చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి అయిన తరువాత తెలంగాణతో పోటీ పడలేక వెల్లకిలా పడిపోయిన విషయం గుర్తుందా? అందరికీ మరిచిపోలేని జ్ఞాపకం అది. చంద్రబాబు వెల్లకిలా పడ్డప్పుడల్లా అతడిని వెనకేసుకు రావడానికి ఆర్‌కే పడిన తంటాలు కూడా చాలా మందికి గుర్తుండి ఉంటాయి. ఏపీలో ఎక్కడో ఒక దవాఖానలో శిశువును ఎలుకలు కొరికాయి. ఇదే జగన్‌ అయితే ఆర్‌కే ఎన్ని కన్నీళ్లు కార్చేవాడో. కానీ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నది చంద్రబాబు. అందువల్ల ఆర్‌కే కథనం మారింది. శిశువును ఎలుకలు కొరికాయనే విషయం ప్రస్తావిస్తూ- రెండు తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఇలా ఉంది అంటూ వ్యాఖ్యానించాడు. అంటే చంద్రబాబు పాపంలో కేసీఆర్‌ను కలిపేశాడు. ఏం తెలివిరా బాబులూ!! చంద్రబాబు పుష్కరాలలో షూటింగ్‌ పెట్టుకొని పలువురి ప్రాణాలను బలి తీసుకున్నాడు. దీంతో దీనికి కారణం స్వామీజీ అంటూ పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. బాబు అసమర్థత, అవినీతి కప్పిపుచ్చుకోవడానికి పడే తంటాలు ఇవి. ఒకసారి పెండ తట్ట నెత్తిపై పెట్టుకున్న తరువాత మొహంపై నుంచి ఒళ్లంతా పెండ కారుతూనే ఉంటుంది. చంద్రబాబును నెత్తిన పెట్టుకున్న తురువాత ఆర్‌కే దీ అదే పరిస్థితి. ఇప్పుడు అదే బూజు పట్టిన ఎత్తుగడతో మరో కొత్త పలుకు వినిపించాడు.

వాస్తవ పరిస్థితి ఏమిటి? దానికి ఆర్‌కే కథనం ఏమిటో చూద్దాం.
చంద్రబాబును కుక్కలు కూడా దేకడం లేదు. కేంద్రం దగ్గరికి వెళ్లి కడుపులో తలకాయ పెట్టి బావురుమంటున్నాడు. ఢిల్లీ పెద్దలు అయినా సంతృప్తి పడటం లేదు. కడుపులో కాదు, ఇంకా కిందకు తలకాయ పెట్టినా (కాళ్ల మీద పడినా) ఖాతరు చేసే స్థితిలో లేరు. కొన్ని పైకి చెప్పేటివి ఉంటాయి. కొన్ని చెప్పనివి ఉంటాయి. అనేక షరతులు పెడుతున్నారు. చంద్రబాబు పరిస్థితి చాలా దీనంగా ఉన్నది. అడ్డమైన అబద్దాలును తనకు విశ్వసీయ వర్గాల ద్వారా తెలిసిందని కథలుగా అల్లి చెప్పే ఆర్‌కే కు ఢిల్లీలో చంద్రబాబుకు జరుగుతున్న అవమానం కనిపించడం లేదా!! కనిపిస్తున్నది. కానీ అది జనానికి కనిపించకుండా కనికట్టు ఎలా చేయాలనేది ఆరాటం!

