మొన్న ఎంపీ అర్వింద్‌పై నిప్పులు చెరిగిన ఎమ్మెల్సీ క‌విత‌… నిజామాబాద్ చౌర‌స్తాలో చెప్పుతో కొడ‌తాన‌ని క‌ళీకావ‌తారం ఎత్తిన క‌విత‌… ఇప్పుడు రంగంలోకి దిగారు. ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లాలో త‌న ప‌ట్టును నిలుపుకుని త‌న‌దైన ముద్ర‌ను వేసేందుకు రెడీ అయ్యారు. ఎల్లారెడ్డి నంచి త‌న రాజ‌కీయ విశ్వ‌రూపాన్ని చూపేందుకు శ్రీ‌కారం చుట్టారు. ఈ రోజు ఎల్లారెడ్డి నియోజ‌క‌వ‌ర్గం నాగిరెడ్డిపేట మండలం తాండూరులో జ‌రిగిన టీఆరెస్ కార్య‌క‌ర్త‌ల ఆత్మీయ స‌మ్మేళ‌నానికి ఆమె ముఖ్య అతిథిగా వెళ్లారు. ఆమెకు ఈ సంద‌ర్భంగా ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. ఆమె రాక‌.. కార్య‌క్ర‌మం.. ప్ర‌సంగం ప‌ట్ల స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొన్న‌ది. అదే తీరులో ఆమె ఘాటుగానే స్పందించారు. అర్వింద్‌ను వెంటాడి వేటాడి ఓడిస్తాన‌ని శ‌ప‌థం చేసిన ఆమె.. ఇక జిల్లాపై ప‌ట్టు నిలిపేందుకు రంగం సిద్దం చేసుకున్నారు.

ఇన్ని రోజులు పార్టీని ఎమ్మెల్యేల‌కే అప్ప‌గించారామె. కానీ ఎమ్మెల్యేల మ‌ధ్య స‌మ‌న్వ‌యం కొర‌వ‌డి ఎవ‌రికి వారే య‌మునాతీరే అన్న‌ట్టుగా మారి.. క్యాడ‌ర్ ఆగమ‌యింది. నేత‌ల‌కు ప‌ద‌వుల్లేవు. పార్టీ ప‌ద‌వులు లేక నిరాశ‌కు లోవుతున్నారు. ఈ క్ర‌మంలో బీజేపీ పుంజుకుంటూ వ‌స్తున్న క్ర‌మంలో అర్వింద్ నోరుకు అదుపు లేకుండా పోయింది. చూసీ చూసీ ఓపిక న‌శించిన క‌విత‌… త‌న విశ్వ‌రూపం చూపారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆగ‌మ్య‌గోచ‌రంగా ఆగ‌మాగం ఉన్న అసంతృప్త నేత‌లంద‌రినీ ఒక్క‌తాటిపైకి తెచ్చి… బీజేపీ పై స‌మ‌ర‌శంఖం పూరించేందుకు రెడీ అయ్యారు. ఇక ఇందూరు రాజీక‌యాలు మ‌రింత వేడెక్క‌నున్నాయి. రాష్ట్రం మొత్తం ఇందూరు వైపే చూడ‌నుంది. ఉమ్మ‌డి జిల్లాలోని తొమ్మిది నియోజ‌క‌వ‌ర్గాల పై క‌విత త‌న‌దైన ప‌ట్టును నిలుపుకునేందుకు న‌డుం బిగించారు. బీజేపీ ఇక త‌మ‌కు ఎదురే లేద‌ని విర్ర‌వీగుతున్న స‌మ‌యంలో క‌విత ఎంట్రీ… ఇందూరు రాజ‌కీయాల్లో కీల‌క మ‌లుపు. ఇది మున్ముందు మ‌రింత రాజ‌కీయ స‌మరానికి, హోరాహోరీ పోరుకు దారి తీయ‌నుంది.

ఏమైనా చేసుకోండి భయపడే ప్రసక్తే లేదు..ఐటీ, ఈడీ ఏది వచ్చినా నిలబడి కొట్లాడుతాం

కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

ఎల్లారెడ్డి: భారతీయ జనతా పార్టీ ఈడీ, సీబీఐ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలను తమపైకి ఉసిగొల్పినా భయపడే ప్రస్తకే లేదని తేల్చిచెప్పారు. భయపడే తత్వం తెలంగాణ ప్రజల్లో లేదని, నిలబడి కొట్లాడుతామని స్పష్టం చేశారు. రాజకీయంగా బలంగా ఎదిగిన పార్టీ నాయకులను గద్దల్లాగా ఎత్తుకు పోవాలన్న ఆలోచన తప్ప బిజెపి కి ఇంకోటి ఏమీ లేదని స్పష్టం చేశారు. రాముడి పేరు చెప్పాలి రౌడీయిజం చేయాలి అన్నది బిజెపి పద్ధతి అని మండిపడ్డారు. ఏం చేసుకున్నా భయపడే ప్రసక్తే లేదని తెలిసి చెప్పారు. బుధవారం రోజున కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో నిర్వహించిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో మె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ…“అసలు బీజేపీ వాళ్లకు రాష్ట్రంలో ఏం పని ? ‘రామ్ రామ్ జాప్న.. పరాయి లీడర్ ఆప్నా’ అనేదే బిజెపి పని. ఆ పార్టీకి ఒక నాయకుడు లేడు. ఒక సిద్ధాంతం లేదు. వాళ్లు ప్రజలలో లేరు. వాళ్లలో పనిచేసిన వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి ఎన్నికల్లో పోటీ చేయడానికి బీజేపీకి నాయకులు లేరు.

పోటీ చేసినా వాళ్లు ఎన్నికల్లో గెలువరి భావించి కాంగ్రెసు, టిఆర్ఎస్ వంటి పార్టీల్లో పెద్ద లీడర్లపై కేసులు పెట్టి, ఐటీ దాడులు చేయించి ప్రలోభావాలకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. బిజెపిలో చేరకపోతే ఈడీ,ఐటీ సంస్థలను ఉసిగొల్పుతున్నారు. దేన్ని ఉసిగొలిపిన తెలంగాణ ప్రజలు భయపడే వాళ్ళు కాదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎవరినీ వదిలిపెట్టకుండా మన దగ్గర గత నెల రోజులుగా ఐటి దాడులను చేస్తున్నారు. అయినా ఏం భయం లేదు. చట్టబద్ధంగా వ్యాపారాలు చేస్తున్నారు.అధికారులు వివరాలు అడిగితే ఇస్తాం,పత్రాలు ఇస్తాం చూసుకోండి అంతేగాని దాంట్లో భయపెట్టేదేముంది ? ప్రచారం చేసుకోవడానికి ఏముంది? ఎందుకోసం ఇట్ల చేస్తున్నారు ?” అని నిలదీశారు.

 

 

You missed