పుస్తక పఠనం చేసే వారెంత మంది ఈ రోజుల్లో. అదీ రాజకీయాల్లో బిజీబిజీగా ఉంటూ. తండ్రి నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్‌ అడుగు జాడల్లో నడుస్తూ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకుంటూ ముందుకు సాగుతున్న యువ నాయకుడు, ఒలంపిక్‌ సంఘం నిజామాబాద్‌ జిల్లా ఉపాధ్యక్షుడు, ధర్పల్లి జడ్పీటీసీ సభ్యుడైన జగన్‌ జీవితంలో మరోకోణం సాహిత్యలోకం. సాహిత్యపఠనం అంటే ఆయనకు చిన్నప్పట్నుంచే మక్కువ. అది ఉన్నతచదువులు పూర్తయిపోయినా… ఇప్పుడు రాజకీయాల్లో బిజీబిజీగా ఉంటున్న కొనసాగుతూనే ఉంది. నవలలు చదవడం, కొత్త ప్రదేశాలను సందర్శించడం, కొత్త విషయాలను తెలుసుకోవడం పట్ల ఎక్కువ మక్కువ చూపుతారు ఇప్పటికీ.

ఆయనకంటూ ఓ ప్రత్యేక లైబ్రరీ ఏర్పాటు చేసుకున్నాడు. మార్కెట్లో కొత్తగా ఏ పుస్తకం వచ్చినా దాన్ని చదవాలనే జిజ్ఞాస ఆయనకు ఇంకా వీడలేదు. అది ఇంగ్లీష్‌ నావెల్స్‌ అషనయినా, తెలుగు నవలలైనా.. చదివుతాడు. తన సన్నిహితులతో డిస్కషన్‌ చేస్తాడు. జగన్‌లోని ఈ మరో కోణం ఎవరికీ తెలియదు. చక్కటి చిత్రాలు గీయడం కూడా ఓ హాబీగా పెట్టుకున్నాడు. తాజాగా ఆయన డాక్టర్‌ కేశవరెడ్డి రాసిన తొమ్మిది నవలలను ఒకేసారి ఇష్టపడి మరీ తెప్పించుకున్నాడు. డాక్టర్‌ కేశవరెడ్డి అంటే తెలియని వారు లేరు. చిత్తూరులో జన్మించినా… ఇక్కడ డిచ్‌పల్లిలోని విక్టొరియా ఆస్పత్రిలో చాలా ఏండ్లు కుష్టు రోగులకు సేవలందించాడు.

డాక్టర్‌గా పేదలకు సేవలందిస్తూనే ఆయన మంచి రచయితగా పేరు సంపాదించాడు. ఆయన రాసిన అతను అడవిని జయించాడు అనే నవలను చదవిన జగన్‌… కేశవరెడ్డి రచనా శైలిని ఎంతగానో ఇష్టపడ్డాడు. అప్పట్నుంచి మార్కెట్లో ఆయన రాసిన ఏ నవల అందుబాటులో ఉన్నా చదివేవాడు.అయితే ఈ మధ్య కేశవరెడ్డి రాసిన తొమ్మిది నవలలు… అతను అడవిని జయించాడు, ,చివరి గుడిసె, మునెమ్మ, స్మశానం దున్నేరు, మూగవాని పిల్లనగ్రోవి, రాముడుండాడు రాజ్యముండాది, ఇంక్రెడిబుల్‌ గాడెస్‌, బానిసలు భగవానువాచ, సిటీ బ్యూటీఫుల్‌.. నవలలన్నీ ఒకే బుక్ హౌజ్‌ నుంచి సరఫరా చేస్తున్నారని తెలుసుకొని .. ఇష్టపడి, ముచ్చటపడి వాటన్నింటినీ తెప్పించుకుని .. ఈ నవలలన్నీ చదివే పనిలో ఉన్నారు.

అతని రచనా శైలి అంటే తనకు ప్రాణమని ఆయన అన్నారు. అతడు అడివిని జయించాడు .. నవలను హాలివుడ్‌లో కూడా సినిమా తీస్తున్నారు. మునెమ్మ నవలను సినిమాగా తెర కెక్కించేందుకు తనికెళ్ల భరణి చాలా ఏండ్ల కిందటే రైట్స్‌ తీసుకున్నాడు. అంతటి ప్రజాధారణ చూరగొన్న రచయిత కేశవరెడ్డి. కేశవ రెడ్డి నవలలే కాదు.. త్రిపురనేని గోపీచంద్‌ రాసిన అసమర్థుని జీవవయాత్ర… లాంటి ఎన్నో నవలలు తనకు ఎంతో ఇష్టమని, పుస్తక పఠనం ద్వారా ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోవచ్చని,అందుకే కొంత సమయం ఖాళీగా దొరికితే పుస్తకాలు చదవుతానని ఆయన అన్నారు.డాక్టర్‌ కేశవరెడ్డి రచనాశైలంటే తనకు ప్రాణమని తెలిపారు జగన్‌.

You missed