అందుకే చంద్రబాబుతో పాటు ఇతరులను కూడా కలిపి అంతా గంతే అంటూ ముక్తాయింపు ఇవ్వాలనుకున్నాడు. “ఈ ముగ్గురు నాయకులు” (కేసీఆర్‌, జగన్‌, చంద్రబాబు) కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఎదిరించలేని స్థితిలో ఉన్నారట, నైతికంగా బలహీనపడటం వల్లనే కేంద్రానికి దాసోహం అనాల్సిన పరిస్థితి ఏర్పడిందట. – ఇదీ ఆర్‌కే విశ్లేషణ.
వాస్తవానికి ఈ దీన స్థితిలో ఉన్నది చంద్రబాబు ఒక్కరే. ఒక్కడ కేసీఆర్‌, అక్కడ జగన్‌ భారీ మెజారిటీ పొంది బలంగా నాటుకు పోయి ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో “మేం ఆర్ఎస్‌ఎస్‌ మొదలుకొని ఆర్‌ఎస్‌యూ వరకు అందరి మద్దతు తీసుకుంటాం” అని జయశంకర్‌ సార్‌ అన్నారు. కేసీఆర్‌ కూడా తెలంగాణ కోసం గొంగడి పురుగునైనా ముద్దు పెట్టుకుంటానని చెప్పాడు. ఇదంతా అందరికీ తెలిసిందే. అదే విధంగా అన్ని పార్టీల మద్దతు తీసుకొని తెలంగాణ సాధించిన మాట వాస్తవం. తెలంగాణ ఏర్పడిన తరువాత కేసీఆర్‌ కేంద్ర రాష్ట్రాల మధ్య రాజ్యాంగబద్దమైన సంబంధాలను జాగ్రత్తగా పాటించారు. రాజకీయ వైరుధ్యాలు వేరు. కానీ సుపరిపాలనపరమైన, రాజ్యాంగపరమైన వ్యవహారాలలోకి రాజకీయాలను లాగవద్దని అనేక సార్లు చెప్పారు. ఇప్పటికే కేసీఆర్‌ అభ్యంతరమల్లా మోదీ ఆ రాజ్యాంగబద్ద సంబంధాలను పాటించడం లేదనే. కేసీఆర్‌ కానీ, నవీన్‌ పట్నాయక్‌ కానీ, జగన్‌ కానీ తమ రాష్ట్రాలలో బలంగా ఉన్నారు. కేంద్రం దగ్గర చంద్రబాబు లాగా దేబిరించడం లేదు. కానీ చంద్రబాబు చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి బాబుతో పాటు బలంగా ఉన్న ఇతర నాయకులను కలిపేసి తన సహజ సిద్దమైన వంటకాన్ని వండి వార్చాడు.

“నిన్న మొన్నటి వరకు కేంద్రంపై కాలు దువ్విన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హఠాత్తుగా చల్లబడి పోయారు. ఆయన ఇప్పుడు రూటు మార్చి కాంగ్రెస్ పై దాడి చేస్తున్నారు”- ఇదీ ఆర్‌కే కు ఉన్న అభ్యంతరం. ఇందులో చల్లబడిపోయిందేమిటట!! కొంచెం రాజకీయ పరిజ్ఞానం ఉన్నవాడికి ఎవడికైనా తెలిసే విషయమిది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత తెలంగాణలో దృశ్యం మారిపోయింది. బీజేపీ డీలా పడిపోయింది. కాంగ్రెస్‌ శ్రేణులలో కొంత ఉత్సాహం నెలకొన్నది. బీజేపీలో చేరిన చాలా మంది నాయకులు ఇప్పుడు బయటపడే ఆలోచనలో ఉన్నారు. వారు కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారు. రేవంత్‌ శల్యసారథ్యం కొనసాగుతున్నప్పటికీ కాంగ్రెస్‌ పై ఆ పార్టీ కేంద్ర నాయకత్వం దృష్టి పెట్టింది. దీంతో బీఆరెస్‌ నాయకులు తమ దాడి కాంగ్రెస్ పైకి మళ్లించారు. ఎన్నికలు సమీపించే కొద్దీ ఏ పార్టీ నుంచి బలమైన పోటీ ఎదురయితే ఆ పార్టీని ఎదుర్కోవడంలో ఆశ్చర్యమేమున్నది? చంద్రబాబు బీజేపీ పెద్దల కాళ్ల మీద పడితే ఇక అందరూ పడినట్టే అని చెత్త పలుకులు పలుకడం ఎందుకు?

