్నాడంటూ వేక్‌గా ఏదో అలా గాలికి మాటలనేశాడు. కానీ కడ్తా పేరుతో రైతులను దోచుకుంటుంది రైస్‌ మిల్లర్లు. ఆ వేదికపై రైస్‌మిల్లర్ల నాయకుడు మోహన్‌ రెడ్డే ఉన్నాడు. అతనే ఓ పెద్ద తిమింగళం. రైస్‌ మిల్లర్లకు ప్రతినిధి. అతని సాక్షిగానే ప్రభుత్వం మీద నెపం నెట్టేశాడు. ఇక ఇథానీల్ ఫ్యాక్టరీలు పెట్టొచ్చు కదా.. ఈ తడిచిన, రంగు మారిన ధాన్యం పనికి వస్తుంది పెట్రోల్‌ ఉత్పత్తికి అన్నాడు. తనే ఓ సారి ఎంపీగా గెలిస్తే ఇథనీల్‌ ఫ్యాక్టరీ పెడతాననే హామీ ఇచ్చాడు. మరెందుకు పెట్టలేదో..?

You missed