ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్‌ను నిజామాబాద్‌లోని ఆయన నివాసంలో కలుసుకుని కృతజ్ఞతలు తెలిపారు. తమ సంతోషాన్ని చైర్మన్‌తో పంచుకున్నారు. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న డీఏ, పీఆర్సీల విషయంలో సానుకూలంగా స్పందించి తమకు మేలు జరిగేలా చొరవ చూపిన చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్‌ను, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ రోజే తమకు అసలైన దీపావళి అని, తమ కుటుంబాల్లో ప్రభుత్వ నిర్ణయం వెలుగులు నింపిందని ఆనందం వ్యక్తం చేశారు. బోధన్, ఆర్మూర్, నిజామాబాద్ డిపోల నుంచి వందల మంది ఉద్యోగులు ఆయనను కలిసి మిఠాయి తినిపించి ధన్యవాదాలు తెలిపారు. శాలువాతో సత్కరించారు. మున్ముందు మరింత రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తామని వారు ఈ సందర్భంగా చైర్మన్‌తో తమ సంతోషాన్ని పంచుకున్నారు.
సీఎం కేసీఆర్‌ది పెద్ద మనసు… కార్మికుల సంక్షేమమే ఆయన ధ్యేయం..
ఆర్టీసీ ఉద్యోగులకు మున్ముందు మరింత మంచి రోజులు.. ఇంకా కష్టపడి పనిచేయండి… బాజిరెడ్డి గోవర్దన్, చైర్మన్…
ఈ సందర్బంగా ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి మాట్లాడారు. కార్మికులు ఇంకా కష్టపడి చేయాలని కోరారు. వారికి మున్ముందు మరింత మంచి రోజులు రాబోతున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కార్మికులు చాలా కష్టపడుతున్నరు. కార్మికుల కష్టం వల్లనే ఆర్టీసీకి ఆదాయం వస్తున్నది. ఆర్టీసి ఆదాయం ఎంత పెరిగినా నష్టం తగ్గడం లేదు. ప్రతీరోజు నాలుగైదు కోట్ల నష్టం జరుగుతున్నా..సీఎం కేసీఆర్ ఎంతో దయతో కార్మికుల పట్ల ప్రేమతో వెంటనే 100 కోట్లు మంజూరు చేసి వారికొచ్చే మూడు డీఏలతో పాటు అదనంగా అలవెన్సులు, రిటైర్డ్ ఉద్యోగస్తులకు 40 కోట్ల బకాయిలన్నీ ఇచ్చేశారు. ఆ మరుసటి రోజే సీఎం కేసీఆర్‌ను కలిశాము…పీఆర్సీ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువచ్చినాము… ప్రతీ సంవత్సరం 400 కోట్లు అవుతుంది.. అది మేము కట్టే పరిస్థితుల్లో లేము అని సీఎంకు వివరించాము…తను చూసుకుంటానని హామీ ఇచ్చారాయన…అని వివరించారు.
దీని వల్ల ప్రతీ రోజు, ప్రతీ నెల వేతన భారం అదనంగా 40 కోట్లు భారం పడుతున్నది. అదనపు ఆదాయం లేకున్నా సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో మంజూరు చేయడం జరిగింది … కార్మికులు చాలా సంతోషంగా ఉన్నారు. చాలా రోజులుగా పెండింగ్‌లో ఉన్న వీటన్నింటినీ కేసీఆర్ క్లియర్ చేశారు. నేను వచ్చిన తర్వాత ఐదు డీఏలు వచ్చాయి. పీఆర్సీ కూడా ఇచ్చాం.ఉద్దేశ్యం ఒకటే.. ప్రతీరోజు కష్టపడుతున్న కార్మికులు సంతోషంగా ఉండాలనే మా ఆలోచన. సీఎం కేసీఆర్ చొరవ వల్ల, మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్ ల కలిసి సహకరించడం వల్ల ఇదంతా జరిగింది… అని పేర్కొన్నారు చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్..
ఇదే విధంగా ఇంకా కష్టపడండి…తప్పుకుండా మున్ముందు మరింత మంచి రోజులొస్తయి. రాష్ట్రంలో ఉండే ప్రతీ ఒక్కరు సంతోషంగా ఉండాలని సీఎం ఆలోచన. అందులో భాగంగానే ఇవన్నీ చేస్తూ వస్తున్నారు. అని ఆయన అన్నారు.
బీఏ రాణి, చంద్రకళ, రాజుభాయ్, సావిత్రి, కీర్తి, సరళ, సుమవాణి, శ్రీవాణి, వందన భూలక్మీ, పుష్ప, శేఖర్, వందేమాతరం శ్రీనివాస్, ఆర్ఎం ఆఫీసు నుంచి మహేందర్ రెడ్డి, సంజీవ్‌రెడ్డి తదితర డిపోల నుంచి 150 మంది ఉద్యోగులు పాల్గొన్నారు.