ఆర్టీసీ సంస్థ ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వడానికి ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ ఎట్ట‌కేల‌కు సిగ్నల్ ఇచ్చారు..టిఎస్ ఆర్టిసి కార్పొరేషన్ నుండి ప్రభుత్వానికి ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు మరియు భవనాలు, రవాణా శాఖ ప్రభుత్వ కార్యదర్శి , ఎన్నికల ప్రధాన అధికారికి PRC పర్మిషన్ కోసం నిన్న లేఖ రాశారు. మునుగోడు ఉప ఎన్నికల నియమావళి అమలులో ఉంది. అయినప్పటికీ సంస్థ ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు ఈ ప్రక్రియను ప్రారంభించడానికి అనుమతి ఇవ్వాలని లేఖ రాశారు. ఎన్నికల ప్రధాన అధికారి నిర్ణయం అనంతరం సంస్థ ఉద్యోగులకు వెంటనే పిఆర్సి అమలు చేయ‌డానికి స‌ర్వం సిద్దంగా ఉన్నారు. ఈ విష‌యాన్ని టీఎస్ ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్ వెల్ల‌డించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు టిఎస్ఆర్టిసి సంస్థ ఉద్యోగులకు నిన్న 100 కోట్ల పెండింగ్ బకాయిలు మరియు దీపావళి పండగ సందర్భంగా అడ్వాన్సులు ప్రకటించార‌ని బాజిరెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారని, దానిలో భాగంగానే సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి సంస్థ ఉద్యోగుల పిఆర్సి గురించి చర్చించిన‌ట్లు వివ‌రించారు. పిఆర్సి అమలుకు కేసీఆర్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నారు..

2017 నుండి ఆర్ పి ఎస్ పెండింగ్లో ఉంద‌ని, తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సంస్థ ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు

ఈ ప్రక్రియను వెంటనే ప్రారంభించడానికి కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వి సి సజ్జానార్ ప్రభుత్వానికి లేఖలు రాశార‌ని వివ‌రించారు.దానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర రవాణా మరియు రోడ్డు భవనాల శాఖ ప్రభుత్వ కార్యదర్శి ఎన్నికల ప్రధాన అధికారి గారికి లేఖలు పంపార‌న్నారు. టిఎస్ ఆర్టిసి సంస్థ ఉద్యోగులు మరియు అధికారుల విజ్ఞప్తి మేరకు రోడ్డు మరియు భవనాల శాఖ ప్రభుత్వ కార్యదర్శి
, పీఆర్సీ అమలు చేయాలని ఈసీకి లేఖ రాసిన విష‌యాన్ని చైర్మ‌న్ గుర్తు చేశారు.

మునుగోడు ఉప ఎన్నికల నియమావళి అమలులో ఉందని, అయినప్పటికీ సంస్థ ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు ఈ ప్రక్రియను ప్రారంభించడానికి ప్రభుత్వానికి అనుమతి ఇవ్వాలని రోడ్డు మరియు భవనాల శాఖ ప్రభుత్వ కార్యదర్శి ఎన్నికల ప్రధాన అధికారి లేఖలో కోరిన‌ట్టు తెలిపారు.

అతి త్వరలోనే ఎన్నికల ప్రధాన అధికారి నిర్ణయం అనంతరం ఆర్టిసి సంస్థ ఉద్యోగులకు పీఆర్సిని అమలు చేయడం జరుగుతుందని చైర్మన్ బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్ తెలియజేశారు..

సంస్థ ఉద్యోగులను అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ కంటికి రెప్పలా కాపాడుకుంటామని సంస్థ చైర్మన్ తెలియజేశారు..సీఎం సహకారంతో, ఆశీస్సులతో ఆర్టీసీ సంస్థ ప్రగతి రథచక్రాలు మ‌రింత ప్ర‌గ‌తిప‌థ‌కంలో పరుగులు పెడుతున్నాయని చెప్పారు..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టీసీ ఉద్యోగులకు దీపావ‌ళి ధమాకా.. ఆనందంలో ఉద్యోగులు… సంబ‌రాలు..
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు 3 డిఏలు డిఏ ఏరియర్స్ పండగ అడ్వాన్స్
సకల జనుల సమ్మెలో పాల్గొన్నటువంటి ఆర్టీసీ ఉద్యోగులకు వేతనం , రిటైర్డ్ ఉద్యోగులకు కూడా రావలసినటువంటి ఆర్థికపరమైన అంశాలను పరిగణలోకి తీసుకొని , త్వరలో ఎన్నికల ప్రధాన అధికారి గ అనుమతితో పిఆర్సి లు అమలు చేయుటకు మనస్ఫూర్తిగా ముందుకు వచ్చిన సీఎం కేసీఆర్, మున్సిపల్ మరియు ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు , ఆర్థిక , వైద్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గార్ల‌కు ఆర్టీసీ చైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్ ధ‌న్య‌వాదాలు తెలిపారు.
ఆర్టీసీ ఉద్యోగుల ఆశలు తీర్చినందుకు శ్రామిక వర్గం ఎంతో ఉత్సాహంగా ఉన్నారని, భవిష్యత్తులో మరింతగా శ్రమించి సీఎం కేసీఆర్ గౌరవాన్ని కాపాడుకుంటామని ఆర్టీసీ ఉద్యోగులు అంటున్నార‌ని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టీసీ ఉద్యోగులు కృతజ్ఞత భావంతో ఉన్నారని, సంస్థ నష్టాల్లో ఉన్నప్పటికీ కూడా ఉద్యోగుల కష్టాలను కూడా పరిగణలోకి తీసుకొని సానుకూలంగా స్పందించి ఉద్యోగులను సొంత బిడ్డల్లా కాపాడుకుంటున్న కేసీఆర్‌కు ఉద్యోగులందరూ రుణపడి ఉంటామని ఈ సంద‌ర్బంగా తెలియజేశారు.

You missed