నిజామాబాద్‌ జిల్లా కోఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంకు (NDCCB)లో రైతుల పేరుతో కొంత మంది బడాబాబులు ఎడాపెడా తీసుకున్న రుకోట్లణాలు ఇప్పుడు ఆ బ్యాంకు ఉనికికే ప్రమాదకరంగా మారాయి. గత పాలకవర్గం చైర్మన్‌గా ఉన్న గంగాధర్‌రావు పట్వారి హయాంలో చాలా మంది రైతుల ముసుగులో కోట్లాది రూపాయల రుణాలు లేపారు. నిబంధఃనలకు పాతరేసి పట్వారి కూడా రుణాలకు ఆమోద ముద్ర వేశారు. దీంతో చాలా మంది అధికార పార్టీకి చెందిన లీడర్లు 20 లక్షల నుంచి 50 లక్షల వరకు రుణాలను లేపుకున్నారు. కానీ ఇంత వరకు రుపాయి చెల్లించలేదు. పాత పాలకవర్గం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో, నిబంధనలకు విరుద్దంగా ఇచ్చిన రుణాలతో బ్యాంకు దివాళ తీసే పరిస్థితి వచ్చింది.

ఇది కొత్త పాలకవర్గం మెడకు చుట్టుకున్నది. ఈ మధ్య ఆర్బీఐ దీన్ని టేకోవర్‌ చేసింది. పాత మొండి బకాయిలు 220 కోట్లు చెల్లించకపోతే లైసెన్సులు రద్దు చేస్తామని కూడా ప్రకటించడంతో కొత్త పాలకవర్గం ఇరకాటంలో పడింది. ఇప్పటికే వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ కింద టైమ్‌ ఇచ్చినా సరిగ్గా స్పందించలేదు. కొందరు సన్న చిన్నకారు రైతులు రుణాలు చెల్లించేందుకు ముందుకు వచ్చినా.. పెద్ద లీడర్లు, అధికార పార్టీని అడ్డం పెట్టుకుని చెల్లించకుండా నిర్లక్ష్యం చేయడంతో కొత్త పాలకవర్గానికి పాలుపోవడం లేదు. ఇవాళ జనరల్ బాడీ మీటింగు పెట్టుకన్నారు. మార్చి నెలాఖరు వరకు ఇచ్చిన గడువులోగా రుణాలు మొత్తం చెల్లించకపోతే ఆర్‌ ఆర్‌ యాక్ట్‌ ప్రయోగించడంతో పాటు కేసులు నమోదు చేస్తామని, ఆస్తులు జప్తు చేస్తామని కూడా తీర్మానం చేశారు. విషయం ఏమిటంటే ఈ రుణాల జాబితాలో జిల్లాకు చెందిన ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే కూడా ఉన్నాడు. దాదాపు 80 లక్షలు బాకీ తీసుకున్నాడు. ఇంత వరకు రూపాయి చెల్లించలేదు. ఇంకా ఇలాంటి అధికార పార్టీ పెద్ద నేతలు చాలానే ఉన్నారు. పట్వారీని బెదిరించో అదిరించో, బుజ్జగించో ఇష్టానుసారం రుణాలు లేపి ఇప్పుడు పత్తా లేకుండా పోయారు. కానీసం ఇట వైపు కూడా చూడటం లేదు.

You missed