గత ఎన్నికల ముందు ప్రతిపక్షాలను ఏకం చేయడానికి వివిధ రాష్ట్రాలు పర్యటించిన మాట వాస్తవం. కానీ ఆ ప్రయత్నం ఆశించిన ఫలితాలు రాకపోతే సొంతంగా బీజేపీకి కాలు దువ్విన మాట కూడా నిజమే. సొంత పార్టీ పెట్టుకొని ఒక్కో రాష్ట్రంలో చేరికలు సాగిస్తున్నారు. మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్‌ వరకు బీఆరెస్‌ పాకుతూనే ఉన్నది. చంద్రబాబు బీజేపీకి దాసోహం అంటే కేసీఆర్‌ అన్నట్టు పచ్చకళ్లతో చూడటమేమిటి?
ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కవిత ఇరుక్కోవడం వల్లనే కేసీఆర్‌ యూ టర్న్‌ తీసుకున్నారనే మరో జోక్‌ పేల్చాడు ఆర్‌కే. అయ్యా! లిక్కర్‌ కుంభకోణం ఏనాటిది? కేసీఆర్‌ భయపడి యూ టర్న్‌ తీసుకోదలుచుకున్నట్టయితే ఆనాడే తీసుకోవాలి. కేసు మూసేయించుకోవాలి. కానీ ఇంత కాలం తరువాత భయపడతారా? అక్కడ స్కామంటూ ఏమీ జరగలేదని అంటున్నారు. సిసోడియా ఇంటిపై జరిగిన దాడిలో కూడా ఏ ఆధారాలు దొరకలేదు. వేధింపుల కోసమే ఈ బాగోతం నడుపుతున్నారనేది తెలిసిందే. కేసీఆర్‌ గట్టిగా మోదీని ఎదిరిస్తుండటం వల్లనే కవితపై కేసు పెట్టి వేధిస్తున్నారనేది తెలిసిందే. కానీ చంద్రబాబు దాసోహం అఈంటే ప్రపంచమంతా అన్నట్టే అనేది పచ్చగ్యాంగ్‌ విశ్లేషణ!!
కొన్ని ప్రతిపక్షాలు బీజేపీపై పోరాడటానికి కాంగ్రెస్‌ను కలుపుకోవాలని ప్రయత్నించినప్పుడు, కేసీఆర్‌ మొదట్లోనే వ్యతిరేకించారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పటి చరిత్ర అందరికీ తెలిసిందే. అందుకే ఈ రెండు జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా కూటమి ఏర్పడాలని పిలుపు ఇస్తున్నారు. ఇదంతా దేశమంతా గమనిస్తున్నది. ఇంతకాలం కాంగ్రెస్‌తో సఖ్యంగా ఉండి, ఇప్పుడే విమర్శిస్తున్నట్టు చెప్పడం విశ్లేషనా, చంద్రబాబు తరపు వకాల్తానా?
చంద్రబాబు బీజేపీతో పొత్తు కోసం దేబిరించడాన్ని వీలైనంత గౌరవంగా వర్ణించడం ఆర్‌కే బాపతు వ్యాఖ్యానం. ఆర్‌ఎస్‌ఎస్‌ ఒత్తిడి వల్ల ఈ సమావేశం జరిగిందట. ఇంకా నయం అమెరికా నుంచి బైడెన్‌, రష్యా నుంచి పుతిన్‌, చైనా నుంచి జిన్‌పింగ్‌ ఒత్తిడి తెచ్చి చంద్రబాబుతో సమావేశం జరిపించాలని రాయలేదు!!

చివరగా వ్యవస్థలు, విలువలు అంటూ ఆర్‌కే చాలా వాపోయారు. లోకేశ్‌ రాజకీయాలలోకి దిగినప్పుడు ఆంధ్ర జ్యోతి ప్రచురికంచిన వ్యాసం గుర్తుందా? దేశ రాజకీయాలలో వారసులు రావడం సాధారణం అనిపించేలా ఒక కథనం ప్రచురించారు. అంటే లోకేశ్‌ రావడం మామూలే అన్నమాట. చంద్రబాబు విలువలు కోల్పోతే వ్యవస్థలన్నీ కుదేలయినట్టు. ఆయనొక్కరే కాదు అంటూ సాధారణీకరించడం. రేవంత్‌రెడ్డితో ఆర్‌కే ఓపెన్‌ హార్ట్‌ తో మాట్లాడటం మరొక్కసారి చూడండి. నోట్ల కట్టలతో దొరికిపోవడం ఈ కాలంలో మామూలే అన్నట్టు తేల్చిపారేశారు.
అలాగే ఉంటుంది మరి.
ఇష్టమైన పియ్యి ఇంగుతో సమానం.

You missed